వైఎస్ భారతి సిఎం కాబోతాందా..జేసీ దివాకర్ రెడ్డి చిలకజోశ్యం అర్థం అవుతుందా..!


పాపం జేసి దివాకర్ రెడ్డి..నాకు రాజకీయాలు వద్దుపో అంటాడు..అసలు రాజకీయాల్లోనే లేను అంటాడు..కానీ అసలు టిడిపి అధ్యక్షుడి కంటే..ఈ డిటిపి నేతనే ఎక్కువ హడావుడి చేస్తాడు..తనంత నిజాయితీ పరుడు లేడంటారు..ఏదేదో మాట్లాడి జనం దృష్టిని ఆకర్షిస్తాడు..ఓ రకంగా పొలిటికల్ వర్మ అనొచ్చేమో..ఏ పార్టీలో ఉంటే ఆపార్టీకి పెద్ద పీడలా దాపురించే మాటలు విసురుతాడు

ఇప్పుడు తాజాగా పచ్చబ్యాచ్ భజన బృందం చేస్తోన్న ఓ ప్రచారంలో తానూ ఓ సమిధని అవుదామనుకుంటున్నట్లున్నాడు అందుకు తగ్గట్లుగా ఓ ఏడాదిలో వైఎస్ భారతి సిఎం అవుతుందంటూ రాగం ఆలపించాడు..చిలకజోష్యాన్ని తిరిగి జనబాహుళ్యంలోకి తెప్పించే ప్రయత్నం చేశాడు

అంతరించిపోతున్న కళలనండి..తెగ అనండి చిలకజోష్యం ఇప్పుడు కన్పించదు..సంక్రాంతి పండగకి బహుశా వాళ్లని అందరికీ గుర్తుకుతీసుకురాదలిచేడేమో కానీ..అక్కడికేదో మోదీ..సిబిఐ చెవిలో చెప్పడం..ఆయన చంద్రబాబు అండ్ కో కి ఊదడం తద్వారా జేసి గారికి ఈ అమోఘమైన విషయం తెలిసిపోయినట్లు..రాజధాని విషయంలో జగన్ ఇలా చేయకూడదు..రేపు ఎటూ వైఎస్ భారతి ఏడాదిలోపు సిఎం అవుతుంది..అప్పుడు ఈ నిర్ణయం ఆమెకి నచ్చకపోతే మళ్లీ మార్చుతారా అంటూ తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు..
ఇదే కదా కొత్త చెత్తపలుకులోని సారాంశం..ఇలాంటి చాణక్యాన్ని ప్రదర్శించే కదా..ఆర్నెల్లక్రితం ఎన్నికలల్లో బోల్తా పడింది..ఎంత వగచినా..మనల్ని జగనుడు పట్టించుకోడు..మరేం చేయాలి..ఫ్రస్ట్రేషన్ బాబూ..మీకు అర్ధమవుతుందా...

Comments