జగన్ కేబినెట్ ఎమ్మెల్యే ఏడుకొండలు సినిమాలా ఉందట..నౌ..తులసిరెడ్డి జాయిన్స్ ది ఎల్లో బ్యాండ్ వేగన్


దేశంలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉఁదో అందరికీ తెలుసు.. ఆపార్టీ అధ్యక్షుడే( ఔను అసలు రాహుల్ గాంధీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంటా...లేక జస్ట్ వయనాడ్ ఎంపినా...మరి రాజీనామా చేశాడంటున్నారు..వెనక్కి తీసుకోమని బతిమాలాడారు అందరూ అంటారు..ఆయన వెనక్కి తీసుకుందీ లేనిదీ మాత్రం చెప్పలేదు..రిజైన్ చేసిన విషయం మాత్రం హెడ్ లైన్స్ లో పడేలా చూసుకున్నారు) తాత ముత్తాతల నాటి నుంచి కాంగ్రెస్ గెలుస్తూ వస్తోన్న పరంపరకి బ్రేక్ పడేలా చేశారు..ఆ ఘనత ఆయనకే దక్కాలి..స్మృతి ఇరానీ గొప్పదనం కంటే..రాహుల్ బాబుగారి అమాయకత్వమే అక్కడ బాగా పని చేసిందనాల్సిందే

అలాంటి కాంగ్రెస్  పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో ఎలా ఉందో..తెలంగాణలో ఎలా ఉందో చెప్పక్కర్లేదు..ఒక్క సీటూ గెలవలేని కాంగ్రెస్ నేతలకు ఇతర పార్టీల గురించి విమర్శించే అర్హత గురించి ప్రశ్నించడంం లేదు..కానీ...ఆంధ్రప్రదేశ్‌లోని కొత్త కేబినెట్‌పై ఆయన కామెంట్ కి ఏ మాత్రం విలువ ఉంటుందా అని..జగన్ కేబినెట్ చూస్తే..ఎమ్మెల్యే ఏడుకొండలు కేబినెట్‌లా ఉఁదట..అందరికీ ఉప ముఖ్యమంత్రుల హోదా ఇస్తే పోయేది కదాని పాపం ఓ జోకు వేశాడాయన. 

నిజమే అదే జోకు 2014లో తన పాత పార్టీ మిత్రుడు  చంద్రబాబునాయుడుగారు ఇద్దరు మంత్రులకు డిప్యూటీ సిఎం పదవులు ఇచ్చినప్పుడు కూడా వేయాల్సింది కదా..ఒకరేమో హోం డిప్యూటీ..ఇంకొకరేమే రెవెన్యూ డిప్యూటీ...హోం డిప్యూటీగారు..కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవని ఓ నామినేటెడ్ మంత్రి ముందు ఎక్స్ ప్లనేషన్ ఇచ్చే దుస్థితి
రెవెన్యూ డిప్యూటీకేమో కనీసం తన శాఖకి సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకోలేని మా గొప్ప వైభోగం..భూసేకరణ..లేదంటే సమీకరణ పేరైదైనా సరే అది వచ్చేది రెవెన్యూ పరిధిలోది..అయినా ఆయన్ని పక్కనబెట్టేసి పార్టీకి 'కాపు' గాసిన నేతల పరిధిలోకి తెచ్చినప్పుడు తులసిరెడ్డికి అది జోక్‌లా కన్పించలేదు..

ఇక ఇప్పటి వాస్తవానికి వస్తే...డిప్యూటీ సిఎం పదవులు ఐదుగురికి ఇవ్వడం విచిత్రంగానే ఉండొచ్చు..మరి రెండు పదవులు అంటూ ఒకటి బిసికి మరొకటి కాపుకి ఇచ్చినప్పుడు..ఎస్సీ ఎస్టీ ముస్లింకి ఎందుకివ్వకూడదు..మీకేనా ఈ రాజకీయాలు తెలిసింది..అందుకే జగన్ ఈ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాడు..వాళ్లకి ఏ హోదా ఉందో..ఏ అధికారం ఉందో..పోను పోను తెలుస్తుంది కదా..ఇంతమాత్రానికే ఆపసోపాలు పడుతూ మాట్లాడటమెందుకు...మనలో మన మాట..మరి 20సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ అంటూ మనకీ ఓ పదవి వచ్చింది కదా..అప్పుడెందుకు హే..ఏందిరా బై..ఈ పదవి నాకొద్దు అనాల్సింది కదా...!

ఇలాంటి వాళ్ల మాటలే కదా..మన బ్యాచ్ కి కూడా  కావాల్సింది..అందుకే వెంటనే తులసిరెడ్డి మాటలు 'కమ్మగా' తోచిన ఛానళ్లు పెద్ద పెద్ద బ్రేకింగులు పెట్టుకుని సంతోషపడ్డాయ్..రేపొద్దున ఆ పేపర్లో వచ్చేవి  కూడా తులసిరెడ్డి కామెంట్లే..ఎందుకంటే..మేమేం చేయలేదండీ...అన్నీ ఆయనే అన్నాడు..మేం అచ్చొత్తాం అని చెప్పుకోవచ్చు కదా..

Comments

  1. జగన్ క్యాబినెట్ లో 5 ఉప ముఖ్యమంత్రులు విడ్డూరంగానే ఉంది. అలాగే అంబటి రాంబాబు మల్లాది విష్ణు రోజాలకు ఇవ్వకుండా కొత్తవారికి ఇవ్వడం బాగాలేదు. జగన్ అంత దూకుడు మంచిది కాదు. Slow and steady and balanced approach is desirable.

    ReplyDelete

Post a Comment