అమ్మ అజో..జగన్‌ని మోడీకి దగ్గర చేసింది ఆయనేనా..భలే తెలిసిపోయిందే మీకు


ఆంధ్రప్రదేశ్ గురించి వారికెందుకు వీరికెందుకు అంటూ కథనాలు రాసే ఇతగాడికి మాత్రం ఎందుకో చెప్పడు..సరే పాత్రికేయం ముసుగులో ఏదేదో చేసుకునేవారి విచక్షణను ఎవరు ప్రశ్నించగలరు..ఐతే గవర్నర్ నరసింహన్..చంద్రబాబుకి వ్యతిరేకంగా వ్యవహరించారట..ఐతే ఆయన్ని కొనసాగేలా చేసింది మాత్రం సుజనా చౌదరి ద్వారా చంద్రబాబేనట..ఇంతవరకూ తనకి సహకరించని వారి గురించి ఎవరిపైనైనా ఆగ్రహం వ్యక్తం చేయకుండా చంద్రబాబుగారు ఊరుకుంటారా..
చిన్న ఎస్ఐ నుంచి..(ఎస్ఐ చిన్నడేమీ కాదు) ఎంపి కాండిడేట్ అయినా.., ఇక మాజీ సిఎస్..మాజీ మంత్రులు ఇలా ఎవరైనా తన నుంచి బైటికి వెళ్లిపోతే వదలకుండా వెంటాడి మరీ విమర్శించే చంద్రబాబు ఐదేళ్లుగా తనకి వ్యతిరేకంగా రిపోర్టులు ఇచ్చే గవర్నర్ ని వదలకుండా ఉంటారా..మొన్నామధ్య ఏంటీ గవర్నర్ అంటూ ఆగ్రహించిన సంగతి గుర్తుంది కదా..విజయసాయిరెడ్డి..రాష్ట్రపతి కాకముందు రామ్ నాధ్ కోవింద్ ని కలిసినప్పుడే ఎటకారం ఆడిన చంద్రబాబు..గవర్నర్ స్వయంగా జగన్‌ని మోడీకి దగ్గర చేస్తుంటే ఎందుకు ఊరుకున్నారు..
సరే గవర్నర్ వ్యవస్థ వద్దని టిడిపి పోరాటం ఎప్పటికప్పుడు చే్స్తుందనుకోండి( ఎన్టీఆర్‌కి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ లాగా) ..కానీ నేను మీకు అనుకూలంగా వ్యవహరిస్తా..అనగానే ఒప్పుకున్నారట..అంటే మీకు అనుకూలంగా వ్యవహరిస్తే..గవర్నర్ వ్యవస్థ భేషో భేషు..లేదంటే తుస్సో..తుస్సా..?

పైన రాతలు చూస్తే..ఫలానా ఆయన ద్రోహం చేసారని చెప్పడానికి మాత్రం డైరక్ట ్ పదాలు..వ్యాక్యలే..కానీ ఫలానా ఆయన్ని దగ్గర చేయడం..వార్తలు అందించారు ..దగ్గర మాత్రం అన్నీ అట..చెప్పారట..విన్నారట..బాబుకి  ఎవరు పడకపోతే వాళ్లు ఏపీకి ద్రోహం చేసేవాళ్లు అంతేగా..అవును సార్..అంతే

Comments

  1. ఆవార్తని మీరు నమ్మాలి. ఎందుకంటే ఆ వార్త సేకరించిన వ్యక్తి భార్య చెల్లెలి ఫ్రెండు రెండోమొగుడి మూడో పెళ్ళాం పెదనాన్న చిన్నకొడుకు గవర్నర్ గారి ఆఫీసులో స్వీపర్ గా పని చేస్తున్నాడు. ఓసారి గవర్నర్ గారు హార్డ్ డిస్క్ ని తుడవమంటే ఈయనకి భక్తి ఎక్కువైపోయి కడిగి ఆరబెడుతుంటే అందులోంచి DVD కిందపడిందట. ఏవో రహస్యాలుంటాయని కించిత్ అత్యాశతో ఇంటికెళ్లి చూస్తే పైన ఉన్న ఫోటో దొరికి ఉప్పులాంటి నిజం తెలిసిపోయిందట!! కాలక్షేప బఠానిలు కొనుక్కునేందుకు డబ్బుల్లేక ఈ వార్తని అమ్ముకోవలసి వచ్చిందట😮

    ReplyDelete
  2. సాక్షాత్తూ అజిత్ డోవల్ ఆంతరంగికుడిగా చెప్పబడుతున్న నరసింహన్ ఆఫ్టరాల్ సుజనా చౌదరి ద్వారా పైరవీ చేయించుకునే దౌర్భాగ్యం ఎందుకు? ఈ మాత్రం సోయి లేకుండా కథనాలు వడ్డించావా పచ్చ కామెర్ల కులగజ్జి వేమూరీ?

    ReplyDelete
  3. సదరు గవర్నర్ గారు గులాం గ్యాంగ్ కి అనుకూలంగా తీర్పులూ, చేర్పులూ చేస్తూ యాదగిరిగుట్టలో పడి పొర్లుదండాలు పెడుతూ ఉంటారు. ఆయనకి ఇక్కడ గుళ్ళ చుట్టూ తిరగడంతోనే సమయం చాలడం లేదు ఢిల్లీ వెళ్ళి పైరవీలు చేసేంత దృశ్యం లేదు అక్కడ గుళ్ళూ లేవు.

    ఆ వార్త సేకరించిన వ్యక్తి భార్య చెల్లెలి ఫ్రెండు రెండోమొగుడి మూడో పెళ్ళాం పెదనాన్న చిన్నకొడుకు ....Super :)



    ReplyDelete

Post a Comment