లోకేశ్ అన్న ఆ ఒక్క మాటే రాజధానిని వైజాగ్‌కి తీసుకుపోతోందా..



ఒక్కోదానికి రీజనింగ్స్ ఉండవ్..తెలుగు సినిమాలలో హీరో విలన్ నో..విలన్ హీరోనో ఏదో మాట అంటాడు..దాన్ని పట్టుకునే ఇగో క్లాష్ తో సినిమా అంతా నడుస్తుంటుంది..పెద్ద పెద్ద యుధ్దాలు కూడా ఇలా ఒక్క చిన్న మాటతోనే ప్రారంభమైన దాఖలాలు ఉన్నాయ్...ఇప్పుడు రాజధాని తరలింపు కూడా అలానే జరిగిందా..అంటే కొంతమంది అవును అనే అంటున్నారు

నారా లోకేష్ ఎలాంటి ఓటమి పాలయ్యాడో అందరూ చూసారు..అతని మాటలకు విలువే ఇవ్వరు అధికారపక్షనేతలు..జనం కూడా లోకేష్ ఏ తప్పు మాట మాట్లాడతాడో అని వినడమే కానీ ఎక్కువమంది అతని ప్రసంగంలో ఏదో సందేశం కోసమో..లేక సమాచారం కోసమో వింటారని గమనిస్తారని అనుకోరు..కానీ అలాంటి లోకేస్ అన్న ఒక్క మాట అమరావతికి బై చెప్పేసి వైజాగ్ ఉరఫ్ విశాఖపట్నానికి కేపిటల్ వెళ్లేలా చేసిందా అంటే ఆశ్చర్యమే.

అమరావతిలో తట్టెడు మట్టి వేయలేదు..ఒక్క ఇటుకా పేర్చలేదు  లాంటి రొటీన్ డైలాగ్స్  వైఎస్సార్సీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ నుంచి అంతా బోలెడుసార్లు కామెంట్ చేశారు..అందులోనే ఓ సారి జగన్ మోహన్ రెడ్డి చేసిన కామెంట్లు టిడిపిని బాగా గెలికేసాయని అంటారు..ఆ సందర్భంలో నారా లోకేశ్..మాట్లాడుతూ.."అమరావతిలో ఏ అభివృధ్దీ జరగలేదంటున్నారు..బానే ఉంది..కానీ మరి మీరు కూర్చుంటున్న సిఎం కుర్చీ..ఆ కార్యాలయం కూడా టిడిపి అధికారంలో ఉండగా నిర్మించిందే  ..కళ్లు పెట్టుకుని చూస్తే కన్పిస్తుంది మేం చేసిన అభివృద్ధి "అని అన్నారు..
ఈ మాటలతోనే జగన్ కి మంటెత్తి పోయిందని..ఎన్నిసార్లు గెలిచినా..ఇదే పీఠం అంటే చంద్రబాబు కూర్చున్న కుర్చీలోనే కూర్చోవాలా అంటూ అసహనంతో రగిలిపోయి..ఇంతకి మించిన నగరంలో..కొత్తగా తమకి అనుకూలమైన నచ్చిన డిజైన్‌లో సిఎం పీఠం తయారు చేయించుకుని లోకేశ్ మాటలకు చెప్పకుండానే కౌంటర్ ఇవ్వాలనే మొండి పట్టుదలతోనే ఇలా వైజాగ్ షిఫ్ట్ అవుతున్నారని అంటున్నారు..నిజంగా ఇది నిజమేనా..?

Comments

  1. సచివాలయం అమరావతిలోనే అని జగన్ ప్రకటించారు కదా ? మీరు మరీ అతిగా ఊహిస్తున్నారు.

    ముఖ్యమంత్రి కొడుకు ఎక్కడైనా పోటీ చేయగలడు. పులివెందులలో నిలబడడానికి ధైర్యం అక్కరలేదు. మంగళగిరిలో నిలబడి గెలిస్తే వచ్చే కిక్కే వేరబ్బా !

    ReplyDelete

Post a Comment