నువ్వు ఎవరికీ జవాబుదారివి కాదు..పవన్ నీ అత్మకి కూడా


నేనేమైనా కమ్యూనిస్టులకు బాకీనా...?
నువ్ నాకు ఓటేయలేదు..నన్నడిగే హక్కు లేదు
వద్దు వద్దంటున్నా నా మాట వినలేదు..
ఇదీ పవన్ కల్యాణ్ గారి సమాధానాలు..

ఏ పార్టీ ఎవరితో అయినా కలవవచ్చు..అందులో అభ్యంతరం ఏముంటుంది..కానీ ఓటర్లకి నచ్చకపోతేనే ఓడిపోయేది..ఇది తెలిసినవాళ్లు ఓటర్లని..ఆ తర్వాత జనాన్ని కన్విన్స్ చేసేందుకు  చూస్తారు..ఎందుకంటే ఆఫ్ట్రాల్ గెలుపు కోసమే కదా ఈ కలయికలు..మరి అలా ఏ కారణంతో కమ్యూనిస్టులకు సరిపడని బిజెపితో వెళ్తున్నారు అని రిపోర్టర్ అడిగితే పవన్ కల్యాణ్ గారి జవాబు ఇది..అఫ్ కోర్స్ జవాబు కూడా ఆయన ఇష్టమే..

మరి అంతకు ముందు వారం రోజుల క్రితం జనాన్ని కూడా ఇలానే నువ్ నాకు  ఓటేయలేదు..నన్నడగొద్దు అనడం మాత్రం సబబేనా..అలానే  అనుకుందాం..మరి ఇక నువ్ ఎవరికి జవాబుదారీవి తెలుసుకోవాలిగా..అక్కర్లేదా..ఆ సరే వదిలేస్తాం...
బిజెపి, టిడిపికి సపోర్ట్ అన్నావ్..ఆ తర్వాత బిజెపి ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నావ్..వైఎస్సార్సీపీ కూడా హోదా గురించి అడగాలని ఈ మధ్య కూడా అన్నావ్ మరి..ఇప్పుడు నువ్ అడగవా..అడిగేదేలేదు కాదు..అప్పనంగా ప్యాకేజీ ప్రయోజనలేంటో బిజెపి వాళ్లు చెప్పడంతో కళ్లు తెరుచుకున్నాయని చెప్తున్నావ్ కదా...మరిదే కదా అప్పుడు టిడిపి కూడా చెప్పింది..కానీ టిడిపి ఆ వాదనకి కట్టుబడకుండా..లేదు మాకు మళ్లీ హోదా కావాలంటూ ఏషాలు వేయబట్టే కదా..తిప్పికొట్టింది..ఇంకా నువ్ ఎవరికీ జవాబుదారీవి కాదనుకంటే..వెళ్లి సినిమాలు చేస్కోవయ్యా బాబూ రిజల్ట్ వెంటనే తెలిసిపోతుంది..హిట్టో ఫట్టో..ఎలక్షన్స్ లా  ఐదేళ్లు ఆగక్కర్లేదు

Comments