ఔను కిషన్ రెడ్డి గారూ..వాళ్లు ఇటలీనే కోరుకుంటున్నారట



 పౌరసత్వసవరణ చట్టంతో ఇక్కడున్నవారికి ఎలాంటి ఇబ్బంది లేదనేది వాస్తవం..కేంద్రం కూడా అదే చెప్తోంది..ఐనా అప్పోజిషన్ పార్టీలు వినవ్..ఐతే ఈ సందర్భంలో ప్రచారం చేయాల్సిన విషయాన్ని వదిలేసి ఇలా సవాళ్లకి దిగడమేంటి..పాకిస్తాన్ హిందువులు..ఇటలీకి పోవాలా..వాళ్లు రానివ్వరంటూ మనం చెప్పడమేంటి..ఇందుకో ఇక్కడి ముస్లింలకు తాము ఏదో మూలకి నెట్టివేయబడుతున్నామనే ఫీలింగ్ కలుగుతోంది..తమ వర్గం వారిని ఈ చట్టంలో ఎందుకు మినహాయించారో ఓ సహేతుకమైన కారణం చెప్పకుండా ఎదురుదాడికి దిగితే లాభం ఏం ఉంటుంది..?

కిషన్ రెడ్డి గారు ఓ ప్రశ్న వేసారు..దానికి ప్రతిగా ఈయన సమాధానం చెప్పలేదు కానీ..ఏమంటున్నాడో చూడండి
బంగ్లాదేశ్ లో ఓ వేళ అణచివేత( అసలు అది ఉండదని చెప్తున్నాడీ బంగ్లాదేశ్ మంత్రి) ఉంటే...వాళ్లు ఇటలీ కానీ..ఫ్రాన్స్ కానీ..అమెరికాకి కానీ వెళ్లారు కానీ..అసలు ఇండియాకి ఎందుకు వస్తారు అని ప్రశ్న వేస్తున్నాడు..
లాస్ట్ మంత్ భారత్‌కి రావాల్సి ఉన్న ఈయన తన  టూర్ క్యాన్సిల్ చేసుకున్నాడు..
అప్పట్లోనే సిఏఏతో ఇండియాపై ఉన్న సెక్యులర్ కంట్రీ అనే ముద్ర పోతుందని కూడా వాపోయాడు..సరే ఆయన వాపోవడం సంగతెవరు పట్టించుకుంటారు కనుక..సెక్యులర్ అనే పదమే పెద్ద బూతుగా అనుకునే పెద్దలు ఉన్నప్పుడు..


సరే పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్ హిందువులనే ఎందుకు చట్టంలో చేర్చడం..శ్రీలంక..భూటాన్ ని వదిలేశారే..అక్కడ నుంచి ఇక్కడకు వచ్చే..తమిళియన్స్ పరిస్థితి ఏంటి..వద్దా మనకి..సరే ఓకే..వదిలేద్దాం..నేపాల్ మాటేంటి..అక్కడ్నుంచి ఎంతమంది హిందువులు ఇక్కడకు రావడం లేదు..వారికి కూడా చట్టంలో చోటు ఎందుకు లేదు..అదెటూ హిందూదేశం కాబట్టా...మరి అక్కడి ుంచి ముస్లింలూ వస్తున్నారే...అదెలా వదిలేస్తే...చాలా చిక్కులే ఉన్నాయ్..బహుశా చట్టం మొత్తం చదువుకుంటే కానీ తత్వం బోధపడదేమో..

Comments