జగన్ అరాచకానికి పరాకాష్ట..ఆస్పత్రిలో చేరిన కోడెల


మరీ బొత్తిగా ఈ జగన్‌ని ఇలా చూస్తూ ఊరుకోలేకపోతున్నాం..మరీ అడ్డూ అదుపూ  లేకుండా రెచ్చిపోతున్నాడు. పదవుల్లో ఉన్నప్పుడు ప్రజలు సొంతం అనుకున్నట్లే..మా గెస్ట్ హౌస్ లు మా సొంతం..ఫర్నిచర్ మా సొంతం..అంత మాత్రానికే ఎంక్వైరీ వేయాలా...జస్ట్ 48 ఏసీలు ఇంటికి తీసుకుపోతే ఏంటి..అహ ఏంటంట..సేఫ్టీ కోసమని తీసుకెళ్లామని చెప్పాడుగా...ఇంట్లో చోటు చాలక కొడుకు షోరూమ్ లో వాడుకుంటున్నాడు..తప్పేంటి..

అసలు ఇనుము..మెదడు..నీళ్లు వాడకపోతే పాడైపోవూ..అదే పని చేశాడాయన..హ్యాపీగా కంప్యూటర్లు..ఏసీలు..ఫర్నిచర్ వాడకుండా మూలన పడేస్తే ఎలా..అందుకే వాడుకున్నాడు..పైగా చెప్పాడు కదా..ఎంత డబ్బు కావాలంటే అంత కట్టి  ఇస్తానని..ఆ మాత్రం దానికి దొంగలు పడటం ఏంటి పెద్దాయన ఇఁట్లో..

ఇది ఖచ్చితంగా జగన్ కుట్రే...లేకపోతే స్పీకర్ సారీ..మాజీ స్పీకర్ అందులోనూ పల్నాటిపులి ఇంట్లో దొంగలు పడటం ఏంటి..(పడితే గిడితే ఆయన ఖాన్ దానే జనం ఇళ్లలో పడాలి కానీ)..అది కూడా సరిగ్గా పల్నాటిపులి నిజాయితీ బైటపడే సమయానికి ముందు రోజే..దొంగలు పడటం కుట్రే..ఇలాంటి సమయంలో ఆయన్ని ఎవరైనా వేలెత్తి చూపడం సాధ్యపడే పనేనా..ఐనా ఎవరు ఎంత ఖజానా సొమ్ము దోచుకోలేదు..దాచుకోలేదూ..ఆయనపైనే ఎందుకంత కక్ష..ఇది ఖచ్చితంగ ాజగన్ అరాచకమే గురూ..
అందుకే...హ్వా...అందుకే ఆ అరాచకం తట్టుకోలేకే పల్నాటిపులి ఆస్పత్రిలో చేరింది గురూ..అందులోనూ ఎక్కడో చేరితే అక్కడ కూడా మనశ్సాంతి ఉండదని..అల్లుడి ఆస్పత్రిలోనే చేరి రెస్ట్ తీస్కుంటుంది..ఆ..ఏంటీ..అక్కడైతే మన సెకలు పడుతూనే అరెస్ట్ తప్పించుకోవచ్చంటారా..లేదు లేదు అది వైెఎస్సార్సీపీ డ్రామా గురూ..అదిగో మా బాస్ కి గుండెనొప్పి వచ్చినట్లు చెప్పమంటున్నారు...సారీ వచ్చిందంట...ప్లీజ్ మాజోలికి రావద్దు గురూ

Comments

  1. కోడెల అరాచకాలు గురించి పచ్చ అనుకుల మీడియా కుక్కినపేను లా బిక్కచచ్చిపోయిందే. నాయనా గల్లా, బాబూ దేవినేని , ఏమి సమాధానం చెబుతారు మీరు ఈ దొంగ పనులకు.

    ReplyDelete

Post a Comment