చిరంజీవితో మహేష్ సినిమా...వాటే కాంబినేషన్

అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ..చిరంజీవి హీరోలుగా తోడు దొంగలు అని ఓ మూవీ వచ్చింది..చిరంజీవి హీరోగా ఎదుగుతున్న రోజుల్లో వచ్చిందా మూవీ..దానికి ముందే సూపర్ స్టార్ కొత్తల్లుడు లాంటి సినిమాల్లో కూడా చిరంజీవి చిన్న చిన్న క్యారెక్టర్లు చేసారు..ఐతే హీరోలుగా మాత్రం చేసింది ఒకటే సినిమా...ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి..సూపర్ స్టార్ మహేష్ బాబు కూాడ ఓ మూవీ చేయబోతున్నారనే న్యూస్ చక్కర్లు కొడుతోంది..ఫ్యాన్స్ కి బోలెడంత ఆనందాన్ని నింపుతోంది..


వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవి..మహేష్ బాబు చాలా ఏళ్ల నుంచి బాగా క్లోజ్‌గా మూవ్ అవుతుంటారు..స్టార్ హీరో నుంచి సూపర్ స్టార్‌గా ఎదిగే వరకూ కూడా మహేష్ తన తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ..ఇమేజ్ గ్రాఫ్ పెంచుకుంటూ పోతున్నాడు..ఇప్పుడు చిరంజీవి..మహేష్ రెండు శిఖరాలనడంలో సందేహమే లేదు..అలాంటిది వీళ్లిద్దరూ కలిసి చేస్తే...ఖచ్చితంగా పండగే..ఆ పండగ ఇప్పుడు మేకింగ్ లో ఉందని టాక్..


ఏ హీరో కానీ..డైరక్టర్ కానీ..తమ సినిమా ఫంక్షన్లకు తర్వాత చేయబోతే డైరక్టర్లు..నిర్మాతలతో వెళ్తుండటం జనరల్ గా జరిగే సంగతే..ఐతే ఇదివరకంటే ఎక్కువ సినిమాలు చేసేవాళ్లు కాబట్టి..ఆ సంబంధం లేకపోయినా..అంతా కలుస్తూ ఉండేవాళ్లు..ఇప్పుడు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూకి వంశీపైడిపల్లి కానీ..చిరంజీవి కానీ..కొరటాల శివ కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడానికి ఈ కాంబినేషన్ల ఈక్వేషన్లతోనే..వంశీ, దిల్ రాజు కాంబినేషన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ మూవీ చేయబోతున్నాడు..అదే ఆయన నెక్ట్స్ మూవీ..ఐతే కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ఓ సిినిమా చేస్తున్నారు...ఇందులోనే ఓ సర్ ప్రైజ్ ఎలిమెంట్ ఉండబోతోంది..

అదే మహేష్ బాబు క్యారెక్టర్ అంటున్నారు..కొరటాల శివ చేస్తోన్న మూవీ మలయాళ మూవీ లూసిఫర్ కి రీమేక్ అంటున్నారు..ఆ రైట్స్ రామ్ చరణ్ కొన్నది కూడా పవన్ కోసమన్నారు కానీ...చిరంజీవే చేస్తున్నారని టాక్..ఇందులో మోహన్ లాల్ కి తమ్ముడి వరసైన ఓ క్యారెక్టర్ ఎంట్రీతోనే ఆ సినిమా క్లైమాక్స్ కి లీడ్ అవుతుంది..టొవినో థామస్ చేసాడా  క్యారెక్టర్.. మొత్తం సినిమాకి ఆ తమ్ముడి క్యారెక్టర్ హైలైట్ కూడా..దీనిని మహేష్ బాబుతో చేయిస్తున్నారని అంటున్నారు..ఐతే మహేష్ బాబు ఇలాంటి గెస్ట్ క్యారెక్టర్స్ చేయరు..కానీ చిరంజీవికి  ఉన్న స్టార్ డమ్ ఆ మూవీలో యాక్ట్ చేస్తే..తన క్యారెక్టర్ కి వచ్చే రెస్పాన్స్ తెలిస్తే..ఖచ్చితంగా ఒప్పుకుంటారని అంటున్నారు..
అందుకే తొందర్లో చిరంజీవి మహేష్ బాబు కాంబినేషన్ లూసిఫర్ ద్వారా చూడబోతున్నారని టాక్ నడుస్తోంది..ఖచ్చితంగా ఈ సినిమాలో మోహన్ లాల్ లుక్‌కి మన బాస్ సరిపోతారని స్టిల్స్ చూస్తుంటేనే అర్ధమైపోతుంది..ఇదిగో చూడండి..ఇందులో చిరు లుక్ ఊహించుకోండి..ఈలలే కదూ..


Comments