ఈ దిక్కుమాలిన దీక్షలేంట్రా బాబూ చస్తున్నాం డ్రాామాలతో


భారతదేశంలో 30కోట్లమంది రోజుకి ఒక్క పూట తిండికి మాత్రమే నోచుకుంటున్నారు..సగటు భారతదేశం ఆహార కొరత ఎదుర్కొంటుందని నిస్సిగ్గుగా చెప్పుకోవచ్చు..అలాంటిది..ఒక్క లీడరు ఉదయం నుంచి రాత్రి దాకా తిండి మానేసి అదే గొప్ప త్యాగమనుకోమంటే ఎలా..పైగా దీక్ష మధ్యలో మనం తాగేవి హిమాలయ మినరల్ వాటర్..ఈ విమర్శలు ఒక్క చంద్రబాబుకే కాదు..ఒక్క రోజు దీక్షలంటూ హడావుడి చేసే ఏ జగన్ కైనా...పవన్ కైనా..ఎవ్వరికైనా...

ఇసుక కొరతే ఉందో..తయారు చేసిన కొరతో...లేక కొరత ఉందనుకోవడమే తప్ప నిజంగా లేదో..అవన్నీ తర్వాత..నిజంగా ఇసుక లేక..పనులు ఆగి..మనుషులు ప్రాణాలు పోతుంటే..ఆ ఉసురు ఊరికేపోదు..కానీ మరి సిమెంట్ రేటు ఎందుకు పెరుగుతుంది..ఇసుక లేక కన్ స్ట్రక్షన్ అంతా ఆగిపోయిందని చెప్పినప్పుడు..ఉత్తి సిమెంట్ తో కడుతున్నారా...ప్రతి మరణాన్ని ఇసుక దొరక్క అని చెప్తున్నప్పుడు ఇప్పుడు ఇసుక దండిగా దొరుకుతుంది కాబట్టి..లీడర్లు చెప్తున్న లక్షలాది కన్ స్ట్రక్షన్ లేబర్ హాయిగా ఎంజాయ్ చేస్తున్నట్లా...ఇసుక రేటు పెరిగిందనే రొండ వాదన వద్దు..ఇసుక రేటు పెరిగితే లేబర్ కేంటి..వాళ్లు తవ్వడం తలకెత్తుకోవడం..కట్టడాలు చేయడం ఇంతవరకే..లేదూ రేటు పెరిగింది కాబట్టి..ఎవరూ కొనడం లేదు..కొనడం లేదు కాబట్టి వీళ్లకి పని ఉండటం లేదు అని లింకువాదనలు చేయడం పచ్చపురుగుల్లో మంచిని ఎంచడమే...
ఆ లెక్కన ఉల్లి పాయ రేటు పెరిగింది టమోట మోత మోగుతుంది..సిమెంట్ పెరిగింది..ఇలా రేట్లు పెరుగుతున్న వస్తువులు..ఉత్పత్తుల రవాణాపై ఆధారపడేవాళ్లు కూడా జీవనం కోల్పోతుంటారా...

ఇక బాబుగారి దీక్ష సంగతే చూస్తే...ఏదో జరగరానిది జరిగితే చివరి చూపు చూస్తున్నట్లు ఓ వేదిక ఏర్పాటు చేయడం..దానికి వరసగా క్యూలో వచ్చి షేక్ హ్యాండ్లు ఇవ్వడం ఏంటీ నైచ్యం..ఇంత పబ్లిసిటీ పిచ్చనా..అందుకే అచ్చంగా ఇలానే నవనిర్మాణదీక్ష అంటూ నల్లచొక్కాలేసుకుని కూర్చుంటే ఫలితం ఎలా వచ్చిందో చూశారుగా...

దానికి ఇంకో పార్టీ మద్దతు..అసలు ఈ మద్దతు ప్రకటనలేంటో తెలీదు..ఆయనెక్కడో కూర్చుంటాడు..ఈయనెక్కడో కూర్చుంటాడు..సపోర్ట్ అంటారు..అంటే ఏంటి  సపోర్ట్..బాబూ జనసేన కార్యకర్తలూ మీరు కూడా బాబుగారి దగ్గరకు వెళ్లండి అంటే అదో తీరు..లేదూ నేనే వచ్చి టెంటులో కూర్చుంటా అంటే అదో తీరు..ఈ సపోర్ట్ పాలిటిక్స్ ఏంటంట..
దీక్షతో కనువిప్పు కలుగుతుందంటూ ప్రకటనలు..అసలు ఈ దీక్షే కాదు..జగన్ కానీ..పవన్ కానీ ఎవరు ఎక్కడ కూర్చుని కళ్లు తెరుచుకుంటాయంటూ ప్రకటిస్తారు..అంటే మీ సభలకి వచ్చిన జనాలను చూసి..అర్జంట్ గా ఇసుక రోడ్లపైకి వరదలా వస్తుందా...లేకపోతే..అర్జంట్ గా కేంద్రం మీ డిమాండ్లకి తగ్గట్లుగా సంతకాలు చేసి పారేస్తుందా..( హోదా విషయంలో జగన్, పవన్ చేసిన హడావుడి సమయంలో) ఇంత రొటీన్‌గా..జనం నమ్మలేనివిగా ఉంటాయి కాబట్టే మన దీక్షలకి విలువ లేకుండా పోయింది..అదే ఆ ఢిల్లీ జెఎన్‌యు స్టూడెంట్లు కానీ...తమిళనాడులో జల్లికట్టు కానీ చూడండి...ఒక ప్రకటన రాకుండా కదులుతారేమో...మనకి ఆ స్థాయి పట్టుదల ఎప్పుడైనా వస్తుందా..చూడగలమా..!

Comments

  1. దీన్ని దీక్ష కాదు, ఒక్కపొద్దు అంటారు

    ReplyDelete
  2. Jagan pratyaeka hodaa kosam aa marana niraahaara deeksha cheyaali. Madama tippakundaa...
    Asale mana khyaati National media lo, Industrial vargallo maaru mogi pothondi.

    ReplyDelete
  3. Jagan pratyaeka hodaa kosam aa marana niraahaara deeksha cheyaali. Madama tippakundaa...
    Asale mana khyaati National media lo, Industrial vargallo maaru mogi pothondi.

    ReplyDelete
  4. Fasting is good for health to cleanse the body and to lose extra fat . I think lokesh Babu too should have joined.

    ReplyDelete

Post a Comment