దటీజ్ మెగాస్టార్..సినిమా అంటే ఎంత తపనో


మెగాస్టార్ చిరంజీవి నటుడిగా ఎంతమందికి చేరువ అయ్యారో..రాజకీయాల్లో అంత దూరం అయ్యారంటే అతిశయోక్తి కాదు..ఈ నిజం ఆయన కూడా అంగీకరించారు కాబట్టే..ఇప్పుడు కాస్త పాలిటిక్స్ కి దూరంగా ఉన్నారని చెప్పాలి..ఇదే విషయాన్ని గొంతెత్తి మరీ సరిలేరు నీకెవ్వరూ సినిమా ఫంక్షన్ లో చెప్పుకొచ్చాడాయనే స్వయంగా..

రాజకీయాలు ఆయనకి సరిపడవని అనడంలో నిజం ఎంతుందో తెలీదు కానీ..మనసు పెట్టి  రాజకీయం చేసినట్లు మాత్రం అన్పించదు.దానికి తగ్గట్లే ఆయన ప్రసంగాలు కూడా కృతకంగా అన్పిస్తాయ్..అదే సినిమా ఫంక్షన్లు అయితే ఎంత లీనమవుతారో..ఎంతగా ఆస్వాదిస్తారో..ఎంతగా ఆకట్టుకునేలా మాట్లాడతారో అనేదానికికూడా సరిలేరు నీకెవ్వరూ మరోసారి రుజువు చేసింది.

ఎక్కడా తడుముకోరు..ఎక్కడా తప్పు మాటలు ఉండవ్..అబద్దం చెప్తున్నట్లు..అన్పించదు..అంత చక్కగా..మాట్లాడుతూ..రంజింపజేయడంలో మెగాస్టార్ కి ప్రత్యేక స్థానం ఇవ్వాల్సిందే..అందుకే అవడానికి మహేష్ బాబు హీరో అయినా సరిలేరు నీకెవ్వరూ ముందస్తు వేడుకలో మాత్రం అసలు హీరో కాబట్టే చిరంజీవి గారు చివరిలో మాట్లాడారు..మహేష్ బాబు గురించి..విజయశాంతి గురించి..నిర్మాతల గురించి..దర్శకుడి గురించి..ఇంకా చాలా చాలామంది గురించి మాట్లాడిన తీరు చాలు..ఆయన సినిమాలను ఎంత మిస్సయ్యాడో..ఎంతగా ప్రేమిస్తాడో తెలియడానికి..

నేనో వ్యాసం రాస్తే ఓ మగానుభావుడికి నచ్చలేదు..సినిమాలు త్వరగా తీయాలి..హిట్టో ఫ్లాపో  తర్వాత ఏళ్లకి ఏళ్లు తీయకూడదు..రజనీకాంత్..బాలయ్యలా ఉండాలి అని..వాళ్ల ఇష్టం వచ్చినట్లు వాళ్లు తీస్తారు మీకేంటి నష్టమంటూ నిష్టూరమాడిన సదరు హీరో..ఇప్పుడు చిరంజీవి మాటలకు కూడా అలానే స్పందిస్తాడేమో ఆలోచించుకోవాలి..ఇండస్ట్రీ ఏదైనా..తక్కువ సమయం ఎక్కువ ఉత్పత్తులు రావాలి..క్వాలిటీ కూడా ఉండాలి..ఏళ్లకి ఏళ్లు తయారు చేసిన ఉత్పత్తుల్లోనే క్వాలిటీ ఏడుస్తుందా...?

Comments