ఎక్కువ మాట్లాడితే మన అజ్ఞానమేగా బైటపడేది అజ్ఞాతవాసీ


చేగువేరా..చెంగువీరా విమర్శలను పక్కనబెడితే..ఓ రాజకీయపార్టీతో పొత్తు పెట్టుకుంటే మరీ ఇలా పార్టీ మారిన ఎమ్మెల్యేలా మాట్లాడాలా..అనేది మాత్రం ఖచ్చితంగా చర్చకి వచ్చేదే..మన జ్ఞానం తక్కువగా మాట్లాడటంలోనే ఉంటుందంటారు..బహుశా అందుకేనేమో పొలిటీషియన్లు గంటలకొద్దీ మాట్లాడినా..అందులో ఒకటే విషయం ఉంటుంది..తప్ప ఎక్కువ విషయాలు మాట్లాడరు

కానీ కొత్త బిచ్చగాడు  పొద్దెరగడన్నట్లుగా పవన్ కల్యాణ్ మాత్రం ఆయన అమెరికాకి..అనకాపల్లికి ముడిపెడతారు..ఆప్ఘనిస్తాన్‌ని ఆంధ్రప్రదేశ్‌నీ ఒకేలా చూడమంటారు..అసలు ఇప్పుడు బిజెపితో ములాఖత్ అయినట్లుగా ఎందుకు ఆర్భాటంగా ప్రకటించాల్సి వచ్చింది..ఎందుకూ...అంటే..ఇదిగో నా జోలికి రావద్దు..చూశారా నావెనుక ఎంత పెద్ద పార్టీ ఉందో చూడండి అని చెప్పడమే కదా..

మున్సిపల్ ఎన్నికల వరకే అయితే..దానికి బిజెపితో అలయన్స్ అయిపోయి ఇరగదీసేంత సీన్ లేదక్కడ..పైగా వాటి గురించి మాట్లాడకుండా..సిఏఏ గురించి నీకెందుకయ్యా మహాప్రభూ..అసలు ఏపీలో ఎవడైనా దాని గురించి నిన్ను అడిగారా..లేదు కదా..అయినా నీ మేధావితనం గురించి ప్రదర్సించాలనే కదా..నీ తాపత్రయం..ఓకే వాస్తవానికి నువ్ మేధావివే కావచ్చు..కానీ పార్టీ పొత్తులు..ఎత్తుల గురించి మాట్లాడకుండా ఏదేదో మాట్లాడేసి ఎందుకు ఇలా అభాసు పాలవడం .
.CAA ఎవరికీ హాని కలిగించదు..అది చాలా మంచిది..అంటూ మద్దతు పలికిన పవన్ కల్యాణ్ ఈ మాత్రం తెలివితేటలు లేకనే కేసీఆర్, జగన్, చంద్రబాబు, రాఘవులు, నారాయణ, కాంగ్రెస్ స్టేట్ లెవల్ లీడర్లు మాట్లాడలేదా..ముస్లింలను ఇక్కడికి రావొద్దనే అంశమే అందులోని ఇబ్బందికర నిబంధన..వాళ్లు ఇంకోచోటకి పోతారా..లేక అసలు వివక్ష వాళ్లపై  ఉంటుందా లేదా అనేదే కాదు..పైగా  అసోం..పశ్చిమబెంగాల్ సహా కనీసం నాలుగైదు రాష్ట్రాలలోని ముస్లింలకు ఇది తెచ్చే చిక్కులు నీకు తెలీదు కదా..

Comments