గరుడపురాణం శివాజీ ఎక్కడ దాక్కున్నావ్ రా..నీ మిత్రులు వచ్చేసారు



ఖర్మకాలితే..నేను చెప్పిందే నిజమైతే..అంటూ ఓ స్టిక్ పట్టుకుని గరుడపురాణం చెప్పిన శివాజీ ఇప్పుడు సైలెంట్ గా ఉండటం ఆశ్చర్యమే..ఎందుకంటే..అతగాడు ఆరోపించిన విధంగానే రాజధాని మారడం జరుగుతోంది..ఏమీ జరగనప్పుడు అంత హడావుడి చేసిన శివాజీ..ఇప్పుడెక్కడ...

ఎందుకంటే..టివి9 రవిప్రకాష్ ని అరెస్ట్ చేసినప్పుడు మనోడు బైటికి వచ్చాడు..తనపై కేసులు పెట్టినప్పుడూ వచ్చాడు..ఇప్పుడు ఏకంగా 20వేలమంది..రైతులు..బైటికి వస్తే మాత్రం ఎందుకు రెస్పాండ్ అవడంలేదు..మైహోమ్ దెబ్బకి దడిసాడా..లేక కర్నాటక ఎలక్షన్లలో ప్రచారం చేసి చేసి వచ్చిన అలసట ఇంకా తీరలేదా...పైగా కేపిటల్ ఏరియా మనోడి సొంతూరికి చాలా దగ్గర ..30 కిలోమీటర్ల దూరంలోనే ఈయనగారి గొరిజవోలు ఊరు..

మరి అయినా బైటికి రావడం లేదంటే..లేదా..వచ్చేస్తాడా..తొందరపడి ఏమీ అనొద్దా..ఆ...అదుగో...ఆయన స్నేహితుడు..చలసాని శ్రీనివాస్ గారు వచ్చేసారు..ఆయన రాజధానిని మార్చొద్దు అని చెప్పేశారు..ఇక తర్వాత ఆపరేషన్ చక్రం మొదలవుతుందా..శివాజీగారూ రండి సార్..ఎక్కడున్నారు మీరు..

Comments

  1. ఏ పైడ్ ఆర్టిస్ట్ ఎప్పుడు ఎక్కడ ఎట్లా బయటికి రావాల్నో, ఏమేమి మాట్లాడాలి/చేయాలి అన్నది దర్శకుల వారి నిర్ణయం తప్ప సొంత ప్రమేయం ఉండదు.

    ప్రస్తుత ఇన్నింగులో ఓపెనింగ్ బాట్స్మన్ సుజనా చౌదరి, రన్నరుగా శేఖర్ గుప్తా దిగారు. వీళ్ళిద్దరూ డకౌట్ అయ్యాక ఇంకోళ్ళు వస్తారు. Captain's choice based on toss, pitch, weather conditions etc.

    గరుడ శవాజీ ప్రస్తుతం ఇంజూరుడు కాబోలు.

    "తెలుగు భాషను ఉద్ధరించడం" అనే ఇటీవలి మాచీలో మాస్టర్ బ్లాస్టర్ వెంకయ్య నాయుడు స్వయంగా బాటింగుకు దిగినా అడ్డంగా ఓడిపోయారు.

    ReplyDelete
  2. https://www.andhrajyothy.com/artical?SID=994563

    "నిన్నటివరకు ఆకాశమే హద్దుగా భూముల ధరలు పెరగడంతో ఆడపిల్లల పెళ్లిళ్ల సందర్భంగా కట్నం కింద రెండు కోట్లు ఇస్తామన్న వాళ్లు.. ఆ మేరకు ధర పలుకుతున్నందున ఎకరం భూమి ఇచ్చారు. ఇప్పుడు అక్కడ ధరలు పడిపోవడంతో మీ భూమి వద్దు.. ఇస్తామన్న రెండు కోట్లు ఇవ్వండి అని కొందరు అల్లుళ్ల నుంచి ఒత్తిడి వస్తోందని ఆడపిల్లల కుటుంబీకులు వాపోతున్నారు. గడపదాటి బయటకురాని మహిళలు కూడా రోడ్ల మీదకు వచ్చి తమకు అన్యాయం చేయవద్దని కన్నీటితో వేడుకోవడం జగన్మోహన్‌రెడ్డికి కూడా శోభనివ్వదు"

    సాంఘిక దురాచారమే కాక చట్టరీత్యా నేరమయిన వరకట్నం ప్రోత్సహించడం రాధాకృష్ణ లాంటి మహామేధావికే చెల్లింది.

    ఎండ కన్నెరగని కుసుమ కోమలాంగ కులస్త్రీలు లక్షలాది రూపాయలు ఖరీదు చేసే ఐఫోన్, ఆపిల్ వాచీలు వేసుకొని మరీ టీవీల ముందు నిరసన పేరిట బూతులు మాట్లాడుతూ రెచ్చిపోతుంటే "మీ అందాల చేతులు కందేను పాపం" అని వంకరలు పోవడం ఈ అభినవ త్రిపురనేని వంతయింది.

    "దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్" అన్న గురజాడ సూత్రం బదులు "దేశమంటే మనుషులు కాదోయ్, దేశమంటే భూకబ్జాలోయ్, దేశమంటే గ్రాఫిక్కులోయ్, దేశమంటే మోతబరులకు కోట్లాది కట్నాలోయ్" అనే అభినవ వేదాన్ని రాసిన రాధాకృష్ణ అపరవ్యాసుడు.

    ReplyDelete
  3. I wish u all and ur family and blog viewers a happy and prosperous new year

    https://youtu.be/DxQPRt5FICU

    ReplyDelete
  4. గరుడ శవాజీ & పబ్బం హరి ఇద్దరూ మెన్ ఇన్ ఎల్లో తరఫున బాటింగులోకి వచ్చేసారు అమ్మయ్య ఇక సిక్సులే సిక్సులు!

    ReplyDelete

Post a Comment