లగడపాటి వేశాడుగా బాంబు..కానీ 5 రోజుల్లో నిజం


ఒక్క మాట..చాలు ఎంత ఆనందమో..టిడిపి శిబిరంలో..పైకి ఎన్ని చెప్తున్నా..బైట నుంచి వచ్చే టాక్ వింటేనే ఆ ధీమా వేరు. అదే జరిగింది ఇప్పుడు లగడపాటి ఏదో పిలిచినట్లు వచ్చి..తెలంగాణలో కారు..ఆంద్రప్రదేశ్ లో సైకిల్ అంటూ
సింగిల్ డైలాగ్‌తో మొత్తం సీనంతా మార్చేసినట్లు కన్పిస్తోంది..టిడిపి నేతల ఆనందానికి ఇక పట్టపగ్గాలు లేవు..రేపు వచ్చే ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఇదేరకంగా వస్తే..ఇక టిడిపి విజయం ఖాయం అన్నట్లుగానే సీన్ కన్పిస్తది..మే 23కి ముందే తమ గెలుపు ఖాయం అన్నట్లు సంబరాలు జరుగుతాయ్

కానీ దీనికి కౌంటర్లు ఇవ్వడం కూడా కామన్ గానే జరిగిపోతున్నాయ్. తమకి నచ్చని రీతిలో ఫలితాలను అంచనా వేిసినప్పుడు వచ్చే చిక్కే ఇది. వాళ్లకి కులాలను అంటగట్టడం..పార్టీల రంగు పులమడం మామూలే..కానీ వాస్తవం ఏంటంటే లగడపాటి వ్యవహారశైలి గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో విషయంలో అలాంట ివాదనకి బలం చేకూర్చింది. ఓ వైపు బ్రహ్మాండంగా టిఆర్ఎస్ గెలుస్తుంటే మహాకూటమి గెలుస్తుందని చెప్పడం అది అట్టర్ ఫ్లాప్  అవడం చూసాం

వైఎస్సార్సీపీ విషయానికి వస్తే..తానే గెలుస్తానని ఆ పార్టీ చెప్పుకుంటోంది..ఇలాంటి సందర్భంలో దానికి యాంటీగా ఎవరు మాట్లాడినా విమర్శించడం సహజం..కానీ ఎగ్జిట్ పోల్స్ కి ట్రైలర్ విడుదల చేయడంతోనే అంతా అయిపోదు..చాలా జరుగుతుంది..మే 23న కౌంటింగ్ జరుగుతున్నప్పుడు వచ్చే సౌండ్ వేరుగా ఉంటుంది..రిజల్ట్స్ వేరుగా ఉంటాయ్..అనే మాటలనే వైఎస్సార్సీపీ నేతలు చెప్తున్నారు..వాస్తవంగా ఏప్రిల్ 11న క్లోజైన పోలింగ్ గురించి మే 23 వరకూ జరుగుతున్నట్లు మాట్లాడుకోవడమే విచిత్రం..అసలు తీర్పు ఏప్రిల 11నే ఇచ్చేసారు..అది ఓ వారం అటూ ఓ వారం ఇటూ లేదు..మనం అలా మాట్లాడుకుంటున్నాం అంతే

Comments

  1. సర్వేలదేముంది. "నిప్పులు కక్కుకుంటూ నింగికెగిరిపోతుంది"అని ఒక ఛానెల్ చెప్తే "నెత్తురు కక్కుకుంటూ నేలకు రాలిపోతుంది" అని ఇంకో ఛానెల్ చెబుతుంది. చూద్దాం ఎవరి సుడి ఏ స్పీడ్ లో తిరిగిందో!!

    ReplyDelete

Post a Comment