ఇక ఇప్పుడు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారి వంతు


( పైన ఫోటో 9 ROSES MEDIA THUMB NAIL_క్రెడిట్స్ ఆ యూట్యూబ్ గొట్టానికే)
ఓ వైపు వల్లభనేని వంశీ కోలుకోలేని దెబ్బ కొడుతుంటే...మరోవైపు అధికార పక్షం నుంచి దాడి ఓ రేంజ్ లో ఉంది..మంత్రి కొడాలి నాని..అటు వపన్..ఇటు చంద్రబాబు ఇద్దరికీ లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తూ..ఫాన్స్ ని ఓలలాడిస్తున్నాడు.. టిడిపిపై విమర్శలు చేయడానికి వైసీపీ వాళ్లు భయపడుతున్నారంటూ ఓ అర్ధం పర్ధం లేని..చచ్చు చొప్పదంటు విమర్శ ఒకటి శనివారం టిడిపి నుంచి వచ్చింది..బహుశా కొనకళ్లో...కొల్లు రవీంద్రనో ఎవరో చేసారీ  కామెంట్..
ఓవైపు  అంబటి రాంబాబు..పేర్ని నాని..వేస్తున్న సెటైర్లకే ఏ మ ాటా రాని టిడిపి ఇప్పుడు కొడాలి దాడికి బిక్క చచ్చిపోతోంది..ఐనా ఇవన్నీ వాళ్లకి ఆనడం లేదనే అన్పిస్తుంది..లేకపోతే..టిడిపిపై విమర్శలు చేయడానికి వైసీపీ భయపడేదేంటి..ఇలాంటి సన్నాసులతో టిడిపి కనీసం రేపు అభ్యర్దులనైనా నిలబెట్టగలదా మున్సిపోల్స్ కి...ఈ మాట అంటే..చూసారా కాండిడేట్లు దొరికారు ఇప్పుడేమంటారు..అని తర్వాతెప్పుడో సతాయించడం కాదు...ప్రస్తుతం టిడిపికి మిగిలి ఉన్న లీడర్లని చూస్తే..ఇదే అన్పిస్తుంది ఎవరికైనా...

జగన్ రెడ్డి షార్ట్ కట్టా..జగన్ షార్ట్ కట్టా..నిన్ను మేం ఏమని పిలవాలి..తల్లిదండ్రులు పెట్టిన పేరు వదిలేశావ్..పార్టీ వాళ్లేదే పేరు పెట్టారు..బయట ఇతర సోషల్ మీడియాలో ఇంకో పేరు ఉంది..నిన్నే పేరు పెట్టి పిలవాలో చెప్పంటూ పవన్ కల్యాణ్ ఉరఫ్ కల్యాణ్ బాబుకి సవాల్ విసిరాడు కొడాలి నాని..పనిలో పనిగా చంద్రబాబుని కూడా  ఉతికి ఆరేశాడు..వయసు మళ్లింది..మతి భ్రమించింది..ఇక రెస్టు తీసుకోవాలి..లేదంటే చిత్తూరి రాజకీయాలకే పరిమితం కావాలి అంటూ బూతులొక్కటే తక్కువగా హితవు పలికాడాయన..పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదివిస్తే..మట్టి కొట్టుకుపోతారా అంటూ సూటిగా ఒకటే ప్రశ్న వేసాడు..ఇలాంటి శాపనార్ధాలు పెడుతున్నావ్..ఇక చాలు నీ మొరగడం అంటూ డైరక్ట్ గా నే చంద్రబాబుని టార్గెట్ చేసిన తీరు చూస్తే..ఇక రేపు అసెంబ్లీ సెషన్స్ ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదనుకుంటా
కింద లింక్ ఉంది

Comments