రౌండప్ చేసిన వైఎస్సార్సీపీ..టార్గెట్ బాబు..స్పీకర్ కూడా అటే


క్లియర్ కట్‌గా ఈ అసెంబ్లీ సెషన్స్ ఎందుకో తెలిసిపోతుంది..టిడిపి అధినేతని టార్గెట్ చేయడమే..ప్రశ్న ఏదైనా సరే..సమాధానం మాత్రం ఒక్కటే..టార్గెట్ బాబు..వీలైనంతగా మాటలతో హింసించడం..ఇవాళ ఉదయం చంద్రబాబుని టార్గెట్ చేసిన విధానం చూస్తే..పాపం అన్పించకతప్పదు..కానీ చంద్రబాబేం తక్కువ తినలేదు..ఆయనకి ఉన్న రాజకీయ అనుభవం అంతా రంగరించి ఈ విమర్శలను..హేళనని ఎదుర్కొంటున్నాడాయన..

స్పీకర్ ని మీకు మర్యాదగా ఉండదు అనే మాట అనడం మాత్రం క్లియర్ గా కన్నబాబు మాట్లాడుతుండగా..విన్పించింది..దాన్నే పట్టుకుని స్పీకర్ చంద్రబాబుపై చెలరేగిపోయారు..స్పీకర్ ని అవమానపరుస్తున్నారంటూ తనదైన శైలీలో చేతులు అటూ ఇటూ ఊపుతూ ఆయనా మండిపడ్డారు..పాపం చంద్రబాబుగారేమో అమాయకంగా ఆ ట్రాప్‌లో పడిపోయి..ఇంకాస్త ఆవేశపడి కెమెరాలకు బుక్కైపోయారు..వెనక ఉన్న వంశీ...తాను అక్కడే ఉండాలా..కూర్చోవాలా..నిల్చోవాలా అర్ధం కాక ప్రత్యేక సభ్యుడిగా ప్రత్యేక పరిస్థితి లోనైన సీన్ కన్పించింది

ఆ తర్వాత ఒక్కో సభ్యుడూ లేవడం చంద్రబాబుగారికి అదైంది..ఇదైంది అంటూ డ్రామాని ముందుకు తీసుకుపోయారు..ఇవన్నీ చూసినప్పుడు అసెంబ్లీ అసలు సమస్యలపై మాట్లాడుకోవడానికి కాదు..జస్ట్ టిడిపిని టార్గెట్ అందులోనూ బాబుగారినే టార్గెట్ చేసుకుని నడుస్తున్నట్లు అనడంలో తప్పేం లేదు..కానీ గతం తాలూకూ జ్ఞాపకాలు వెంటాడుతున్నప్పుడు...చేసుకున్నవారికి చేసుకున్నంత అనుకోకతప్పదు..అప్పట్లో జగన్‌ని కూడా ఇలా టార్గెట్ చేయబట్టే కదా..అసెంబ్లీని  బాయ్ కాట్ చేసింది..మరి బాబుగారు ఆ పని చేయగలరా..

Comments