చంద్రబాబునే టార్గెట్ చేసుకోమని అచ్చెం ఆక్రోశం అర్ధమా...వదిలేయాలి సిఎం గారూ


టార్గెట్ ఎవరైనా కానీ అసెంబ్లీలో ప్రసంగాల తీరు చూస్తుంటే..ముఖ్యంగా చంద్రబాబుని చూస్తుంటే..జాలి వేస్తుంది..నిజానికి ఓటమి ఎవరికైనా సహజమే..కానీ సిఎంగా సీనియారిటీ ఉంది కాబట్టి..తనని ఎవరూ ఏమీ అనకూడదన్న రీతిలో టిడిపి వాళ్లు ప్రవర్తిస్తుంటారు..అంతెందుకు మనకైనా చంద్రబాబుకి ఇంకోళ్లు చెప్తుంటే..హే..ఆపెండెహ..ఆయనకి తెలీదా అన్పిస్తుంది..కానీ వాస్తవం చూస్తే...అవతలివైపున మంత్రులుగా ఉన్నవాళ్లు మాట్లాడాలిగా..వారికీ విలువ ఇవ్వాలిగా ...

ప్రతి విషయానికీ అచ్చెనాయుడు సభలో ఆంబోతులాగా రంకెలు వేయడం మాత్రం స్పష్టంగా విన్పిస్తుంటుంది..కన్పిస్తుంటుంది..ఆయనొక్కడి తీరుతో చంద్రబాబుకి ఎంత సానుభూతి రావాలో..అదంతా పోయి..చికాకు మిగులుతుంది..ఏకంగా స్పీకర్ ని కూడా..వినండంధ్యక్షా...అంటూ పెద్ద గొంతుకతో అదిలించడం చూస్తే..తమ్మినేని పాత వైరం(రాజకీయమే) రేగకుండా..ఉంటుందా..అందుకే విదిలించి పారేశాడాయన..అప్పటికీ వైఎస్సార్సీపీ చాలా నీట్ గా ..ప్లాన్డ్ గా...ట్రాప్ వేసింది..దాన్నుంచి చంద్రబాబుగారు తప్పించుకున్నారు కానీ..అచ్చెనాయుడికి నిజంగానే ముఖ్యమంత్రి జగన్ అన్నట్లు..మైండ్ మోకాల్లో ఉంది..నన్ను వాళ్లు అదన్నారు..ఇదన్నారు అని..దాన్ని వదిలేస్తే..జనమే ఛ..ఏంట్రా వీళ్ల తీరు అనుకునేవాళ్లు..కానీ..దానికి పోయి..బలహీనవర్గాలకు చెందిన నేనే కన్పిస్తున్నానా అధ్యక్షా అంటూ వాపోవడం ఏంటో ఆయనకే తెలియాలి...బహుశా..ఇలా వేధింపుల విషయంలో బలహీనుడు..రంకెల విషయంలో బలవంతుడు అనుకోవాలా..

లేదంటే చంద్రబాబుగారిని టార్గెట్ చేయక ఎందుకు నాపై పడతారనా..అచ్చెంనాయుడు ఆక్రోశం..లేకపోతే..ఇన్నాళ్లూ కన్పించని బలహీనవర్గాల నేపధ్యం ఇప్పుడెందుకు ముందుకు తీసుకురావడం..స్పీకర్ చాలా క్లియర్ గా టిడిపి తాట తీసే పనిలో ఉన్నాడని ఎవరికైనా అర్దమైపోతుంది..ఐనా కూడా..వైఎస్సార్సీపీ నుంచి కనీసం ఐదుగురు లేచి..బాబు అండ్ కోని రఫ్పాడించడం చూస్తే..ఎవరికైనా జాలి వేస్తుంది..నాకైతే..బాల్యంలో వానపాములను చంపితే..చివర్లో ఇంకో ఆకతాయి వచ్చి..పుల్ల పెట్టి మళ్లీ చితక్కొడుతున్నట్లే అన్పిస్తుంది..

కానీ గతం చూస్తే..సంఖ్య వైఎస్సార్సీపీికి ఎక్కువ ఉండొచ్చేమో కానీ..జగన్‌ని అచ్చెంనాయుడే స్వయంగా ఎన్ని మాటలు అనాలో అన్నీ అనేశాడు..అవన్నీ అప్పుడు అన్ పార్లమెంటరీ కానప్పుడు..ఇప్పుడు తిరిగి ఏమని అడుగుతారు..చరిత్ర చర్వణం..హిస్టరీ రిపీట్స్ అంతే..పైగా అధికారపక్షం సుతిమెత్తగా...కారం ఎలా పూస్తుందో చూస్తుంటే..చేసుకున్నోళ్లకి చేసుకున్నంత అనుకోవాల్సిందే 

Comments