రోజువారీ లేబర్ కన్నా..నెలవారీ జీతగాళ్ల పనే ఎక్కువట


ప్రతి రోజూ పని వెతుక్కోవడం అది పూర్తయ్యాక పని డబ్బుల కోసం  ఎదురు చూడటం చేసే జీవులు దేశంలో చాలానే ఉన్నాయ్..వాళ్ల ఉద్యోగాలకు గ్యారంటీ ఉండదు..తీరా పని పూర్తయ్యాక డబ్బులు వెంటనే ఇస్తారో..లేక వాయిదాలు వేస్తారో కూడా తెలీని పరిస్థితులు ఉంటాయ్..మరలాంటి స్థితిలో పనిపై పూర్తిగా శ్రధ్ద పెట్టి ( కామందుల భాషలో వళ్లు దగ్గరపెట్టుకుని) పని చేసుకుంటారు. అదే నెలవారీ జీతగాళ్లకైతే ఈ షరతులు ఉండవ్..పని చేసినా..చేయకపోయినా నెలతిరిగేసరికి చేతిలోనో..బ్యాంక్ అక్కౌంట్‌లోనో డబ్బులు పడిపోతాయ్...ఇదే కదా ఒపీనియన్..కానీ అలా కాదట.

నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్  సంస్థ చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ అనే సర్వే ప్రకారం జీతం ఖచ్చితంగా తీసుకునే ఉద్యోగులే లేబర్ ఉద్యోగులకంటే ఎక్కువ పని చేస్తున్నారుట.  ఏప్రిల్-జూన్ మధ్య వీళ్లో లెక్కలు తీశారట..దాని ప్రకారం రూరల్ లో 58 గంటలకు పైగా..అర్బన్ ఏరియాల్లో 60 గంటలకి పైగా మగ నెలవారీ జీతగాళ్లు పని చేయగా..లేబర్ ఉద్యోగులు రూరల్ ఏరియాల్లో 49.5 గంటలు..అర్బన్ ఏరియాల్లో 52.7 గంటలు పని చేసారట..(వారంలో)

ఇంకా ఇలాంటి చాలా లెక్కలు ఉన్నాయ్ కానీ..ఏతావాతా సదరు సంస్థ తేల్చిందేందంటే..నెలవారీ జీతగాళ్లే బాగా పని చేస్తున్నారని..దీనికి కారణం కూడా చెప్పుకొచ్చింది..ఎప్పుడు పని ఉంటుందో ఊడుతుందో తెలీదు కాబట్టి..వాళ్లలో పెద్దగా ఆసక్తి ఉండకపోవచ్చని..అదే నెలవారీ జీతగాళ్లకైతే..భరోసా ఉంది కాబట్టి..కాస్త ఎక్కువే పని  చేయడానికి ఇష్టపడ్డట్టు చెప్దోంది..ఐనా ఈ సర్వే మర్చిపోయిన వాస్తవం ఏమిటంటే..వారానికి 6 రోజులు పని దినాలనుకుంటే..48 గంటలు పని చేస్తే చాలు..అలాంటిది..అటు లేబర్ కానీ..ఇటు నెలవారీ వేతన జీవులు కానీ..అంతకంటే ఎక్కువే పని చేస్తున్నప్పుడు ఇలా విభజించి...నిందలు వేయడం ఎందుకు..పైగా రెక్కాడితే కానీ డొక్కాడని జీవుల శ్రమని..ఇలా గంటల్లో కొలవడం దారుణం

అసలు పనిని గంటల్లో కొలవడం కొద్దిగా చిక్కుల్లో విషయమే..ఈ టైమ్ కి వచ్చి ఈ టైమ్ కి వెళ్లడం అంటే..మధ్యలో పని చేస్తుంది..లేనిదీ ప్రొడక్ట్ బేస్డ్ గా అయితే తెలుస్తుందేమో కానీ...కన్పించని పనిలో ఎలా తెలుస్తుంది..జస్ట్ లైక్ కన్జ్యూమర్ ఓరియెంటెడ్ పనుల్లో కస్టమర్ వస్తే పని చేస్తారు..లేదంటే...అలా ఎదురు చూస్తు ఉండటం కూడా పనేనా..ఏదెలా ఉన్నా..పనిని గంటల్లో కొలవడం కొన్ని ఏరియాల్లోనే(విభాగాల్లోనే) పనికి వస్తుంది

Comments