అల సంక్రాంతి వనములో డూప్లికేటు వసూళ్ల గోల

సంక్రాంతి విన్నర్ అట..నిజానికి సంక్రాంతి ఇవాళ..రేపు కనుమ..ఇంకా అడుగూ బొడుగూ సినిమాలు కూడా రావచ్చు..అది పూర్తయ్యేదాకా కూడా ఆగలేవా..సామజవరగమకా..ఎందుకు నీకీ ఆత్రం..బహుశా హిట్ లేక పరితపిస్తున్న ఇద్దరికీ మంచి హిట్  దొరికిందహో అని ఊరంతా చాటింపు కోసమేనా..


వాస్తవానికి మీ సినిమా సంక్రాంతికి కాదు..సరిలేరుకి పోటీ కోసమే ముందుకు వచ్చారు ఈ సినిమా నిర్మాతలు..వచ్చారు పో..మెదలకుండా ఊరుకోకుండా..మాదే హిట్టు..అని ప్రకటించుకోవడం రెచ్చగొట్టడమే..అందుకే కింద మహేష్ బాబు మూవీకి కూడా సిసలు హిట్ అంటూ పోస్టర్ పడింది..సరిపోయిందా ఇప్పుడు 

అసలు మహేష్ బాబు మొదటి రోజు కలెక్షన్స్ దద్దరిల్లాయనేది అందరూ ఒప్పుకునే విషయమే..దానికి పోటీగా అంతకంటే ఎక్కువ వచ్చాయని చెప్పుకునే తాపత్రయంలో పెద్ద అడుసులో అల్లు కాలు పడింది..ఎందుకంటే షేర్ వేరు..గ్రాస్ వేరు..రెంట్..ఫిక్స్డ్ డ్ హైర్ తీసేయగా వచ్చేది షేర్..అలా కాకుండా టిక్కెట్లరూపంలో ెంతవస్తే అంత చూపించడం గ్రాస్..షేర్ 42 కోట్లు రావడం..గ్రాస్ 85కోట్లు రావడం రెండూ ఒకటేనా..ఈ 85కోట్ల రూపాయలలో రెంట్ తీసేస్తే వచ్చేది ఏ 30 కోట్లో అవుతుందనేనా అల..అల అంటూ గ్రాస్ రిపోర్ట్ చేసింది..

ఇంకొద్దిగా వెనక్కి వెళ్తే..అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధానికి ఇలానే పోస్టర్ల పోజులు కొట్టారు..ఒక్క వారంలోనే వందకోట్ల గ్రాస్ అంటూ హడావుడి చేసారు..తీరా కనీసం యాభైరోజుల సెంటర్లు ఒక్కటంటే ఒక్కటి కూడా లేకుండా పోయింది..అంటే యాభైరోజులు ఆడాలా అంటే..ఒక సినిమా వారంలోపే వందకోట్లు కలెక్ట్ చేస్తే..ఎంత బావుంటే అలా రావాలి..అంత బావుంటే యాభై రోజులు కూడా ఆడలేదా...
ఎందుకంటే రేపు మహేష్ బాబు మూవీ కనీసం పాతిక సెంటర్లలో వందరోజులాడే దమ్ము ఉఁది సరిలేరు నీకెవ్వరూకి..ఆరేంజ్ లో జనం చూస్తున్నారు..నవ్వుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు..మరి అలకి కూడా ఇలానే ఉఁదా..?


Comments