వాయ్యా ఈ డ్రామాకి అంతులేదా..కోడెలా..నీ ఇంట్లో దొంగలా


ఛ..ఎవడన్నాడు కోడెల దుర్మార్గుడని..ఎవడన్నాడు కోడెల ఫ్యామిలీ దౌర్జన్యాలకు దిగుతుందని..రాత్రికి రాత్రే ఇద్దరంటే ఇద్దరు దొంగలొచ్చి వస్తువులు లాక్కెళ్లుతున్నా పట్టుకోలేని అసమర్ధులపై ఇంత అభాండాలు వేస్తారా..! ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉండదు..పాపం అసలే పార్టీ ఓడిపోయి..పదవి దిగిపోయి..ఎక్కడో తలదాచుకుంటున్న ఆయనపై ఇలాంటి అబాండాలు వేస్తారా..అసలే ఏడుస్తోన్న ఆయనపై మూలిగే నక్కపై తాటి కాయపడ్డట్లు..ఆ దొంగ...డ్యాష్ గాళ్లకి పాపం మా కోడెలే దొరికాడా...పైగా కంప్యూటర్ మానిటర్లు వదిలేసి...సిపీయూలే ఎత్తుకుపోవాలా...

ఇంతకీ మా కోడెల ఇంట్లో ఏముందని దొంగలు వచ్చారు..చూశారా..అందుకే ఆయన నిజాయితీ పరుడు..ఎందుకంటే..ఆయన ఇంట్లో బంగారం లేదు..డబ్బూ లేదు..దస్కం లేదు..కేవలం టీ గ్లాసులు..మందు బుడ్డీలు పెట్టుకోవడానిక ిపనికొచ్చే సిపీయూలే ఉన్నాయ్..అందుకే అందుకే..అలాంటి కోట్ల ఖరీదు చేసే సీపీయూలే పట్టకెళ్లారు దొంగలు
అసలే ఫర్నీచర్ దొంగలు ఎత్తుకెళ్తారని మా బాసు ఇంట్లో పెట్టుకున్నారాయె..ఇప్పుడాయన చెప్పిందే నిజమైంది చూడండి...దొంగలు పడ్డారు..కాబోతే మా బాసు ఇంట్లో ఏం ఉంటాయని పడతారు..అందుకే ఆయన ఇంట్లో పెట్టుకున్నారు..కానీ ఈ పాడు దొంగలు అవీ ఎత్తుకెళ్తే ఏం చేస్తారు..అంతేనా..అంతే..ఇదే మేం రాసుకోవాల్సింది ...కోడెలగారు చెప్పాల్సింది..

ఇంతకీ కంప్యూటర్ ప్రాసెసింగ్ యూనిట్లలో ఏం ఉందని అడక్కండి..అందులో కే ట్యాక్స్ వసూళ్లు ఉంటాయని ఎవరైనా అంటే జాలిపడండి..అంతేకానీ కోపగించుకోవద్దు..మా బాస్ టైమ్ బ్యాడ్ కాకపోతే..రేపు అసెంబ్లీ ఆఫీసర్లు వచ్చి సోదాలు చేస్తామనగా..రాత్రే దొంగలు పడటం  ఏంటి..అంతా జగన్మాయ కాకపోతే...ఇప్పటికైనా మా కోడెలగారి నిజాయితీనీ గుర్తించండి..ఏ మేకతోలో కప్పండి..అంతేకానీ..ఇదంతా ఆయన డైరక్షన్లో జరిగిందని అంటే నమ్మొద్దు...లేకపోతే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీ..మా కమ్మనిలోకంలో తిరుగులేని లీడర్ ఇంటికి ఒక వాచ్ మెన్..పైగా అతగాడిని తోయగానే..చడీ చప్పుడు లేకుండా సామానంతా అప్పగించేరకమని ఎలా నమ్మాలని అడగొద్దు..అంతేగా..అంతేగా...

Comments

  1. "నువ్వు అసెంబ్లీ సామాన్లు బొక్కడం ఏందయ్యా" అని జూనియర్ ఆర్టిస్టులతో డ్రామాలు ఆడిస్తే సరి. మరీ అవసరమయితే ఇది ట్రంప్ కుట్ర అంటూ గరుడ శివాజీ వెయిట్ బోర్డు మీద రాసి చూపిస్తాడు.

    ReplyDelete

Post a Comment