చీఫ్ జస్టిస్ పై ఆరోపణలు..ఇప్పుడేం చేయాలి


తనని కుట్రపూరితంగా తొలగించేందుకే లైంగికవేధింపుల ఫిర్యాదు చేసినట్లు తరుణ్ గొగోయ్ చెప్పుకొచ్చారు..అసలిలాంటి వ్యవహారాలు న్యాయవ్యవస్థకే ముప్ప తెస్తాయంటూ వాపోయారాయన. ఏదైతే అక్టోబర్ 11న సదరు లేడీని వేధించారని అంటున్నారో..ఆ రోజునే కాదు..ఎప్పుడూ సిజేఐ నివాసంలో కానీ ఇంకెక్కడా కానీ ఆయన్ని సదరు లేడీ కలిసే వీలే లేదని..తారస పడే డ్యూటీలో కూడా ఆమె లేదని సుప్రీంకోర్టు ఆఫ్ ఇఁడియా సెక్రటరియేట్ చెప్తోంది
పైగా ఆ లేడీ..ఆమె భర్త..తమ్ముడు అందరిపై కేసులు ఉన్నట్లు తెలుస్తోంది..ఐతే ఇవన్నీ కూడా విచారణకు అడ్డంకులు కాజాలావు..అలానే ఆరోపణలు చేసినంత మాత్రాన సిజేఐ తప్పు చేశారనీ కాదు..ఎందుకంటే..న్యాయం ఎవరికైనా ఒకటే..కొన్ని పదవులపై విచారణ జరగకూడదనే ( చిన్న చిన్న ఫిర్యాదుల ఆధారంగా) రక్షణ ఉంటే ఉండొచ్చేమో కానీ..హోదాలను బట్టి..అసలు కేసులే పెట్టకూడదని ఎక్కడా లేదు..ఎందుకంటే..ఏ వ్యవస్థలైనా..చట్టానికి లోబడే ఉండాలి..ఎప్పుడో ఏప్రిల్లోనే ఈ లేడీ సిజేఐపై ఫిర్యాదులు చేసిందనేది మర ో వాస్తవం. ఐతే గత ఏడాది అక్టోబర్ లో ఇన్సిడెంట్ జరిగితే దాన్ని ఏప్రిల్ వరకూ ఎందుకు దాచిందనేది మరో ప్రశ్న..

ఐతే సిజెఐ కానీ..మరో జస్టిస్ రమణ కానీ..న్యాయవ్యవస్థని కూడా తమ చెప్పుచేతల్లో ఉఁచుకోవాలనే ప్రయత్నం జరుగుతుందని ఆరోపణలు చేస్తున్నారు..వాటికి కాలమే సమాధానం చెప్పాలి..ఐతే న్యాయవ్యవస్థలో ఉన్నంతమాత్రాన అందరూ నిప్పులు కడిగిన ముత్యాలైతే కాదు కదా



Comments