ఛీ పురాణాలనూ వదలని ఈనాటి దరిద్రపు రాతలు


ఘనత వహించిన ఈ దినం పత్రికవారు తమ వ్యతిరేకులపై బురద జల్లడానికో విషం కక్కడానికో పురాణాలను కూడా ఎలా అన్వయిస్తారో జస్ట్ ఈ ఫోటోలు చూడండి..అసలు రామాయణంలోని అంశాలకు నేటి రాజకీయాలకు లంకెపెట్టి రాయమని అడిగినవాడి ముడ్డిమీద పెట్టి తన్నాలి ముందు రాసిన వీళ్లకి ఉండాలి బుద్ది..పైగా రాముడి గొప్పతనం గురించి రాసే ముందు..రాజాశ్రయం కోసం ఏది పడితే అది రాయనని చెప్పిన కవుల గురించిఈ రాతగాళ్లకి తెలిసి ఉంటే ఇలాంటి విపరీత వ్యాఖ్యానాలు చేయకుండా తమ పని తాము చూసుకునేవాళ్లు..ఇష్టం వచ్చినట్లు ప్రతి అంశాన్ని అన్వయించి రాజగురువింద దగ్గర శభాష్ అనుకోవచ్చేమో కానీ..రామాయణ ద్రోహం చేసినట్లే అనుకోవాలి

రాముడు అడవులకు వెళ్తే అయోధ్య శిధిలం అయిపోతుందట..అలా అవ్వాలని ప్రజలు అనుకుని రాముడివెంట అరణ్యాలకు నడిచారట..అంతవరకూ  ఎవరైనా నమ్ముతారు..కానీ ఆ తర్వాత సదరు కవయిత్రి ఉపమానం చూడండి..నాకు రాజ్యం దక్కలేదు కదా..ఇక్కడి ప్రజలు ఎలా ఉంటారో చూస్తా..
అభివృధ్దిని అడ్డుకుంటా అంటూ రంకెలు వేసే నేతల్లాంటి వాడు కాదు రాముడు అంటూ పనికిమాలిన పోలిక..అక్కడికేదో వీళ్లపాలిక రాముడు మిగిలినవాళ్లు
రావణాసురులులాగా..


పైగా ఈమే రాసుకొచ్చింది..భరతుడు రాగానే ఏం నాయనా స్త్రీలు చెప్పిన మాట విని అన్యాయాలకు పాల్పడటం లేదు కదా..అన్నదట ఈ లైన్ పట్టుకునే కదా..రంగనాయకమ్మ విషవృక్షంలో రాముడికి కైకేయి మీద ఉన్న ద్వేషాన్ని అలా వెల్లిబుచ్చాడని చెప్పింది..ఓ ఐదారు పేజీలకు సరిపడా కథనం ఉండాలంటే ఇలా గిట్టని నేతలపై కూడా పురాణాలను అడ్డం పెట్టుకుని బురద జల్లడమేనా పాత్రికేయం..

ఈమెగారి ఉద్దేశం ప్రకారం ఓట్లేసారు కాబట్టి, సదరు పాలకులు ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహించాలి..ఆస్తులు తక్కువరేటుకి అస్మదీయులకు కట్టబెట్టుకున్నా నోరు మూసుకుని పడి ఉండాలి..అప్పుడది రామరాజ్యం అవుతుంది..అంతేనా అంతే సర్..!

Comments

  1. వాళ్ళు జస్ట్ గుమ్మడికాయ అని రాశారు. దొంగ అని కూడా ఇంకా అనలేదు. అప్పుడే భుజాలు తడిమేసుకుంటున్నారే!!

    ReplyDelete
  2. మీకు ఇలా అన్పిస్తుంది కాబట్టే..భారతాలు..రామాయణాలు రాజకీయాలకు బ్రహ్మాండంగా అన్వయించుకుంటున్నారు..అనని మాటలు అన్నట్లుగా..అసలు రాముడి పేరుమీద ఏది పడితే అది రాయడం అందరికీ సమ్మతమే అనుకుంటా అయితే..! శభాష్

    ReplyDelete
    Replies
    1. వ్యాసంలో ఎక్కడా ఏ నాయకుడి పేరూ రాయలేదు. అయినా చెడ్డవ్యక్తుల గురించి రచయిత రాసిన మాటలు చదివినప్పుడు ఎవరికైనా తమ అభిమాన నాయకులు గుర్తొచ్చి ఆపై ఫీలైపోతే తమ నాయకులని తామే దుర్మార్గులుగా ఒప్పేసుకున్నట్లు. ఒకవేళ గుర్తొచ్చినా"మనోడి గురించి వీడు ఇలాగే మాట్లాడుతాడు. ఇందులో కొత్త ఏముంది"అని నవ్వుకుని పక్కన పడేసే వాడు నిజమైన అభిమాని!

      Delete

Post a Comment