శభాష్ డి.అవినాష్..కీపిటప్ ఇలానే చేయండి వైఎస్ జగన్‌ని మరోసారి గెలిపించండి

నవరత్నాలలో ఓ రత్నం రాలిపోయింది..ఇంతకన్నా స్టాక్ డైలాగ్ ఇంకోటి ఉండదు..ఆలస్యంగా చేయవచ్చేమో కానీ..అసలు చేయకపోతే ఇలాంటి విమర్శలు చేయవచ్చు కానీ..సీనియర్ సిటిజెన్ల పెన్షన్లు 3వేలరూపాయలకు పెంచుకుంటూ పోతాం అని చెప్పి..దానికి తగ్గట్లే 250రూపాయలు పెంచడం తప్పు కాదు..2022నాటికి ఖచ్చితంగా 3వేల రూపాయలు అవుతుంది..కాబట్టి..ఎన్నికలకు రెండేళ్లక్రితమే ఆ హామీ పూర్తి చేస్తున్నప్పుడు ఇక రత్నం రాలడం కాదు..రత్నం ప్రకాశిస్తుంది..పైగా పెంచారే కానీ తగ్గించలేదు..ఎన్నికల ఏడాదిలోనే గుర్తుకు రాలేదు

ఇక టైటిల్ జస్టిఫికేషన్ విషయానికి వస్తే, అమ్మఒడి పథకం చెప్పినట్లు కాకుండా..ప్రభుత్వస్కూళ్లకే పరిమితం చేయబోయారని..విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారని అంటున్నాడీయన..ఓ రకంగా ఈ పథకం ఎలా అమలు చేసినా..హ్యాపీగా ఫీలయ్యేవాళ్లే ఎక్కువ. ఎందుకంటే..ప్రభుత్వ స్కూళ్లకి వెళ్లే పిల్లలకే వర్తింపజేస్తే పేదకుటుంబాలు ఆనందపడతాయి..
ప్రవేట్ స్కూళ్లకి వెళ్లే వాళ్లకి వర్తింపజేస్తే..మధ్యతరగతి తల్లిదండ్రులు కూడా కాస్త సాయం పొందినవాళ్లవుతారు..అంతేకానీ కార్పోరేట్ స్కూళ్లు బాగుపడతాయి దీనివలన అనడం అన్యాయం.ఎందుకంటే ప్రతి ఏటా ఇచ్చే 15వేల రూపాయలు స్కూళ్ల బ్యాంక్ అక్కౌంట్లలో వేయరు..తల్లిదండ్రుల అక్కౌంట్లలో వేస్తారు..కాబట్టి..ఈ అహనాకుహబాపతు విమర్శలకు తావులేదు.. ఎటోచ్చీ సూడోమేధావుల దృష్టిలో ఈ పథకం ఏ బాబుగారో ఇంకోరో ప్రకటిస్తే అద్భుతం..ఇంకోళ్లు చేస్తే ఆర్ధికవ్యవస్థ అస్తవ్యస్తం..ఇలాంటి విమర్శలు చేసే
సన్నాసులలాగా మిగిలారు..ఇకపైనా అదే చేస్తే..చివరకు ఎంతమంది మిగులుతారో తెలీదు

Comments