అప్పుడు జగన్..ఇప్పుడు చంద్రబాబు సేమ్ టూ సేమ్ సీన్ ఇన్ ఎయిర్‌పోర్ట్


అప్పట్లో వైఎస్ జగన్ ప్రతిపక్షనేతగా ఉండగా..ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోరుతూ తలపెట్టిన దీక్షకి మద్దతు ప్రకటించారు
వైజాగ్‌  బీచ్‌లో చేసిన ఈ ఉద్యమానికి మద్దతు తెలపడమే కాకుండా..తానే స్వయంగా హాజరయ్యేందుకు హైదరాబాద్‌ నుంచి
వైజాగ్ బయలుదేరారు..వైజాగ్ ఎయిర్ పోర్ట్‌లోనే పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు..
అప్పట్లోనే జగన్ పోలీసులను చడామడా వాయించేసారు..ఇది డొమెస్టిక్ అరైవల్..ఎందుకు ఆపుతున్నారు అంటూ
మండిపడ్డారు..తనతోపాటు వచ్చిన వారితో పాటు..మరో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా..ఓ రేంజ్‌లో
వార్నింగ్ ఇచ్చిన విజువల్స్ ఇప్పటికీ యూట్యూబ్‌లో భారీ సంఖ్యలో హిట్లు దక్కించుకున్నాయ్.

టచ్ చేయొద్దు..రెండే రెండేళ్లు..ఎవరినీ వదిలిపెట్టేది లేదనే జగన్ వార్నింగ్‌ని టిడిపి లీడర్లు ఎద్దేవా చేశారు కూడా..కాలచక్రం గిర్రున తిరిగింది
చంద్రబాబు ప్రతిపక్షనేతగా మారిపోయారు..అమరావతిని రాజధానిగా తొలగించి వైజాగ్‌కి వెళ్లబోవడంపై జనంలోకి వెళ్లాలనుకున్నారు
అమరావతి పరిరక్షణ ర్యాలీ పేరుతో చేసే సభకి హాజరయ్యేందుకు తిరుపతి రాగా..రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు కాసేపు ఆపేశారు..
ఇదే ఇప్పుడు అప్పటి సీన్‌ని గుర్తుకు తీసుకువస్తుంది..

మొత్తానికి జగన్ గారు తాను అనుకున్నది సాధిస్తే..చంద్రబాబుగారు అప్పటి ప్రతిపక్షనేతకి ఉన్నంత మంది సభ్యుల్లో సగం కూడా లేకుండా పోయారు..తిరిగి జనంలోకే వెళ్లి బలం పెంచుకునే ట్రయల్స్ వేస్తుండగా..ఈ సీన్ తటస్థించింది

Comments