ఆర్టీసీని ప్రభుత్వం కలిపేసుకుంటే రాధాకృష్ణకెందుకు కడుపు మంట?


ఔను...ఏపీ సిఎం జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేశాడు..హామీ ఇచ్చినట్లుగానే 50వేలమంది ఆర్టీసీ ఉద్యోగులు ఇక గవర్నమెంట్ ఉద్యోగులే...వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులు అనడానికి నూటికి వెయ్యి శాతం అర్హత ఉంది ఆర్టీసీ ఎంప్లాయీలకు..మామూలు సిబ్బందికి డ్యూటీకి వచ్చి కూడా ఓ నాలుగు రోజులు పని చేయకుండా కుదురుతుందేమో కానీ..మన డ్రైవర్లకి కండక్టర్లకీ డ్యూటీ ఎక్కితే పని చేయకుండా తప్పించుకోవడం అసాధ్యం..అంటే సిసలు పనిమంతులు..అలాంటి వాళ్లని ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకుని పెన్షన్ ఇస్తానంటే మధ్యలో ఏబ్రాసి రాగాకృష్ణకి ఏంటంట..

ఇదే ప్రశ్న..ఆయనగారి చెత్తపలుకులు..వక్కపలుకుల్లో దొర్లింది..
చూడండి..ఏపీ సిఎం జగన్‌కి తెలిసో..తెలీకో కలుపుకున్నాడట..ఔను మరి ఏ ఇష్యూలోనైనా ఈయనగారికి ఉన్నంత జ్ఞానం అందరికీ ఉండదు కదా..ఆర్టీసీ లాంటి సంస్థలను కలిపేసుకోరట..అంటే ఏంటో మరి..ఈయన ఉద్దేశం..ఎలక్షన్లకి ముందు ఇలానే ఉజ్జోగస్తుల గురించి తెగ వాగి బాబుని ముంచేసిన వైనం అందరికీ గుర్తుండే ఉంటుంది..యూజ్ లెస్ ఫెలోస్..కొడుకులకు అది ఇవ్వొద్దు ఇది ఇవ్వొద్దంటూ తెగ ప్రేలాపించిన ఆ వీడియో చూస్తే..మనిషనేవాడికి ఇంత కొవ్వా అనుకోకతప్పదు..

పైగా ఈ పలుకులు కేసీఆర్ గురించి రాసుకుంటూ మధ్యలో జగన్ ప్రస్తావన ఎందుకంట...ఎందుకంటే..ఆయన ప్రస్తావన లేకుండా ఏ రోజూ తన పేపర్లో వార్తలుండవ్..జగన్ పేరు తలచుకోనిదే ముద్ద దిగదు..ఇది వైఎస్ బతికున్న రోజుల్లో..ఆ మాటికి వస్తే చనిపోయిన తర్వాత పదేళ్లు కూడ ఏ రోజూ వైఎస్ పేరు లేనిదే పేపర్ రాదు బైటికి..దమ్ముంటే ఒక్క రోజు అలా వచ్చిందని ప్రూవ్ చేయండి..
కేసీఆర్‌కి కేటీఆర్‌ని సిఎఁగా చేయమని అమిత్ షా చెప్పాట్ట..సరే అనుకుందాం..అలా చెప్తే అందులో కేసీఆర్ బాధపడాల్సినంత అవసరం ఏముంది..పైగా సిబిఐకి డైరక్ట్ గా చేయవద్దని చెప్తున్నారట..అక్కడికేదో ఇలాంటివి బిజెపికి కొత్త అన్నట్లు..ఎక్కడైనా బిజెపిని మించి సిబిఐని వాడిన పార్టీ ఉందా..


ఇదిగో పైన మళ్లీ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావన..పూర్తిగా సరెండర్ అయిపోయారట..ఏమీ చేయడం లేదట..ఐదు నిమిషాల్లో ఫినిష్ చేస్తారట..అంటే ఏంటి బౌతికంగానా...లేక కేసుల్లోనా..దమ్ముంటే ఈ పదం వెనుక ఈయన భావం ఏంటో చెప్పండి మరి..ఔను మరి..అక్కడ వాళ్లు పవర్ ఫుల్..ఇక్కడ జగన్ డల్..ఇదేనా జనం అనుకోవాల్సింది రాగా కృష్ణగారూ....పెట్టుకోమనండి జగన్‌తో తెలుస్తుందప్పుడు ...!





Comments