వైఎస్ జగన్ అమరావతికి రాని కారణం ఇదేనా..స్పీకర్ గారూ ఈ శాపనార్ధాలేంటి?


అసలే ఆయన స్పీకర్..అందులో మళ్లీ పోటీ చేశారు..పోటీలో వ్యతిరేకత ఎదుర్కొన్నారంటూ ప్రచారం జరుగుతోంది..ఆ పై దాడి ఒకటి..ఇప్పుడు అందులోనే ఆయనపైనా కేసులు రిజిస్టర్ చేసారు..ఓ రకంగా కోడెలపై కేసులు కొత్తేం కాదు..అన్నిటిలోనూ సమర్ధవంతంగా తప్పించుకుని వచ్చిన నాయకుడాయన. ఐతే ిఇప్పుడు మాత్రం జరిగింది తనై దాడి అని..ఇలా చెయ్యెత్తి కొట్టడమనేది నా రాజకీయ జీవితంలోనే ఎరగనని చెప్పుకుంటున్నారు..కాబట్టి బాగానే ఇన్సల్ట్ గా పీలవుతున్నారని తెలుస్తుంది.

కానీ ఆయన ఐదేళ్లలో మొదటిసారిగా గుంటూరు కార్యాలయానికి వచ్చి మాట్లాడారంటున్నారు..కానీ ఆయన ఎక్కడా తాను టిడిపికి చెందిన వ్యక్తిగా చెప్పుకోవడానికి వెనకాడింది లేదు..ఠాఠ్..రాజ్యాంగబద్ద పదవైతే నాకేంటి..నాకు ఈ పదవి ఇచ్చిందే పార్టీ అన్నట్లుగా మాట్లాడారు కూడా..ఐతే ఓ స్పీకర్ పార్టీ కార్యాలయంలో కూర్చుని మాట్లాడటం మాత్రం తప్పు..ఎందుకో తెలుసా...మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్..ఎంసిసి..ఫలితాలు వెలువడే మే 23 వరకూ అమలులో ఉంటుంది..ఇది తెలీదా..లేక ఈసీకి కోరలు లేవనా..ఈసికి కోరలు లేకపోయినా..ఎలా కాటు వేయగలదో...మాయావతి, యోగీ ఆదిత్యనాధ్, అజంఖాన్ విషయంలో చూశాం కదా..మరిప్పుడెవరైనా ఫిర్యాదు చేస్తే పరిస్థితి ఏంటి పైగా అమరావతి రాని జగన్ కి ఏపీ ఓట్లెందుకు అని..అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు జీతాలెందుకు అని జనాలే ఆయన్ని ప్రశ్నిస్తున్నారట ?    ఎవరు బాబూ అంత మేధావులు మీ టిడిపి కార్యకర్తలేనా. ఐనా జీతాలు ఆపించే శక్తి..అధికారం మీ చేతిలో ఉంది..ఎఁదుకు ఆపలేదు..అంటే మీ విధి మీరు నిర్వర్తించలేకపోయారు..ఔనా..సరే అది వదిలేద్దాం..జగన్ మోహన్ రెడ్డి ఎందుకు అమరాతిలో ఉండటం లేదనేగా మీ ఇంకో ప్రశ్న..అమరావతి వస్తే చాలు ఫోన్లు ట్యాప్ చేసి..ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడుతున్నదీ తెలుసుకుంటుంటే..ఎవరైనా ఎలా ఉండగలరు..? ఇది వాస్తవమో కాదో..ప్రభుత్వంలో ఉన్నవారికి తెలుసని అంటున్నారు..జగన్ ఈ జన్మలో సిఎం కాలేరని శాపనార్ధాలు పెడుతున్నారు..అలా అవకపోవడానికి మీకున్న అభ్యంతరం ఏంటి సర్..పొరుగు రాష్ట్రంలో ఎంతమంది ఎమ్మెల్యేలతో కుమారస్వామి సిఎం అయ్యాడో చూసాక కూడా..ఇలాంటీ కామెంట్లతో సెల్ఫ్ గోల్ ఎందుకు చేసుకోవడం?

Comments

  1. ప్రభుత్వ పదవి పూర్తయి తొందరలో కొత్త ప్రభుత్వ కాలం మొదలవ్వబోతోంది. ఇప్పట్లో శాసనసభ సమావేశాలు కూడా లేవు. అయినప్పటికీ స్పీకర్ ఒక పార్టీ ఆఫీసులో కూర్చొని మాట్లాడటం తప్పు అంటున్నారు. సరే. ఈ లెక్కన కేసుల్లో జైలులో ఉండి వచ్చిన జగన్ గారు శాసనసభ లో అడుగు పెట్టొచ్చా? అఫ్కోర్స్ సాక్షులని ప్రభావితం చెయ్యకూడదు కాబట్టే అతన్ని జైల్లో పెట్టారని మీరంటున్నారు. ఆ లెక్కన చూసినా శాసనసభ లో అడుగు పెడితే సాక్ష్యాలని మరింత ఈజీగా మాయం చెయ్యగలరు కదా.

    ReplyDelete
  2. మీరు చెప్తున్న లాజిక్కే తీసుకుంటే..చంద్రబాబుగారు కూడా ముఖ్యమంత్రి పదవిని వదిలేసి..టిడిపి అధ్యక్షుడిగా మెలగమనండి..స్పీకర్ , రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి..గవర్నర్..ఈ పోస్టుల్లో పార్టీల లీడర్లు ఉన్నా పార్టీ ఆఫీసులలో కూర్చోరాదు..కాదు మేం కూర్చుంటాం అని మూర్ఖంగా వాదించేవాళ్లకో దండం అంతే.అందుకే ఈ పదవులకు పార్టీల నుంచి కాకుండా ఇతర రంగాలనుంచి నామినేట్ చేయాలని అంటారు..

    ReplyDelete
    Replies
    1. వాళ్ళు కూర్చోవడం తప్పు కాదని నేననలేదు. కాని ఎన్నికలైపోయి రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే ఈ టైం లో కూడా ఇలాంటి చిన్నచిన్న విషయాలని విమర్శించటం దండగ అనే ఉద్దేశం. ఎందుకంటే చిన్నచిన్న విషయాలని పట్టించుకుంటే జగన్ గారి విషయంలో బొచ్చెడు దొరుకుతాయి.

      Delete
  3. సాక్షులని ప్రభావితం చెయ్యకూడదు కాబట్టే అతన్ని జైల్లో పెట్టారని అంటున్నారు. ఆ లెక్కన చూసినా శాసనసభ లో అడుగు పెడితే సాక్ష్యాలని మరింత ఈజీగా మాయం చెయ్యగలరు కదా.
    సామాన్యులకు ఇటువంటి లాజిక్ లు అర్ధం కావు. మేతావులకే అర్ధం అవుతాయి.ఎవరేం చేసినా పర్లేదు మా రాష్ట్రం మాత్రం సక్కగుండాలె ! పనిలోపనిగా వెంకయ్యనాయుడిని కూడా కొట్టేస్తే ఒక పని అయిపోయేది.

    ReplyDelete

Post a Comment