బాబుని ఝాడించి..డొక్కా జంప్..


ఎలాగోలా దుకాణం సర్దేేసేందుకు చూసే జంప్ జిలానీలకు ఒక్క సూది మొన మోపే అవకాశం దొరికినా చాలు..వెంటనే అల్లుకుపోతారు..ఘోరంగా ఓడిపోయిన పార్టీని పట్టుకుని వేలాడాలా...లేక షంషేర్‌గా  ఐదేళ్లపాటు పవర్ పార్టీలో ఉండాలా...రెండోదే బెటర్ కదా..పొలిటికల్ లీడర్లకి..ఇప్పుడదే ప్రయత్నం మెల్లగా ప్రారంభం అయినట్లుంది..

తాడికొండ ఎమ్మెల్యేని బూతులు తిట్టడం..మంటపాల్లోకి రానీయకపోవడం ఎవరి బలుపో తెలీదు కానీ..దాన్ని బ్రహ్మాండంగా డొక్కాగారు వాడేసుకున్నారు..దీంతో టిడిపి లీడర్లు ఆయనపై మండిపడటం..దానికి ఆయన కౌంటర్లివ్వడం మామూలుగా ఈపాటికి ప్రారంభం కావాల్సింది..కానీ ఇది అట్రాసిటీ కేసు కదా..దీంట్లో ఏదైనా తేడా వస్తే పార్టీకి ిఇంకా బ్యాడ్ నేమ్..అందుకే పాపం మింగాలేక కక్కాలేక సతమతం అవుతున్నారు..

యాక్చువల్లీ..డొక్కా..ఈజ్ నాటే టిడిపి స్టాండ్..ఆయన కేవలం రాయపాటి స్టాండ్..ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో..అప్పుడే డొక్కా జంపింగ్ సిగ్నల్స్ వచ్చేసాయట..దానికి బీజం ఎమ్మెల్సీలో సిఎం హోదాలో జగన్ వచ్చినప్పుడు డొక్కా చేతిలో చేయ్యేసి మాట్లాడిన సమయంలోనే పడిపోయింది..మిడిగుడ్లేసుకుని..యనమల..నారా లోకేశుడు చూస్తుండిపోయారు కానీ..ఏమనలేకపోయారు..

సో..ఇప్పుడు లైన్ క్లియర్..ఇక డేట్ టైమ్ ఫిక్స్ చేసుకుని..ఎంట్రీ ఇవ్వడమే...మరి పదవికి రాజీనామా..అదెంత పని..తిరిగి ఎమ్మెల్సీగా గెలిపించుకోవడం..పైసా కూడా ఖర్చులేని పని కదా..మొత్తం 151మంది ఎమ్మెల్యేలు..ఇంకేటి ఆలస్యం కమాన్..డొక్కా...డొక్కలో తన్నేసి వచ్చేయ్

Comments