పెళ్లాలకి ఫైనాన్స్ మినిస్ట్రీ ఇవ్వాలన్నోళ్లే ఇలా...మొగుడూ పెళ్లాం..ఓ మాంద్యం

మొగుడూ పెళ్లాల మధ్య తగవు వాళ్లంతట వాళ్లే తీర్చుకోవాలి కానీ..మధ్యలో వాళ్లు తీరుద్దామనుకుంటే ఎక్కువసార్లు వికటిస్తాయంటారు..మధ్యలో ఆ తీర్పుడు మర్యాదరామన్నలకే వాచిపోతుందని కూడా జోగ్గా చెప్తుంటారు..కానీ ఈసారి వీళ్లిద్దరి మధ్యా జగడం రాలేదు కానీ...మాంద్యం వచ్చింది

ఒకరేమో కేంద్రమంత్రి..ఒసారి రక్షణశాఖామంత్రి..ఇప్పుడు ఆర్ధిక మంత్రి రెండూ కీలకశాఖలే..అందులోనూ మనకి ఆర్ధికశాఖ కనుక మహిళల చేతిలో పెడితే బ్రహ్మాండంగా తీర్చి దిద్దుతారు ఇంటిని అంటుంటారు..కానీ ఇదేమో దేశానికి సంబంధించినదాయె..పొదుపు మంత్రం ఓకే కానీ...మాంద్యం పరిస్థితుల్లో ఎంత ఖర్చు పెడితే అంతమంచిది ఎకానమీకి అంటారు..వరసగా ఏ ప్రకటన చేసినా ప్రయోజనం లేకుండా పోతోన్న టైమ్ లో పరకాల ప్రబాకర్ హిందూలో ఓ వ్యాసం రాశాడట..పివి నరసింహారావ్ సంస్కరణల బాటని పక్కనబెట్టి బిజెపి తప్పు చేస్తోంది..ఇకనైనా పొలిటికల్ గా ప్రతీకారం..దాడి చేయడం మానేసి వాళ్లలోని మంచి చూస్కోండి..మన్మోహన్ సింగ్ దగ్గర కావాలంటే  పాఠాలు నేర్చుకోండన్న టైపులో ఆయన వ్యాసం ఉఁదట

దీనిపైనే ఇలేకారులు..మంత్రిగారిని అడిగితే..ఆమె వరసగా తామేం చేస్తూ వచ్చిందో చెప్పుకొచ్చారు..( జిఎస్టీ , ఆధార్, వంటగ్యాస్ లాంటివి)2014 నుంచి ఇప్పటిదాకా మౌలిక వ్యవస్థలోనే మార్పులు చేసామంటూ చెప్పుకొచ్చారు.ఐతే అ సలు ప్రశ్న మాత్రం అలానే ఉండిపోయింది..నువ్వేం చేసావన్నది కాదు..ఫలితం ఏమొచ్చిందన్నదే కదా..చూడాల్సింది..రిజల్ట్ డిటోనే కదా..ఇన్ని చేసిన తర్వాతే సిచ్యుయేషన్ ఇలా తగలడింది అని పరకాల ప్రభాకర్ అడిగితే...మేం చాలా చేశాం అని చెప్పుకోవడం ఏంటని..వీళ్లిద్దరూ భార్యాభర్తలు కావచ్చు కానీ...విషయం దేశంలోని అందరికీ సంబంధించిందీ కదా...

Comments