పుండు మీద కారం చల్లుతోన్న బాబు..ఇది మీకు తగినదేనా..?


అసలే రాజధాని తరలిపోతుందని బాధలో దీక్షలు..టెంట్లు వేసుకుని నిరసన తెలుపుతున్న జనానికి కాస్త ఊరటనిచ్చే మాటలు చెప్పాలి..లేదంటే నడిపించే నాయకుడు కావాలి..అందుకే పవన్ కల్యాణ్ వచ్చినా..జనం బాగా ఆదరించారు..హీరోని చాలా దగ్గర్నుంచి మరోసారి చూసామనే ఫీల్ అయ్యారు..తర్వాత ఆయనగారి ఓవరాక్షన్ చూసి..ఎహా హీరో అంటే ఇలానే ఉండాలనుకుంటూ..ఉస్సూరన్నారు..

కానీ చంద్రబాబుగారి తీరు చూస్తుంటే...జగన్ మోహన్ రెడ్డికి రాజధాని అని చెప్పబడుతున్న ప్రాంతంలోని రైతులమీద ఎఁత కోపం ఉందో తెలీదు కానీ...యాయన కంటే..బాబుగారికి ఎక్కువ కోపం ఉన్నట్లుంది..అందుకే సందు దొరికినప్పుడుల్లా...నేను వద్దు వద్దు అంటే వినకుండా..ఓట్లు వేసారు..ఇప్పుడు అనుభవిస్తన్నారు..పాలిచ్చే గేదె..అంటూ ఏదో సామెతలు చెప్పే ట్రయల్ వేస్తారు..

రీసెంట్ గానూ బాబుగారిది అదే పోకడ..నన్ను కాదన్నారుగా...ఆయనకే ఓటు వేసారుగా...కుంపటి పెట్టకున్నారు..మీకు ఇది కావాల్సిందే అన్నట్లుగా..కామెంట్ చేసేసరి..చుట్టూ ఉన్న జనానికి బిక్క చచ్చిపోయి..ఏందిరా ఈ గోల అనుకుని ఆయన వెటకారానికి వళ్లు మండుతున్నా...వాళ్లూ ఓ వెర్రి నవ్వు నవ్వారట..

నిజానికి ఆయనలో అక్కడ జనంకి ఎలా పోరాడాలో  చెప్పడంకంటే కూడా..ప్రతిసారీ తనని ఓడించారని ఫ్రస్ట్రేషన్ వెల్లిబుచ్చడమే ఎక్కువ అయిందని ఆయన స్పీచ్ లు ఫాలో అయితే అర్దం అవుతుంది..ఇది పుండు మీద కారం చల్లినట్లు కాదా చంద్రబాబు గారూ..!

Comments