సెహబాస్ నారీశక్తి..తానియా షెర్గిల్



71వ గణతంత్రవేడుకలు మహిళాశక్తికి వేదికగా నిలిచాయ్. ఆర్మీ పరేడ్‌ని లీడ్ చేసి కెప్టెన్ తానియా షెర్గిల్ అరుదైన ఘనత సాధించారు. ఇప్పటిదాకా రిపబ్లిక్ డే వేడుకలలో నిర్వహించే పరేడ్‌లను ఆర్మీ కెప్టెన్లే నిర్వహించగా...తొలిసారి మెన్ కంటింజెంట్ పెరేడ్‌ని లీడ్ చేశారామె..దీంతో ఈ ఘనత దక్కించుకున్న తొలి మహిళా ఆర్మీ కెప్టెన్‌గా
రికార్డు సృష్టించారు. సైన్యంలో చేరడానికి మహిళలు ఇప్పటికీ వెనుకాడే రోజుల్లో..ఇలా ఓ మహిళ రిపబ్లిక్ డే పరేడ్‌ని లీడ్ చేయడం  నారీశక్తికి నిదర్శనంగా చెప్తున్నారు

ఒక్క రిపబ్లిక్‌ డే మాత్రమే కాదు..ఈ మధ్యనే జరిగిన ఆర్మీడే సెలబ్రేషన్స్‌లోనూ తానియా షెర్గిల్ పెరేడ్‌కి నాయకత్వం వహించారు..ఇలా రెండు గొప్ప ఈవెంట్‌లలో నాయకత్వం వహించి ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారామె.. చెన్నైకి చెందిన  తాన్యా షెర్గిల్నా గ్‌పూర్ నుంచి బిటెక్‌లో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు. 26 ఏళ్ల తానియా షెర్గిల్ ప్రస్తుతం జబల్‌పూర్‌లోని సిగ్నల్ ట్రైనింగ్‌ సెంటర్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు

ఆర్మీడే..రిపబ్లిక్ డే ఇలా రెండు రోజులు ఆల్ మెన్ కంటింజెంట్ అంటే అంతా పురుషులే ఉన్న బృందాల పెరేడ్‌కి నాయకత్వం వహించిన తానియా షెర్గిల్ ఇంతవరకూ ఇలాంటి కార్యక్రమాలలో అసలు పాల్గొనలేదట..ఐతే చిన్నప్పట్నుంచి తానియాకి ఆర్మీలో చేరాలనే కోరిక ఉండేదట..ఆమె తండ్రి తాతలు కూడా
ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ కలిగినవారే కావడంతో ఆ కోరిక చాలా త్వరగా తీరిందనుకోవాలి.

ఆర్మీలో చేరాలనేవారికి తానియా షెర్గిల్ ఒక్కటే చెప్తారు..ఇక్కడ మెరిట్ ఒక్కటే చూస్తారు తప్ప..లింగ వివక్ష ఉండదని చెప్తుందామె.. రిపబ్లిక్ డే పేరెడ్‌లో పాల్గొనడం గర్వంగా అన్పిస్తుందని.. ఐతే అంతమాత్రాన తానేదో గొప్పదానిని మాత్రం కాదంటూ వినయంగా చెప్తుంది తానియా.. తనని చూసి మరో చిన్నారి బాలిక
సైన్యంలో చేరినా తన జీవితంలో చాలా సాధించినట్లేనంటూ తానియా చెప్పింది

Comments