వంగవీటి రాధాకృష్ణ ఇక అటువైపు చేరడం ఖాయమేనా..



అదృష్టవంతులను చెరిపేవారు...దురదృష్టవంతులను బాగుచేసేవారు ఉండరంటారు..అలానే వడ్డించేవాడు మనోడైతే ఎక్కడున్నా చేరాల్సింది చేరి తీరుతుందంటారు..ఈ రెండు సామెతలలో ఇప్పుడు వంగవీటి రాధాకృష్ణకి ఏది అన్వయించాలో కొన్ని రోజుల్లో తేలిపోతుంది

బిజెపి తప్ప పార్టీలు అన్నీ తెగ తిరిగేసిన వంగవీటి రాధాకృష్ణకి ఎన్నికలకు ముందు పెద్ద జలక్ పడింది..ఆయనే జగన్ కి జలక్ ఇచ్చాడని..పాపం చాలామంది భావించారు..కానీ జరిగింది వేరు..ఇప్పుడు అర్రర్రే..మనోడెంత పని చేసాడు.హ్యాపీగా జగన్ తో ఉండి ఉంటే లక్కీగా ఉండేదని ఇప్పుడు తీరిగ్గా చాలా విశ్లేషణలు చేస్తున్నారు కానీ..అసలు ఆయన బయటపడిందే టిక్కెట్ అడిగిన చోట ఇవ్వలేదని...ఐనా సరే ఇప్పుడు ఇంకో మార్గంలో పవరున్న పార్టీలో చేరే ఛాన్స్ వచ్చింది..

కొడాలి నాని వల్లభనేని వంశీ..రాధాకృష్ణ ముగ్గురూ మంచి స్నేహితులని చెప్తుంటారు..యార్లగడ్డ వెంకట్రావ్‌ కూడా ఈ బ్యాచ్ అని  అంటున్నారు..మరి్పుడు రాధాకృష్ణ వైఎస్సార్సీపీలో జాయిన్ అవుతాడా..అతను మనసులో ఏముందో చెప్పలేదు కానీ...వంశీమోహన్ మాత్రం తప్పకుండా అతని ఫ్యూచర్ కోసం ప్రయత్నిస్తామని చెప్పాడు..ఇద్దరు స్నేహితులు ఆల్రెడీ ఓ అంగీకారంతో వైఎస్సార్సీపీలో కొనసాగబోతున్నట్లు తెలుస్తుంది..ఇక మరి మీ మూడో మిత్రుడు అని అడిగిన సందర్భంలో ఖచ్చితంగా వారి కుటుంబానికి మంచి పేరు ఉంది..నిజాయితీపరుడు ..కాబట్టి అతని కోసం నేను ట్రై చేస్తా అని వంశీ చెప్పడం చూస్తే..రాధాకృష్ణకి జగన్ పార్టీలో చోటు ఉండేటట్లే కన్పిస్తోంది

కింద ఫోటోలు చూడండి..ఆయన రాజకీయజీవితంలో పార్టీలు మారిన క్రమం కన్పిస్తుంది..ఏదైనా అంటే మీడియావాళ్లపై పడి అరవడం కాదు..ఇకనైనా ...కాస్త బ్యాలెన్స్‌డ్ గా వ్యవహరిస్తే బెటరేమో









What next?

Comments

  1. రాజకీయ కప్పలు అటూ ఇటూ గంతులు వేయడం సహజం.

    ReplyDelete

Post a Comment