రేపటి బాబు మాట ఇదే..చూస్తూ ఊరుకుండేది లేదు


ఛంద్రబాబు గారు రేపు మాట్లాడే మాట ఇదే..మామాలుగా అయితే రాష్ట్రప్రభుత్వానికి కనీసం ఆరునెలల సమయం ఇద్దామనుకున్నాం..కానీ పరిస్థితి చూస్తుంటే అలా లేదు అంటూ తన పాత పాటే పాడతారు..
అక్కడికేదో నిజంగానే ప్రతి ప్రభుత్వానికి ఈయన టైమ్ ఇచ్చేట్లు..ఆ తర్వాతే విమర్శలు చేస్తున్నట్లు చంద్రబాబుగారు మాట్లాడటం కొత్త విషయం ఏమీ కాదు.
 కానీ ఈసారి మాత్రం మరీ దారుణంగా వ్యవహరించడమే చంద్రబాబుగారి నైజానికి నిదర్శనం..ముఖ్యమంత్రిగా జగన్ పూర్తి కేబినెట్ ఏర్పాటు చేసి వారం కూడా కాలేదు..తీసుకున్న చర్యలపై ఎక్కడా నెగటివ్ టాక్ లేదు( ఏం చేసినా...ఏడ్చేవాళ్లని పక్కనబెడితే) అలాంటి నిర్ణయాలపై చంద్రబాబుగారికి అభ్యంతరాలేంటో తెలీదు..బహుశా తాను ఇచ్చిన కాన్ఫిడెన్షియల్ జీవోలపై దృష్టి పెట్టారనే ఇలా బాబుగారికి ఆగ్రహం వచ్చిందంటున్నారు.
మే 30 నుంచి జూన్ 12కి మధ్యలో జరిగింది 13 రోజులు..ఈ పదమూడు రోజులలోనే చంద్రబాబుగారు ఉండబట్టలేనంత తప్పులు ప్రభుత్వం ఏం చేసిందో ఆయనే చెప్పాలి..అది చెప్పకుండా ఊరికినే ప్రభుత్వంపై పడతానంటే..అది టిడిపి ఉడుకుమోత్తనానికే నిదర్శనంగా మారుతుంది

పైగా ఆయన పార్టీ నేతలు..కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని..వాటిని ఎదుర్కోవాలని పిలుపు ఇవ్వడం ఏంటో ఆయనకే తెలియాలి బహుశా కోడెల అరాచకాలపై కేసులు పెట్టడమే ఆయన దాడిగా భావిస్తుంటే..2023లో కూడా ఇదే తరహా ఫలితాలు ఎదురవుతాయి అక్కడికీ పాపం ఆయన భజన ఛానళ్లలో వైఎస్సార్సీపీ నేతలలో ఆకాశమంత అసంతృప్తి ఎగసిపడుతున్న స్టోరీలు రాసుకుంటూ ఆనందపడిపోతున్నాయ్..కొన్నాళ్లపాటు ఆ ఛానళ్లు చూసుకుంటూ బాబుగారు స్వాంతన పొందితే మేలేమో..!

Comments

  1. ఒకప్పుడు చాకిరేవు చేసింది ఇప్పుడు మీరు చేస్తున్నారు!

    ReplyDelete

Post a Comment