మెగా హీరోల సినిమాల్లో ఫృధ్వీకి ఛాన్స్ లేదా..అసలెన్ని సినిమాలు పోతాయ్


జగన్ సిఎం కావాలని కోరుకున్న వాళ్లలో సినిమావాళ్లలో పృథ్వీరాజ్ పేరే ముందు చెప్తారు అనే దానికంటే..ఆయనే
చెప్పుకున్నానడనడంలో డౌట్ లేదు..ఐతే ఇలా చేస్తూ..పవన్ కల్యాణ్‌పై కామెంట్లు చేసినందుకు ఆయనకు సినిమాలు తగ్గిపోయాయి..మెగాస్టార్ కుటుంబహీరోలెవరూ ఛాన్సులు ఇవ్వడం లేదని..ఓ హిందీ వెబ్‌సైట్‌కి సంబంధించిన తెలుగు సైట్‌లో రాసుకొచ్చారు..

అందరూ లౌక్యంగా బిహేవ్ చేస్తుంటే పృథ్వీరాజ్ మాత్రం తన నోటిమాటల ద్వారా ఛాన్సులు పోగొట్టుకుంటున్నాడని
రాసుకొచ్చిందా వెబ్‌సైట్..నిజంగా అలా జరుగుతుందా..ఎందుకంటే..మెగాహీరోల సినిమాలు అని చెప్పేంత సీన్ ఇప్పుడు లేదు చిరంజీవి సినిమాలే చేయడం లేదు..పవన్ కల్యాణ్ డిటో..మిగిలింది రాంచరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్..ఇంకా ఎక్కువ మాట్లాడితే చిరంజీవి అల్లుడు ..వీళ్లలో ఏడాదికి ఒక సినిమా చేసినా..పృథ్వీరాజ్ పోగొట్టుకునేది ఐదు సినిమాలు..

వాస్తవానికి అల్లు అర్జున్, రామ్ చరణ్ తప్ప..మిగిలిన వాళ్లు అడపాదడపా మాత్రమే కన్పిస్తున్నారు. ఈ ఇద్దరు కూడా రెండేళ్లకోసినిమా విడుదల చేస్తే ఎక్కువే..అలాంటి పరిస్థితుల్లో కేవలం శునకానందం పొందడానికే తప్ప..డైరక్ట్‌గా మెగాహీరోల  సినిమాలలో పృథ్వీరాజ్ ఛాన్స్ ఇవ్వకపోతే ఊడేదేం లేదు

పృథ్వీరాజ్ మాత్రమే చేయగలిగిన చేసే క్యారెక్టర్ అయితే..ఆ ప్లేస్‌లో ఇంకోడెవడూ సెట్ కాడు..ఎవడైనా చేసే క్యారెక్టర్‌కి పృథ్వీ రాజ్‌ని తీసుకోవాలని అయితే అనుకోరు కదా..ఇది ఆ సినిమాలకి లాస్ తప్ప ప్రాఫిట్ మాత్రం కాదు..కమెడియిన్ల మీద సినిమాలు రన్ కావు కానీ.. సీన్లు రక్తి కట్టించడంలో వాళ్లే కదా కీలకం..ఐనా..ఇంకో ఆరునెలలు పోతే కానీ..ఈ రేంజ్ హెడ్డింగ్స్ పెట్టే విషయంలో క్లారిటీ రాదు..ఐనా  పృథ్వీరాజ్ కూడా ఫుల్ క్లారిటీతోనే ఉన్నాడు..సినిమాలా..పాలిటిక్సా..అంటే..పాలిటిక్సే కావాలని..సో..ఎవరు ఎవరికి బొక్క పెట్టేది కొద్ది రోజుల్లో
తేలిపోతుంది

Comments