గాజులిచ్చిన భువనేశ్వరి..భూములు కావాలంటూ మినిస్టర్ రిటార్డ్


నినదిస్తున్న అమరావతి పరిసరాల్లో..ఇప్పుడు ఒకటే హోరు నడుస్తోంది..ఓ వైపు రైతులు నిజంగా దగా పడ్డామని బాధపడేవాళ్లు కొంతమందైతే..పార్టీల డ్రామాలతో  ఏం జరుగుతుందో తెలీక బిత్తరపోతున్నవాళ్లు కొంతమంది..ఐతే ఇక్కడ పెయిట్ ఆర్టిస్ట్స్ అనే పదం కొంతమంది వాడటం తప్పే..అలా చేయకూడదు..కానీ..కొంతమంది పడుతున్న వేషాలు..(ఇక్కడా చాలా చోట్లు..చాలా  కొంతమంది ఉంటారు గమనించగలరు చూస్తుంటే దిమాక్ ఖరాబు కావడం ఖాయం

ఎందుకంటే సీన్ నంబర్ వన్ చూడండి..రాజధానికి 150 ఎకరాలు ఇచ్చారంటూ ఓ దంపతులకు సన్మానం చేసారు..
అలానే మరో రాజధాని రైతులకు సాష్టాంగ నమస్కారాలు చేసి ఉద్యమిస్తున్నాం అంటూ స్లోగన్స్ రాస్తున్నారు..అసలు ఇవి ఇప్పుడేంటో అర్ధం కాదు..అంటే కొత్తగా వాళ్లు భూములిచ్చారా..ఇలా చేయడంతో వాళ్లని ఎగతాళి కానీ చేయడం లేదు కదా...

ఇక తాజా ట్విస్ట్..నారా భువనేశ్వరి గారు..తన చేతి గాజులు ఉద్యమానికి ఇవ్వడం..ఇది చాలా సెంటిమెంటల్ టచ్ ఇచ్చినట్లే..చంద్రబాబుగారు..ఇక్కడ ఫ్యామిలీ సెంటి మెంట్ ని భలేగా తెచ్చారు..ఆమె అలా ఇచ్చిందని మన పచ్చ బ్యాచ్ ఛానళ్లలో రావడం ఆలస్యం..వెంటనే కౌంటర్లు ప్రారంభం అవుతాయని..అంచనాలు వచ్చేసాయ్..అలానే కాస్త గంట గ్యాప్ లోనే పుష్పశ్రీవాణి ఏసేసారు..(ఇక్కడో పదం వాడదామనుకున్నా కానీ..నన్ను బొక్కలో ఏస్తారని వాడలా) అమ్మా మీరు ఇవ్వాల్సింది..తక్కువకి కొట్టేసిన 15 ఎకరాల భూమిని ఇవ్వాలి..అని మంచి కౌంటరే కానీ..ఓ వేళ రేపు హెరిటేజ్ ఫుడ్స్ ఆ భూమి వెనక్కి ఇస్తామని ప్రకటిస్తే...

అయినా పర్లేదంటారా..ఎందుకంటే..సదరు భూమికి ఇప్పుడక్కడ అంత రేట్ ఉండకపోవచ్చుకదా..ఎందుకంటే కేపిటలే లేనప్పుడు ఆ స్థలం ఎందుకు పనికి వస్తుంది..అయ్యో  పుష్పశ్రీవాణి గారూ..ఇలా చేసారేంటి...?

Comments