మహేష్ కాదు..25ఏళ్ల క్రితమే 2వారాల్లో 40కోట్లకి సమానంగా కలెక్షన్లు వసూలు చేసిన కృష్ణ సినిమా


 మహేష్ కాదు...వాళ్ల బాబుకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో..(ఇప్పటికీ కూడా..) అందరికీ తెలుసు..సరిలేరు నీకెవ్వరూ సెన్సేషన్ సమయంలో..పాతికేళ్ల క్రితమే అంతకి మించి కృష్ణ సినిమా ఒకటి బాక్సాఫీస్ దగ్గర కనకవర్షం కురిపించిందో సినిమా...సైలెంట్ గా రిలీజైన ఆ సినిమా...నిర్మాతలకు పంట  పండించడమే కాకుండా..కృష్ణకి కొత్త ఇమేజ్ తీసుకొచ్చింది..పెద్ద పెద్ద డైరక్టర్లే కాదు..ఏ దర్శకుడైనా మనసు పెట్టి తీస్తే బంపర్ హిట్స్ కొట్టొచ్చని ప్రూవ్ చేసింది..

జనవరి 11, 1995న రిలీజైన ఈ సినిమా...రెండు వారాల్లో ఒక్క నైజాంలోనే కోటి అరవైఐదు లక్షలు షేర్ వసూలు చేసింది..కృష్ణ సినిమాలకు నైజాంలో పెద్దగా ఆదరణ ఉండదని అప్పట్లో చాలామంది చెప్తుండేవాళ్లు కానీ..ఆ రికార్డ్ కలెక్షన్స్ చూసినతర్వాత అలాంటి విమర్శకులకు నోళ్లు మూతలపడ్డాయ్..రెండువారాలకు కోటిన్నర అంటే..అది కూడా లాభమే అంటే ఎంతో ఆలోచించండి..

పాతికేళ్ల క్రితం..కోటి ఆరవైలక్షల రూపాయలను..ఇప్పటి కరెన్సీలో కన్వర్ట్ చేయండి..నలభై కోట్ల రూపాయలకు పైగానే అవుతుంది..అంటే ఇప్పటి హీరోలు నెలల తరబడి తీసిన సినిమాలు..అలానే ఏళ్లకి ఏళ్లు గ్రాఫిక్స్ లో తీసిన సినిమాలు..వాటికి ఇచ్చే పబ్లిసిటీ..ఫారిన్ లొకేషన్లు లేకుండా...మొత్తం ఏపీలోనే తీసి..బ్రహ్మాండమైన హిట్ కొట్టిన డైరక్టర్ సాగర్ రేంజ్ ఎక్కడకో వెళ్లిపోగా..సూపర్ స్టార్ తన స్టార్ డమ్‌ని తిరుగులేదని ప్రూవ్ చేసుకున్నారు

అప్పటి యంగ్ హీరోలు..నాగార్జున, వెంకటేష్, శ్రీకాంత్..చిరంజీవితో పోటీ పడ్డ ఈ మూవీ సక్సెస్ పర్సంటేజ్ పరంగా..1995లో నంబర్ వన్ గా నిలబడటమే కాకుండా..సంక్రాంతి మొనగాడుగా సూపర్ స్టార్కి ఉన్న పేరుని నిర్ధారించింది






https://www.youtube.com/watch?v=ZMeUSENx3nY




https://www.google.com/imgres?imgurl=https%3A%2F%2Fpbs.twimg.com%2Fmedia%2FDUxhSYvXcAAzDZ0.jpg&imgrefurl=https%3A%2F%2Fwww.sbdbforums.com%2Fpost%2F1995-guntur-top-movies-a-rare-scan-9638053%3Ftrail%3D50&docid=NDtO141gdc2DQM&tbnid=yucU9mywuWwKzM%3A&vet=10ahUKEwit8qu3suvmAhWpyzgGHRf_C78QMwiFASg2MDY..i&w=1024&h=671&bih=619&biw=1280&q=krishna%20amma%20donga&ved=0ahUKEwit8qu3suvmAhWpyzgGHRf_C78QMwiFASg2MDY&iact=mrc&uact=8

Comments