నాన్న అంటే నానీ చాలావరకూ చూపించాడు


సినిమా కాదు..ఓ జీవితం అన్పిస్తోంది..చాలా రోజుల తర్వాత సినిమా చూసిన తర్వాత కూడా వెంటాడే పాత్రలు..జెర్సీ సొంతం
కొడుకు కోరిక కోసం జీవితం కోల్పోయిన తండ్రి కథే జెర్సీ..
జీవితంలో ఎలా సర్దుకుపోవాలో తెలీక జీవితం కోల్పోయిన వ్యక్తి కథే జెర్సీ
ఒక ఉద్యోగం పోతే..ఇంకో ఉద్యోగం తెచ్చుకోలేక..అసమర్ధుడిగా మిగలలేక కొడుక్కి మాత్రం హీరోగా మిగలాలనే తపనతో జీవించిన హీరో కథే జెర్సీ
ప్రేమని ప్రేమించి..ప్రేమకోసం ప్రేమని కోల్పోయి చివరికి గొప్ప ప్రేమికుడిగా మిగిలిన కథ జెర్సీ

...ఇలా ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చు..కానీ ఇందులో కనీసం నాలుగుసార్లు కళ్లవెంబడి నీళ్లు తిరగని మనిషి ఉండడు.. ఆ క్షణాల్లోనే

కుటుంబాన్ని ప్రేమించేవారు చూడాల్సిన సినిమా జెర్సీ..ఇంత ఇదిగా ఎందుకు ప్రమోషన్ అంటే..ఇది మనుషుల సినిమా కాబట్టి..

ఓ రకంగా చూస్తే ఇంట్రావర్ట్‌లా మెలగడమే ఈ సినిమాలో నానీ తప్పులా అన్పిస్తుంది..తాను ఏమనుకుంటున్నదీ చెప్పలేకపోవడం
చేయాల్సిన పని చేయకుండా బలహీనతలను అధిగమించకపోవడంతోనే క్రికెట్ తప్ప ఇంకోటి చేయలేని వ్యక్తిలా మార్చేసిందతన్ని.
కానీ కొడుకు హీరోలా చూడాలంటే అతని ముందు ఉన్న ఏకైక మార్గం క్రికెట్టే..కానీ ఆ క్రికెట్టే అతని ప్రాణాలు తీస్తుంది
ఇది తెలిసి కూడా ఆడటమే ఈ సినిమా..ముందు ప్రేమికుడిగా..తర్వాత భర్తగా..ఆ తర్వాత తండ్రిగా నాని ఎక్కడా కన్పించడు అందుకే
మనల్ని సినిమా పూర్తయ్యేంతవరకే కాదు..తర్వాత కూడా వెంటాడే సినిమా అయింది..

నిజంగా నానీ సినిమా రిలీజ్ కి ముందు చెప్పినట్లు.."ఎన్నో హిట్లు రావచ్చు పోవచ్చు..కానీ ఇది మాత్రం హార్ట్ టచింగ్..స్పెషల్.."ఇది వాస్తవం

Comments