రష్యా వాడే మన ఈవిఎంలు హ్యాక్ చేస్తున్నాడట..మరి రేపు మనం గెలిస్తే..ఎలాగబ్బా..?


ఈవిఎంలకు నోరు ఉండదు..దానిపై డౌట్లు తీర్చాల్సిన ఎన్నికల కమిషన్ అసలే పట్టించుకోదు..ఇకనేం ఎక్కడ ఓడిపోతామనే అనుమానం కలిగినా హ్యాపీగా సదరు పరమాణు ఎంపిక యంత్రాలపై పడిపోవచ్చు. తిరిగి తన శీలసంధతని అది నిరూపించుకోలేదు కదా..ముందు ఆంధ్రప్రదేశ్..తర్వాత పశ్చిమబెంగాల్..ఇప్పుడు కర్నాటక, ఉత్తరప్రదేశ్‌లో ఈవిఎంలు పని చేయడం లేదంటూ  గగ్గోలు పెట్టే ప్రయత్నాలు బానే జరిగాయ్. 

అఖిలేష్ యాదవ్ అయితే మరీ ఓ అడుగు ముందుకేసి ఏ బటన్ నొక్కినా..బిజెపికే పడుతుందంటూ ముందస్తు రాగం తీసేశారు కూడా ఏదైనా విపక్షాల మాట బాట ఒకటేగా కన్పిస్తుందిక్కడ మాత్రమే. కలిసి పోటీ చేసినా చేయకపోయినా..పైగా చంద్రబాబుగారిది..అఖిలేష్‌ది ఒకటే గుర్తు కూడా..సైకిలే 

ఇలాంటి సమయంలోనే ఢిల్లీలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుగారు మరో డైలాగ్ కూడా వేసారు..ఈవిఎంలను రష్యా నుంచి హ్యాక్ చేస్తున్నారట..ఇది డౌట్ వదంతి..పుకారు ..ఇందులో వాస్తవం ఉఁదో లేదో తెలీదు మరి అని చివర్లో సన్నాయిరాగం కూడా ఆలపించారు. ఒక పెద్ద దేశంలో ఐదేళ్లపాటు పాలికను ఎన్నుకునే యంత్రాల విషయంలో అనుమానాలను గట్టిగా విన్పించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు కానీ..ఇలా రష్యాలో చేయొచ్చు..అమెరికావాడే ఇలా చేస్తున్నాడు..అని రచ్చబండ దగ్గర మాట్లాడినట్లు మాట్లాడటం  రెండు దశాబ్దాల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి చేయాల్సిన పని కాదు..

Comments