నా మీద ఏ కేసూ లేదు..సుజనా కామెంట్..2022లో అయినా ఏపీలో బిజెపి అదికారంలోకి రావచ్చట

పార్టీ మారిన యలమంచిలి సత్యనారాయణగారు టిడిపిని వదిలిన తర్వాత..తిరిగి తన పాత పాటే పాడారు. కేసులే లేవు..ఎవరైనా నిరూపించండి అని సవాల్ చేయడం విచిత్రం ఎందుకంటే..ఇలా కేసులు ఉన్నాయ్ అని చెప్పిందే వాళ్ల పత్రికలు..పైగా అప్పట్లోనే చాలామందిపై ఆయన కేసులు పెడతా అని హెచ్చరించారు..మరిప్పుడు ఆ పని చేయవచ్చుగా ..కేవలం సవాల్ విసిరేసి ఊరుకుంటే  ఎలా

పైగా పార్టీనుంచి జంప్ అయినా..టిడిపిలో ఎలాంటి సునామీ రాలేదని..ఎందుకు అలా అనుకుంటారని అనడం విచిత్రం. ఓ పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్లినా..పాత పార్టీపై ఇంత సాఫ్ట్ కార్నర్ తీసుకోవడం విచిత్రమే..పైగా టిడిపిలోని కొంతమంది తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించడం మరీ విచిత్రం

ఈ సందర్భంగా సుజనా చౌదరి చేస్తోన్న కామెంట్లు మరీ విచిత్రం 2022లో అయినా కూడా ఏపీలో అధికారం చేపట్టగలం అని అనడం నిజంగా బిజెపి ఏదో కుట్ర చేస్తుందన్న అనుమానం కలగకమానదు..2024..2029 అంటూనే ఈ మాట అనడం ఏంటో మరి..వాస్తవానికి బిజెపి ఈ రోజున టిడిపి..కాంగ్రెస్‌లోని లీడర్లందరినీ లాక్కున్నా..జనం ఆ పార్టీకి ఓట్లేయరు..పైగా ఆ మేరకు టిడిపినే గెలిపిస్తారు..అంతేకానీ..బిజెపిని మరీ అంత ఇదిగా జనం నెత్తినపెట్టుకుంటారంటే..అప్పట్లో చంద్రబాబు 23మంది ఎమ్మెల్యేలను తీసుకుని..తిరిగి గెలుస్తారనుకున్నట్లే అవుతుంది..జనంలో ఉన్న పార్టీలనే గెలిపిస్తారు..తప్ప ఇలా లీడర్లను లాక్కునే పార్టీలను కాదు..

Comments

  1. Why you are wondering about 2022 elections? Modi is planning to one countryyone election in 2022!

    ReplyDelete

Post a Comment