పవన్ కల్యాణ్ బై బై..ఈ ఓటమికి కారణం నువ్వే


పవన్ కల్యాణ్ ఈరోజున నిన్ను అమాయకంగా నమ్మి ఓట్లేసిన జనాన్ని ఎలా వంచించావో..చూసావా..దానికి ఫలితం ఎలా వచ్చిందో చూశావా..చివరికి నిన్నే గెలిపించని పార్టీకి అధ్యక్షుడివి నువ్వు..ఈ ఓటమికి బాధ్యత తీసుకోవా...రాజీనామా చేయి..పార్టీలో ఓ సైనికుడిలా పని చేయి..ఇదే ఓ లెటర్ సోషల్ మీడియాలో కన్పించింది..
నీకున్న క్రేజ్ కి ఆంధ్రదేశంలో పది సీట్లు తెచ్చుకోవడం పెద్ద విషయమే కాదు..కానీ పవన్ కల్యాణ్ ఒక్కడంటే ఒక్క ఎమ్మెల్యేని గెలిపించుకోవడానికి ఇన్ని ఊళ్లు తిరగాలా..నిజంగా ఇలా ఆలోచిస్తే చాలదా...పవన్ రాజకీయంలో పారదర్శకత ఎంతో తెలియడానికి..

ఎక్కడైనా పార్టీ అంటే పాలకపక్షాన్ని నిలదీయాలి..కానీ నువ్వేం చేశావ్..ముఖ్యమంత్రిగా ఉన్నది వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలా భావిస్తూ..అతన్నే టార్గెట్ చేసావ్..ఇది ఒకటి నీకు తెలీకుండా అమాయకత్వం అజ్ఞానంతో చేసి ఉండాలి..లేదంటే ప్యాకేజీకి అమ్ముడుపోయి చేసి ఉఁడాలి..ఖచ్చితంగా ఈ రెండింటిలో ఒకటి నిజం..ఏదో నువ్వే తేల్చుకుని జనసైనికులకు చెప్పు..అక్కడికేదో ఉత్తరాంధ్రలో నీకు పట్టుందని నాలుగు ఛానళ్లు...పత్రికలు రాయగానే నిజమని నమ్మేయడమేనా..నిజంగా నువ్ నిలదీయాలనుకుంటే ఎన్నెన్ని మలుపులు తిరిగిన..తిప్పిన చంద్రబాబుని నిలదీయకుండా..చివరి పదిరోజుల్లో జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడమే నువ్ చేసిన తప్పు..అంటే జగన్ ని తిట్టమనొద్దని కాదు..నీ లక్ష్యం కనీసం ఓ పదిమంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం అయినప్పుడు పాలకపక్షాన్ని బాధ్యులు చేయాలి కానీ..విపక్షాన్ని టార్గెట్ చేస్తే..జనం నీకెందుకు ఓట్లు వేస్తారు..ప్రతిదీ మేధావిలాగా నీకొక్కడికే తెలిసినట్లు..మార్పు వచ్చింది..ఇదే నే కోరుకుంది అని జుట్టెగరేయడం కాదు..

నువ్వు ఓడిపోయావు...నీ అన్నా ఓడిపోయాడు..ఓటమి తప్పు కాదు..కానీ పోటీ చేసిన ఉద్దేశమే తప్పు అయినప్పుడు ఫలితం అలానే వస్తుంది..ఇదే జనం నమ్మారు కాబట్టే..నీ వెంట లేరు..జనం నీ వెంటలేరని ఒప్పుకో..అంతే కానీ ఎదుటిపక్షంవారికి పడ్డ ఓట్లు సారాయికి డబ్బుకి ఆశపడి వేసినవని తర్వాతెప్పుడో తీరికగా ముక్తాయించకు..కేవలం నీ పార్టీ గెలుపు ఓటములకు నువ్వే బాధ్యుడివి..రేపు పంచాయితీ ఎన్నికలు..మునిసిపాలిటీ ఎన్నికలు వస్తాయి..నీ లక్ష్యం నిజమే అయితే వాటిలో పోటీ చేయి

వాస్తవంగా నీకేం కావాలో నీకు తెలిసి ఇలా చేసి ఉండాలి..లేదంటే లేదు..పైగా నీతో అంటకాగినందుకు ఆ బిఎస్పీ, లెఫ్ట్ పార్టీలు..అన్నీ సోదిలో లేకుండా పోయాయ్..కనీసం వాటి ఓట్లు కూడా మీ పార్టీకి ఎందుకు పడలేదు..అంతెందుకు మీ పార్టీ సభ్యులు కూడా మీకు ఓటు వేశారా..? ఎన్ని చోట్ల డిపాజిట్లు పోగొట్టుకున్నారో..వారందరికీ కాస్త అవైనా తిరిగి కట్టు బాబూ పవన్ కల్యాణూ..

Comments

  1. పారితోషకం అంటూ పుచ్చుకున్నాక డైరెక్టర్ ఏ స్క్రిప్ట్ ఇస్తే అదే గుడ్డిగా ఫాలో అవడమే ఒక నటుని బాధ్యత. పాకేజీ ఒప్పందం ప్రకారం చెంద్రాలు సార్ రాసిచ్చినట్టు నటించడం తప్పెలా అవుతుంది? పాపం పవనాలు సారును అనవసరంగా బదనాము చేయకండి.

    ReplyDelete
    Replies
    1. పేకేజీ ఒప్పందం జరిగినట్లు మీదగ్గర ఎవిడెన్స్ ఉందా?!

      Delete
    2. మచ్చుకు ఒక ఉదాహరణ: మందలగిరిలో పప్పుబాబుకు పోటీగా పవనాలు పార్టీ బదులు లెఫ్ట్ కేటాయింపు.

      Delete
    3. మీ దిక్కుమాలిన విమర్శ లో అర్థం ఏమైనా ఉందా? కులపిచ్చి వర్గపిచ్చి వేరేవారికి ఉందని చెప్తూనే మీరు కూడా అలాంటి పైత్యాన్నే ప్రదర్శిస్తున్నారు. విమర్శ అనేది సహేతుకంగా ఉండాలి కాని అవతలివారు ఏం చేసినా తప్పుగానే చూపెట్టాలనుకోవడం మనుషులకు ఉండే లక్షణం కాదు.

      Delete
    4. సూర్య గారూ, మీరు నాకు ఉద్దేశ్యాలు అంటకట్టేబదులు ఈ ప్రశ్నకు సమాధాం చెప్పండి: మంగళగిరిలో పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థిని (కుదిరితే మంచి బీసీ నాయకుడు) ఎందుకు నిలబెట్టలేదు? మీరు కళ్ళజోడు తీసి చూస్తే పాటర్న్ కనిపిస్తుంది.

      Delete
    5. కళ్ళజోడు నాకు కాదు. మీకుంది. ఈ బ్లాగుల్లో విచ్చలవిడిగా రాసే మీ కామెంట్లే చెబుతాయి మీ స్టాఅండ్ ఏమిటో.

      Delete
  2. @ సూర్య
    స్వకుల పిచ్చ పరకుల ద్వేషం తో ఉన్న కామెంట్లను పట్టిచ్చుకోవద్దు.

    ReplyDelete

Post a Comment