జగన్ చెప్పనిదీ..కేటీఆర్ చెప్పిందీ ఒకటే..మా బాస్ ఢిల్లీలో లేడు


తెలంగాణ ముఖ్యమంత్రితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 6 గంటల సేపు కలిసి ఉండటం బైటికి ఎన్ని విషయాల గురించి చర్చించారనేది వచ్చినా..అవేం నిజం కాదు...జస్ట్  కాసేపు అలా బైటికి లీక్ ఇవ్వొచ్చు కానీ వాస్తవానికి మాత్రం ఇద్దరు పొలిటీషియన్ల మధ్య ఏ విషయాలు చర్చిస్తారో వాటి గురించే మాట్లాడుకుని ఉంటారు..కేవలం రాజకీయాలు మాత్రమే..విభజన చట్టంలోని  విషయాలు..కృష్ణా నదీ జలాల పంపిణీ అనేది బైటి జనం కోసం వచ్చే ప్రకటనలు మాత్రమే..

ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు వారి వారి అవసరాల కోసం బిజెపికి తమకి ఇబ్బంది లేని విషయాల్లో సపోర్ట్ ఇచ్చారు..అంతేకానీ తమ చాప కిందకు నీళ్లు వచ్చే విషయాల్లో అస్సలు పట్టించుకోరు..ఇందులో డౌటేం లేదు..అందుకే కేటీఆర్ ఒక పెద్ద మాటే చెప్పాడు..అది అర్ధమయ్యేవాళ్లకి అర్ధం అవుతుంది..లేనివాళ్లకి ఎప్పటికీ అవ్వదు..మాకు ఢిల్లీలో బాసులు లేరు అని...పార్లమెంట్ రేంజ్ లో మీరెలా అయినా చావండి..మా జోలికి మాత్రం రావద్దనేదే  ఆ డైలాగ్ వెనుక అర్ధం...

జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కువకాలం చర్చల్లో నానుతోన్న విషయం అమరావతి తరలింపు..దీనిపైనే కేసీఆర్‌తో ఖచ్చితంగా అంతసేపు మాట్లాడి ఉంటాడు..ఇక అభివవ ఆంధ్ర కాగడా రాధాకృష్ణ  రాతలు..ఆయన అభిలాష అయిన సిబిఐ  కేసు గురించి తప్పకుండా మాట్లాడే ఉంటాడు..అందులో ఏముంది..దాచడానికి..ఓ వేళ సిబిఐ బెయిల్ రద్దు చేయమని అడిగినా...జగన్ ఎక్కడిక్కడ కట్టుదిట్టం చేసే ఉంచాడు..అమరావతి తరలింపుపై ఇప్పటికే బిజెపికి బంధం కూడా పడింది..లక్షకోట్ల రూపాయలు ఇవ్వండి..అమరావతిని తరలించం అని మినిస్టర్ వెల్లంపల్లి ఓ డైలాగ్ వేశాడు..దానికి ఏ ప్రాధాన్యతా లేదని ఎవరైనా అనుకుంటే పొరబాటు..ఎవరు తన జోలికి వచ్చినా...వారికి సరైన సమాధానం కోసం అన్ని ఏర్పాట్లూ చేసుకునే ఈ తరలింపు వ్యవహారం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది..రాధాకృష్ణో బాబో..మోదీనో బొక్కలోకి పంపినంతమాత్రాన సైలెంట్ గా పోయి కూర్చోవడానికేం ఇక్కడుంది మధుకోడా కాదు..

రాజకీయాల్లో మిత్రులు శత్రువులు తాత్కాలికం ..ఐనా ప్రస్తుత మిత్రులతో రాజకీయాల గురించి మాట్లాడకుండా..ప్రభుత్వాలు నడపడం గురించే మాట్లాడతారని అనుకోవద్దు..కేసులు ఎలా ఎదుర్కోవాలి..శారదాపీఠం సాక్షిగా రాజధాని తరలింపులో ఎవరెక్కడ ఎలా లాభపడాలి..దెబ్బ తీసేవారిని ఎలా పడుకోబెట్టాలి ఇవన్నీ చర్చల్లోకి రాకుండా ఎలా ఉంటాయ్..ఎందుకంటే...కాంగ్రెస్, బిజెపి, జనసేన లాగా వీళ్లిద్దరికీ బాసులు ఢిల్లీలో లేరు కదా..

Comments