మీ ఓటు ఎవరికేసారో మీకే తెలీదా.?ఇంత పచ్చిగా అబద్దాలు చెప్పొచ్చా..చంద్రబాబుగారూ


నేనెవరికి ఓటేసానో నాకే తెలీదు
ప్రపంచంలో ఎక్కడా ఈవిఎం లు వాడటం లేదు
సిఎస్ ను బదిలి చేశారు..అవినీతి కేసుల్లో ముద్దాయిని పెట్టారు

ఫలితాలు రాకముందే ఇలా మాట్లాడుతూ..ప్రజాస్వామ్యం సంగతి పక్కనబెట్టండి ఓటేసినవారిని అపహా్స్యం చేస్తున్నారు. మొదటి కామెంట్..మీరెవరికి వేసారో మీకే తెలీదంటే నమ్మే వెర్రిబాగులవాళ్లు ఎవరు..అంటే మీ అర్ధం సైకిల్ క ివేసినా కూడా తర్వాత అది ఫ్యాన్ గుర్తుకి మళ్లిస్తారనా..ఇంతకన్నా అన్యాయం ఉందా..అంటే రేపొద్దున వైఎస్సార్సీపీ గెలిచినా..ఇదే వాదన కంటిన్యూ చేసేందుకేనా ఈ హంగామా...ఒకవేళ మీరు చెప్పుకుంటున్నట్లు టిడిపినే గెలిస్తే..అప్పుడేమని మాట మారుస్తారు..?

తెల్లవారుఝాము వరకూ ఓటింగ్ లో పాల్గొనడం అప్రజాస్వామ్యికం ఎలా అవుతుంది..ఓటు వేయాలనే బలమైన కాంక్షకి నిదర్శనంగా చెప్పండి సర్..నిజంగా ఈవిఎంలు మొరాయిస్తే..అవి టిడిపికే కాదు..వైఎస్సార్ కాంగ్రెస్ ఓటర్లకీ ఇబ్బందే కదా..లేదూ అక్కడ ఓట్లేసేది మొత్తం టిడిపివాళ్లే అని మీరు రూలింగ్ ఇస్తే దానికి చేయగలిగింది లేదు
పైగా పోలింగ్ 76శాతం వస్తోందంటే..ఇంకా పోలింగ్ జరగలేదు అని ఎలా చెప్తారు..ఓవేళ మీ లెక్కప్రకారం 100శాతం ఓటింగ్ జరిగేదా...అప్పుడు కదా రీపోలింగ్ పెట్టేది..
ఇంకో మాట ప్రపంచంలో ఎక్కడా ఈవిఎంలు వాడటం లేదట..నిజమేనా..
అవినీతి కేసుల్లో నిందితుడిని సిఎస్ గా చేశారు అని అంటున్నారు..వాస్తవానికి ఆయనపై కేసు కొట్టివేయబడింది కదా..ఐనా ఆ తర్వాత మీరే కదా సాక్షాత్తూ తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఈఓగా వేశారు..అప్పుడు మీకు గుర్తుకురాలేదా కేసులు..దీన్నేమంటారు చంద్రబాబుగారూ అబద్దాలు కాదా...?

Comments