రాజశేఖర్ హీరోనా..మగాడా...విలనా...!


మాలో మెంబర్లు ఉండొచ్చు కానీ..హీరో మాత్రం రాజశేఖర్ మాత్రమేనంటూ ఓ వర్గం చెప్పుకుంటుంటే..మరో వర్గం మాత్రం..అబ్బే అసలు అంత గొడవేం లేదు..ఊరికినే రాజశేఖర్ ఏదేదో ఊహించుకుంటున్నాడు..మిగిలినవాళ్లు కూడా ఏమీ రాయవద్దు ఈ ఎపిసోడ్ గురించి అంటున్నారు

వాస్తవానికి మా డైరీ ఫంక్షన్..జనాలకు సంబంధం లేనిదే..కానీ అంతా సినిమావాళ్లే ఉన్న సమయంలో అక్కడ వాళ్లలో వాళ్లు విబేధించుకోవడం న్యూస్ కాకుండా పోతుందా..పైగా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా చేతులు జోడించి ఈ ఎపిసోడ్ ని మాత్రం వేయవద్దని కోరాడు..చిరంజీవికి కూడా ఈ మా డైరీ ఓపెనింగ్ నచ్చలేదనే ఆయన మాటల్లోనే అర్ధం అవుతోంది..ఐతే ఓ పెద్దగా మాత్రం..ఏం చేయలో...చేయకూడదో చెప్పి సైలెంట్ గా ఉండాల్సింది పోయి..
అనవసరంగా రాజశేఖర్ మాటలకు రియాక్ట్ అవడంతోనే మొత్తం ఎపిసోడ్ లో హీరో అయ్యాడు

పైగా మా తప్పులు జరుగుతున్నాయ్ దాన్ని కప్పి పుచ్చవద్దు అన్నప్పుడు..ఎస్ కానీ దాని గురించి మాట్లాడుకుందాంలే అని వదిలేయకుండా..మైక్ లాక్కున్నారు..డిసిప్లినరీ యాక్షన్ అనడం కరెక్ట్ కాదు..ప్లాన్డ్ గా వచ్చారని అంటే..ఔన్ుజరిగే ఉండొచ్చు...కానీ మా ప్రసెడిెంట్‌గా నరేశ్ ఎలక్ట్ైన దగ్గర్నుంచి అతగాడు అదేదో పెద్ద చీఫి మినిస్టర్ పోస్ట్ లా చాలా చాలా బిల్డప్పులు ఇవ్వడం మనం గమనించాం..ఇప్పుడు కూడా మైక్ ఇవ్వకుండా జస్ట్ కవర్ చేద్దామనుకుంటే రాజశేఖర్ పెద్ద షాకే ఇచ్చినట్లు అర్ధం అవుతుంది..


ఐతే ఎలాగైతేనేం..అక్కడున్న అందరిచేతా..మా లో గొడవలు ఉన్నాయని మాత్రం ఒప్పించగలిగారు..ఇప్పుడు రాజశేకర్ ఈ పదవి కూడా వద్దురాసామీ అంటూ వదిలేయడంతో ఇంకాస్త సింపతీ పెరిగిందనే చెప్పాలి

Comments

  1. రాజశేఖర్ ది చిన్నపిల్లాడి మనస్థత్వం అని 25సంవత్సరాలు కాపురం చేసిన భార్య చెప్పింది కదా?

    డైరీ ఆవిష్కరణ వేదిక మీద "మా" లో గొడవల గురించి ఎత్తడం అవసరమా ?

    మా "స్లోగన్" చిరంజీవిగారు చెప్పారు కదా ?

    మంచి గురించి ఊరంతా చెప్పాలి చెడు గురించి చెవిలో చెప్పాలి.

    మీకర్ధం అయేటట్లు చెప్పాలంటే జగన్ 150 సీట్లు గెలిచాడని ఊరంతా చెప్పాలి. జైలు కెళ్ళిన విషయం మాత్రం చెవిలో చెప్పాలి.

    ఇపుడు చెప్పండి

    ఎవరు హీరో ?
    ఎవరు మగాడు ?
    ఎవరు విలన్ ?

    ReplyDelete
  2. పాపం మీ ఫ్రస్ట్రేషన్ చూస్తే జాలేస్తుంది...
    ఇక్కడ రాజశేఖర్ చిరంజీవిపైన కామెంట్లు చేయలేదు...మా లో గొడవల సంగతి ఎత్తలేదు..అవి ఉన్నాయి..గొడవలు లేనట్లు బిల్డప్ ఇవ్వొ్ద్దని మాత్రమే చెప్పాడు..పైగా నరేష్ ఓవరాక్షన్ ఎలా ఉంటుందో డైరక్ట్ గా ఎన్ని వీడియోల్లో కన్పిస్తోందో ఓసారి చూడండి..తెలుస్తుంది అతగాడి శాడిజం గురించి శివాజీరాజా చెప్పాడు..ఇప్పుడు రాజశేఖర్ చెప్తున్నాడు..అంతే తేడా..కేవలం విజయనిర్మల కృష్ణ మొహం చూసి అతనికి ఓట్లేశారు...ఏదో వాట్సాప్ మెసేజ్ పెట్టాడట..అది చూసి ఎవడేం చేస్తాడో తెలుసుకోవాలట..మీకు maaలో గొడవలు ఫండ్స్ రైజింగ్ గురించి పూర్తిగా తెలిస్తే మాట్లాడండి..లేదంటే...వదిలేయండి.. ఇప్పుడు కనుక రాజశేఖర్ మాట్లాడకపోయి ఉంటే...భలే మేనేజ్ చేసాం అనుకునేవాళ్లే...అందుకే అంత ఫ్రస్ట్రేషన్..అసలు మీకు రాజశేఖర్ ఒక్కడే ఎందుకు రైజ్ చేసాడని అనుకుంటున్నారు..అతని వెనుక ఎవరు ఉన్నారో మీకు తెలుసా...అలానే చిరంజీవికి కూడా పిచ్చ కోపం వచ్చినా ఆపుకుని మరీ..ఎంబ్లమ్ గురించి మాత్రమే చెప్పాడో తెలుసా..నిన్న రాత్రి నరేష్ కి ఎవరెవరు ఎంతెంత సేపు క్లాస్ పీకారో తెలుసా...

    ReplyDelete
  3. ఇపుడు చెప్పండి

    ఎవరు హీరో ?
    ఎవరు మగాడు ?
    ఎవరు విలన్ ?

    ReplyDelete
  4. ఎవరిమీద ఎవరికి సింపతీ పెరిగింది?

    ReplyDelete

Post a Comment