కేటుగాడు నిత్యానంద మరో టోకరా

జనాలను మోసం చేయడంలో ఆరి తేరిన నిత్యానంద కొత్తగా ఇప్పుడు మరో టోకరా ఇచ్చినట్లు ఈక్వెడార్ చెప్తోంది..అసలు భారత్‌లో అంతా అనుకుంటున్నట్లుగాతాము నిత్యానందకి ఆశ్రయం ఇవ్వలేదని తేల్చేసింది. ఇండియాలో రేప్ కేసులో వాంటెడ్ కాండిడేటైన నిత్యానందకి తమ దీవులలో దేనినీ అమ్మలేదని కూడా క్లారిటీ ఇచ్చింది..అసలు సౌత్ ఆమెరికా దరిదాపుల్లో ఎక్కడా ఇతగాడి నీడ కూడా పడటానికి తాము ఒప్పుకోలేదని కూడా ఈక్వెడార్ దేశం ప్రకటించింది.

 దీంతో మరి నిత్యానంద ఎక్కడనే ప్రశ్న చర్చకు వస్తోంది..ఈక్వెడార్ నిత్యానందకి ఆశ్రయం ఇచ్చేందుకు ఒప్పుకోకపోవడంతో..హైతీకి పారిపోయడాని ఈక్వెడార్ ఎంబసీ ప్రకటించింది..ఐతే నిత్యానంద తనని తాను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా శరణార్ధి హోదా కోసం మాత్రం బాగానే కష్టపడ్డాడట..ఈక్వెడార్ ఎంబసీ ప్రకటనతో ఈ విషయం తేలిపోయింది..డిజిటల్ మీడియాలో కానీ ఇండియన్ నేషనల్ మీడియాలో కానీ వస్తున్నట్లుగా తమ దేశంలో మాత్రం నిత్యానంద లేడని చెప్పడంతోఅధికారుల దృష్టి హైతీపై పడింది
ఇదే సమయంలో అసలు ఇలా తనకి ఓ దేశం ఉందంటూ నిత్యానంద ప్రకటించుకోవడంపైనా కొత్త డౌట్లు పుట్టుకొస్తున్నాయ్..దేశంలో పాస్ పోర్ట్ కావాలంటే  విరాళాలు ఇవ్వడంటూ అడగడం వెనుక..పెద్ద ప్లానే ఉండొచ్చని తెలుస్తోంది..దేశం ఆవల గుట్టు చప్పుడు కాకుండా ఎంజాయ్ చేసే బిగ్ షాట్స్ దగ్గర డబ్బులు నొక్కేసేందుకే ఇలా చేసాడనే అనుమానం వస్తోంది..ఎందుకంటే ఫ్రెంచ్ భక్తుడికి దాదాపు మూడుకోట్ల రూపాయల మేర టోపీ పెట్టడంతో నిత్యానందపై కేసు నమోదైంది..దీంతో ఫ్రెంచ్ ప్రభుత్వం కూడా నిత్యానంద కోసం వేట ప్రారంభించింది.
అహ్మదాబాదులోని  ఆశ్రమం నుంచి ఇద్దరు అమ్మాయిలు అదృశ్యం కావడంతో నిత్యానందపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది.ఆ మిస్సైన యువతులు కూడా నిత్యానందతోనే ఉన్నట్లు తెలుస్తోంది..ఈ నేపధ్యంలోనే నిత్యానంద హైతీకి పారిపోయాడని ఈక్వెడార్ దేశం క్లియర్‌కట్‌గా చెప్పడంతో..హైతీలో అతగాడి మూలాలను అన్వేషించే పనిలో గుజరాత్ పోలీసులు పడ్డారు..ఇందులో భాగంగా ఇంటర్‌పోల్‌ని అప్రోచ్ అయి బ్లూ కార్నర్ నోటీసు జారీ చేయించే పనిలో  పడ్డారు. ఇంటర్‌పోల్‌లో సభ్యత్వదేశాల మధ్య నేరగాళ్ల వివరాలు పంచుకునే ఒప్పందం ఉంది..ఐతే ఇందుకోసం బ్లూ కార్నర్ నోటీసు జారీ చేయాలి..దాంతో..నేరస్తులు ఎక్కడ ఉన్నారు..ఏం చేస్తున్నారనే విషయాలు దేశాల మధ్య ఇచ్చిపుచ్చుకోవడం సాధ్యపడుతుంది. హిస్పానిలియోలోని ఓ చిన్న దీవి హైతీ..కరీబియన్ లాండ్‌కి సంబంధించిన ఈ దేశంలో పర్వతప్రాంతమే ఎక్కువ..ప్రపంచంలోనే అత్యంత అవినీతి దేశాల జాబితాలో హైతీదే ఎప్పుడూ ఫస్ట్ ర్యాంక్..అఁదుకే..తనకి ఆశ్రయం దొరకాలంటే ఈ దేశమే కరెక్టని ఈ కేటుగాడు భావించాడు

Comments