అప్పుడూ ఇంతే..ముందు రాతలు..తర్వాత స్పీచ్‌లు..మళ్లీవాటినే రాతలుగా కోతలు ఈనాడైనా మారదా


ముందు మనమేం చేయాలో దానిని వందిమాగధుల చేత అన్పించడం..వాటిపై మన గోడ పత్రికలకెక్కించడం ..తర్వాత కరపత్రికల ద్వారా ప్రచారం చేయడం...ఆ తర్వాత ఇదిగో చూడండి మీడియాలో కూడా వస్తున్నాయంటూ వాటినే పట్టుకుని నోరు పారేసుకోవడం...దాని తర్వాత..నిప్పులు చెరిగిన మహానేత అంటూ..అచ్చోయడం..ఈ విద్యలో ఆరితేరిన పండితులకు ఇప్పుడు షాక్ మీద షాక్ తగలడంతో..కొన్నాళ్లు సైలెంటయ్యారు..ఐనా సరే పాత బుద్దులే మనల్ని గద్దెనెక్కించారనుకుంటారు కదా..అదే ట్రెండ్ మొదలైంది

ముందే కూర్చుని మనోళ్లతో పోస్ట్ కార్డులు...పుంఖానుపుంఖాలుగా లేఖలు రాయమని పురమాయించడం..రెడీగా ఉన్న రిపోర్టర్లతో వాటిని టెలికాస్ట్ చేయించేలా చేయడం...ఆ తర్వాత వాటినే పట్టుకుని..చూడండి..రైతులు రాష్ట్రపతికి లెటర్లు రాస్తున్నారు సిగ్గులేదా అంటూ డైలాగులు వల్లించడం ఒకటి..



రెండోది ఓ పదిమందికి ఉపయోగపడే పని చేస్తుంటే..పొగడకపోగా..కడుపుమంట..ఆ ఇదేముందిలే అంటూ ఏడుపులు అక్కసు వెళ్లగక్కడం...ఆర్టీసీని కలుపుకుంటామంటే..ఆ అయినప్పుడు చూద్దామని ఏడిచిన ఈ మగానుభావులే తీరా అది మూడు నెలలలోపే జరిగేసరికి ఏదోలా అక్కసు తీర్చుకోవడానికి ఓ పత్రిక...ఫించన్ లేని విలీనమా అంట...కనీసం కడుపుకి డ్యాష్ తింటన్నారేమో అని తిడతారనే జ్ఞానం లేదు.. పైగా ఏదో ఆర్టీసీలో ఉన్నవాళ్లంతా కిడ్నీ పేషెంట్లైనట్లు..అప్పటికప్పుడు గుర్తొచ్చినట్లు..కిడ్నీ ట్రీట్ మెంట్ ఆపేస్తారేమో అంట..ఎవడి డౌట్ అది..వీడికేది డౌట్ వస్తే అది రాసేయడమేనా...వెయ్యి రూపాయలు దాటిన ప్రతి ట్రీట్ మెంట్ ఆరోగ్యశ్రీకింద తీసుకువస్తుంటే..మళ్లీ నీ అనుమానాలతో ఎవరిలో ఏ బీజం వేసే ప్రయత్నం..పాలల్లో ఉప్పుకళ్లు బతుకులు కావా ఇలాంటి రాతగాడివి

కింద మరో పత్తిత్రిక ఉంది..దాంట్లో చూడండి ఏమని రాసారో...పాత పింఛన్..అంటే ఎంప్లాయీ స్టేక్ లేకుండానే గవర్నమెంటే పెన్షన్ ఇయ్యడం..ఇది కానీ ఇస్తే..జగన్ సర్కారుకి గవర్నమెంట్ ఉజ్జోగులంతా ఎంతో రుణపడి ఉంటారు..అది కూడా  ఆలోచిస్తున్నామంటే గొప్ప విషయమే కదా..కాదనేవాళ్లకి ఆ పెన్షన్ విధానమేందో తెలీకనే అనుకోవాలి..

ఇక కింద మరో రాత..ఆపరేషన్ క్రూర అంట..కందిపప్పు కూరేం కాదూ...కరడుగట్టిన ఫ్యాక్షనిస్టులు బస్సులతో జనాల ప్రాణాలు తీసినప్పుడు రాయలేని రాతలు..రాజకీయ ఎత్తులపై మాత్రం వామ్మా వాయ్యో అంటూ కార్టూన్లేసి మరీ రాతలు..పైగా టిడిపి కూడా లాగేస్కుందిగా అనకుండా..అబ్బే అప్పుడింత లేదు అంట..ఇదిగో ఇంతే..ఈ రాతలు మారవు..ఈనాడైనా..ఏనాడైనా...వీళ్ల తీరు ఇంతే...




Comments