మోడీకి అసలైన స్నేహితులు వీళ్లిద్దరే..గెలుపు ఖాయం చేసారుకాగల కార్యం గంధర్వులు తీర్చడం అంటే..ఇదే..! చివరి దశలో ఇంకో వందసీట్లు ఉన్నాయ్..ఇవే కీలకం..ఈ వందలో 80 సీట్లు తెచ్చుకున్నా..చాలు బిజెపి గట్టెక్కేస్తుంది..అందులోనూ మోడీ మళ్లీ గద్దెక్కేస్తాడు..మరి ఇలాంటి టైమ్‌లో ఏం చేయాలి..అదే తెలీక మోడీ నానాహైరానా పడుతూ..కాసేపు సైన్యం అంటాడు..కాసేపు నేనే వాళ్ల రాడార్లకి దొరక్కుండా మబ్బులు అడ్డం వస్తాయని ఓ మంపు కథా చెప్పాడు..దానికి ఈసీ కూడా బానే హెల్ప్ చేస్తోంది పాపం..ఐనా బిజెపికి టెన్షనే


అదుగో అప్పుడు దిగారు మోడీకి రహస్యస్నేహితులు రంగంలోకి దిగారు..అచ్చంగా 2014లో ఎలాగైతే తన సాయంతో మోడీకి బోలెడంత సానుభూతి తెచ్చిపెట్టాడో..మణిశంకర్ అయ్యర్ అదే విధంగా ఇప్పుడు 
తన స్నేహహస్తం మోడీకి అందించాడు..మోడీ ఓ నీచ్ వ్యక్తి అంటూ సంపాదకీయం రాసుకొచ్చాడు..గతంలోనే ఇలా చేయడం తప్పు అని అందరి చేతా చీవాట్లు తిన్న మణిశంకర్ ఇలా చేయడం వెనుక కథేం పెద్దగా లేదు..కాంగ్రెస్ అతన్ని దూరం పెట్టింది. అందుకే ఐదేళ్ల క్రితం ఇప్పుడు మోడీపై కామెంట్లు చేయడం ద్వారా పార్టీకి నష్టం చేకూర్చి తన కసి తీర్చుకుంటుంటాడు..ఇతగాడి నోటి దురుసుతనం ఏ స్థాయి అంటే.."ములాయం సింగ్ యాదవ్ అచ్చం నాలానే ఉంటాడు..వాడో వెధవ..మా నాన్న ఉత్తరప్రదేశ్ రెండుమూడుసార్లు వెళ్లాడు..మరి ఈ విషయం ఓసారి ములాయం తల్లిని అడిగి తెలుసుకోండి వాడెందుకు నాలా ఉంటాడో " అంటూ జుగుప్సాకరమైన కామెంట్లు చేసాడు కూడా


ఇక రెండో స్నేహితుడు రాహుల్ గాంధీ కి నాలెడ్జ్ టీమ్ అని ఒకటి ఏడిసింది ఆ టీమ్ కి ప్రెసిడెంట్ లాంటి వాడు..శామ్ పిట్రోడా..ఇతగాడి పేరు సత్యనారాయణో..సత్యనో..అయితే శామ్ పిట్రోడా అంటూ పిల్లిగడ్డంతో బ్రాండ్ బిల్డప్ ఇస్తూ తిరిగేవాడు..రాజీవ్ గాంధీకి కూడా సలహాలిచ్చానని చెప్పుకుంటుంటాడు..ఆరో దశ పోలింగ్ కి ముందు సిక్కులు ఊచకోత జరిగింది..జరిగిందేదో జరిగింది..ఐతే ఏంటి...హా...హా( హువా హువాతో క్యా..అంటూ సిక్కు మతస్థులను రెచ్చగొట్టాడు..ఇప్పుడు పంజాబ్, ఢిల్లీ, హర్యానాలో పోలింగ్ ఉన్న సీట్లపై కాంగ్రెస్ దాదాపు ఆశ వదిలేసుకోవాల్సిన  స్థితి ఏర్పడింది..అలా ఈయన కూడా మోడీకి బాగా హెల్ప్ చేశాడు..రేపు మే 23నో..మే 24నో..ఫలితాల్లో చూసుకుందాం వీరిద్దరి పనితనాన్ని

Comments