పార్టీ మారితే 100కోట్లు ఇస్తామన్నారు అప్పటి ఎంపి ఇప్పటి ఎమ్మెల్యే చెప్పిన ముడుపుల భాగోతం


గత ప్రభుత్వం చేసిన ఘనకార్యాలు ఒకటొకటిగా బైటికి వస్తున్నాయ్..అందులో ఓ అధికారపార్టీనేత కొడుకు..ఓ ఎంపి కలసి ఇతర పార్టీ నేతలను ఎలా కొనుగోలు చేశారో..మిగిలినవారిని ఎలా కొందామనుకున్నారో శాసనసభలో ఓ ప్రత్యక్షసాక్షి చెప్తుంటే..అందుకే జనం ఇలాంటి తీర్పిచ్చారేమో అనకతప్పదు..నిస్సిగ్గుగా నిర్లజ్జగా జంపింగ్ జిలానీలను వెనుక నుంచి తరుముతుంటే..దాన్ని అడ్డుకోడానికి సదరు బాధితుడు చెప్పిన సమాధానం వింటే..భేష్ అన్పించకతప్పదు

ఈ వ్యవహారం అంతా సదరు శాసనసభ్యుడు చెప్తుంటే...తమ నిర్వాకం బైటపడుతుందని..గట్టిగా కేకలు వేయడం..దాన్ని అడ్డుకోవాలని చూడటం..ఇంకా ఈ నేతల అహంకారం తగ్గలేదనడానికి నిదర్శనం..ఇంకా నయం సభ్యుడు ఆ ప్రలోభాల పర్వం గురించి చెప్తున్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రిగారి ముఖారవిందాన్ని క్లోజప్‌లో చూపించలేదు..చూస్తే..ఎలా ఉండేదో మరి

2014లో ఎంపిగా పని చేసిన వరప్రసాద్ ఇప్పుడు గూడూరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు..గత ఎన్నికలకు ముందు
కడప నుంచి రాజ్యసభ మెంబర్ గా ఉన్న వ్యక్తి..ముఖ్యమంత్రి కుమారుడు..నలుగురు మంత్రులు కలసి తన దగ్గరకు వచ్చారని..పార్టీ మారితే పర్సనల్‌గా రూ.50కోట్లు..అభివృద్ది పనుల పేరిట రూ.50కోట్లు ఇస్తామని ఆశ చూపించారట..దానికి మీ తల్లిని(పార్టీ)ని వదిలిపెట్టమని నేను అడిగితే ఎలా ఉంటుంది..నాకు నా పార్టీ తల్లిలాంటిది నేను మారను అని చెప్పేసరికి పప్పు బ్యాచ్ అక్కడ్నుంచి జంప్ అయిందట..ఇలాంటి పనులు చేసిన వ్యక్తులకు
జనం బానే బుద్ది చెప్పారు..దీన్ని సమర్థించేవాళ్లకి భవిష్యత్తులో మరింత బహుమతి లభించడం ఖాయం..వరప్రసాద్ ప్రసంగం సంబందించిన వీడియో కింద ఉంది పూర్తిగా చూడండి

తమ ప్లాన్ పూర్తిగా వర్కౌట్ అవుతుందనే కాబోలు అప్పట్లో తమ రెండు భజన పత్రికలలో తొందర్లోనే సీమలో ఓ వైఎస్సార్సీపీ సీనియర్ నేత పార్టీకి గుడ్ బై చెప్తారంటూ తెగ రాసుకొచ్చాయ్..కానీ పాపం ఇప్పుడు టిడిపికే జనం గుడ్ బై చెప్పడం వారూహించి ఉండరు

Comments

  1. ప్రధాని జీతం 2 లక్షలు. ఎం పీ జీతం కూడా 2 లక్షలు అనుకున్నా సంవత్సరానికి 24 లక్షలు. 5 సం లకు అన్నీ కలుపుకుని 5 కోట్లు వస్తాయనుకుందాం. 5 కోట్లు సంపాదించే వరప్రసాదుకి 50 కోట్లు ఎందుకిస్తారు ? మీరు వ్రాయడానికీ వాడు వాగడానికీ అర్ధం ఉండాలి. వీడియో ఏదీ ?

    ReplyDelete
  2. మీ విజ్ఞత ప్రకారం ఎంత జీతం సంపాదించేవాడు..అంతే మొత్తానికి అమ్ముడుకావాలంటారు..ఆ లెక్కన నంద్యాల బైఎలక్షన్ లో రెండు వందల కోట్ల మేర డెవలప్ మెంట్ ఫండ్స్ ఎందుకు రిలీజ్ చేశారు..ఒక్క ఎమ్మెల్సీ కోసం రేవంత్ రెడ్డిగారు..లక్షలు ఇస్తూ పట్టుబడ్డాడు..నమ్మకపోతే మీ ఇష్టం..తెలిసినా నమ్మనట్లు నటిస్తే..అది కూడా మీ ఇష్టమే..

    ReplyDelete
  3. డా. వెలగపల్లి ప్రసాదరావు గారి మీద ఎన్నికల ప్రచార సమయంలో పచ్చమీడియా బోలెడు బురద చల్లింది ఎందుకో ఇప్పుడు అర్ధం అవుతుంది.

    ReplyDelete
  4. >>ఎంత జీతం సంపాదించేవాడు..అంతే మొత్తానికి అమ్ముడుకావాలంటారు>>>
    అలా అని నేను అనలేదు. ఒక్కో ఓటర్ కి జగన్ 1000 రూ ఇచ్చారు. ఓటర్ 1000 రూ సంపాదిస్తున్నట్లు కాదు. వెయ్యి రూపాయలకు అమ్ముడుపోయినట్లు.ఓటర్ కి కూడా 100 కోట్లు ఇచ్చారు అంటే నమ్మాలా ?

    ReplyDelete
  5. ఈ వీడియో ఇపుడు చూసాను. దళితులకు అవకాశం రాలేదు అని మొదలుపెట్టారు. అంబేద్కర్ గారికి ఎవరు అవకాశాలు ఇచ్చారు ? ఎదగాలని అనుకుంటే అవకాశాలు వారే సృష్టించుకుంటారు. ఈయన మొఖం ఎపుడూ చూసినట్లు కూడాలేదు. ఆయనకి 50 కోట్లు ఎవరిస్తారు ? అన్నీ అబద్దాలే !

    అర్జున్ రెడ్డి సినిమాలో 27 ముద్దులు పెట్టిన విజయ్ దేవరకొండ కి కూడా 5 కోట్లు ఇవ్వలేదు. ఈయనకి అంత దృశ్యం లేదబ్బా !

    ReplyDelete
  6. >>>డా. వెలగపల్లి ప్రసాదరావు గారి మీద ఎన్నికల ప్రచార సమయంలో పచ్చమీడియా బోలెడు బురద చల్లింది ఎందుకో ఇప్పుడు అర్ధం అవుతుంది.>>>
    ఆ మీడియా ఇలా చేస్తోంది, ఈ మీడియా ఇలా రాస్తోంది" అని అంటూనే తన నోట్లో కుళ్ళుని మాత్రం క్లోజ్ అప్ యాడ్ లో లా వాసన చూసుకుని మరీ ఆనందించేవారి జీవితం దరిద్రాతి దరిద్రం!

    ReplyDelete

Post a Comment