చంద్రబాబు వర్సెస్ జగన్..భలే రంజుగుందిలేసోషల్ మీడియాలో వీడియోలు పట్టుకుని రాధ్దాంతం చేయాలని చూస్తే..ఎలా ఉంటుంది..ఇదిగో ఏపీ అసెంబ్లీలానే ఉంటుంది..కాళేస్వరం కడితే భాస్వరమే మండుతుందన్నట్లుగా జగన్ మాట్లాడిన వీడియోలను పట్టుకుని..ఇప్పుడెందుకు వెళ్లావ్...అప్పుడలా అన్నావ్ అంటూ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న లీడర్ మాట్లాడితే..దానికి రిప్లై మరి ఇలానే ఉంటుంది..నీ హయాంలోనే కదా..కట్టింది..మరి నువ్ గాడిదలు కాస్తున్నావా అని..
స్టాండ్ అప్పుడు ఇప్పుడు  ఒకలా ఉండాలా...మరి కేసీఆర్ అప్పుడు జగన్ పై రాళ్లు వేయించలేదా..ఇప్పుడు తానే స్వీట్లు తినిపించడం లేదా...సైకిల్ స్టాండ్ ఎన్నిసార్లు మార్చారు..ముఖ్యమంత్రి హోదాలో ఫలానా ప్రాజెక్ట్ ఓపెనింగ్ కి రావయ్యా బాబూ అంటే ఎప్పుడైనా వెళ్లకుండా  ఉంటాడా...అసలు మనల్ని ఎవరు పిలుస్తారనే సంగతి తర్వాత...
పదే పదే ఇలా సోషల్ మీడియా వైరల్ వీడియోలు పట్టుకొస్తే..ఇలానే గూబ్ గుయ్ మనే సమాధానాలే వస్తాయ్..నన్ను అవమానిస్తారా అంటూ కళ్రెర్ర జేసినంత మాత్రాన ఒరిగేదేేంటి..

గోదావరి నీళ్లు ఎలా వస్తాయనే సంగతి..జగన్ చాలా సింపుల్ గా చెప్పారనేది బాబుగారి అభ్యంతరం..అలా కాకుండా ...ఓ పది పదిహేనేళ్ల చరిత్రని గంటపాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి..ఇలా మనకి లాభం అని చెప్పుకొస్తే అప్పుడు సమ్మగా ఉంటదా...బాబుగారి లెక్కలో ఏపీ తెలంగాణ మధ్య కుదురుతోన్న నీటి పంపిణీ ఒప్పందం ఏపీకి నష్టం..అదే కదా..సరే దానిపై కోర్టుకి వెళ్లడం మినహా..ఇంకో దారి లేదు కదా..అదే కదా..చేయాల్సింది..బైటికి వచ్చి..మన భజన పత్రికలలో ఇదే ఇష్యూపై ఓ నెల రోజులపాటు ఎడిటోరియల్స్..వ్యాసాలు రాయించుకుని జనం మదిలో వైఎస్సార్సీపీ చేస్తోన్న అన్యాయంపై పోరాటం చేయండి...జస్ చేసి చూడండి..మీకే తెలుస్తుంది..సోషల్ మీడియాలో కౌంటర్ న్యూస్..లెక్కలు ఎలా వస్తాయో...

Comments

  1. ఆంధ్రా తెలంగాణా రాజకీయాలు పరిపాలన గమనిస్తుంటే అసలు తెలుగు జాతి అంటేనే రోత పుడుతోంది

    ReplyDelete
    Replies
    1. మరింకేం?ఒక update query రాసుకుని మీ జాతిని మార్చేసుకోండి!

      Delete

Post a Comment