సరిలేరు నీకెవ్వరూ స్టోరీ ఇదేనా..సూపర్ స్టార్ కూడా ఉన్నాడా..?


కొత్త కథ కొత్త కథ అంటున్నారు కానీ..సరిలేరు నీకెవ్వరూ ప్లాట్ ఇప్పటికే చాలామంది ఎక్స్ పెక్ట్ చేసేస్తున్నారు..ఆర్మీలో పని చేసే మహేష్ బాబు కర్నూలులో ఫ్యాక్షన్ లీడర్ ప్రకాష్ రాజ్..మధ్యలో లింక్ విజయశాంతి క్యారెక్టర్..ఈ మూడు పాత్రల మధ్య వచ్చే సీన్స్..ఎమోషన్స్..ఇవే కథలో మెయిన్ పాయింట్స్ గా అర్ధం అవుతోంది..

ఓపెనింగ్ సీన్స్‌లో మహేష్ బాబు మేజర్ అజయ్‌గా కశ్మీర్‌ దగ్గర కిడ్నాప్ చేసిన స్కూల్ పిల్లలను రిలీజ్ చేయడంతో ప్రారంభం  అవుతుంది..తర్వాత ఎస్టాబ్లిష్ మెంట్స్ షాట్స్‌తో కథని డైరక్టర్ ముందుకు నడిపి ఉంటాడని అంచనా..ఇక్కడే మహేష్ కి సంబంధించిన స్నేహితులలో ఒకరు చనిపోవడం..ఆ ఫ్యామిలీని ఆదుకునేందుకు సూపర్ స్టార్ కర్నూలుకి వెళ్లాల్సి వస్తుంది..ఆ ఫ్యామిలీ విజయశాంతికి చెందినది..అందులో లేడీ గ్యాంగ్ ..ఆ లేడీ గ్యాంగ్‌లో రష్మిక మన క్యూట్ హీరోని చూసి మనసు పారేసుకోవడం జరుగుతుంది.. ఇది ఎంటర్ టైన్ మెంట్ పార్ట్ కాగా..ప్రొఫెసర్ భారతి పాత్ర పోషించిన విజయశాంతికి విలన్ కొడుకుతోనో...రిలేటివ్‌తోనే కాలేజ్ లో మొదలైన గొడవ తారాస్ధాయికి చేరుతుంది..ఇక్కడే హీరో ఎంట్రీ ఉంటుంది..ఇప్పటికే రెండు బ్యాంగ్‌లు చూసాం. ట్రైలర్‌లో అద్దిరిపోయాయి అవి..
విలన్ వేసిన డైలాగ్‌నే మహేష్ రిపీట్ చేసి..ఏం మాట్ధ్లాడుతున్నావ్ అనడం..ఎమ్మెల్యేల గ్యాంగ్ ని అటాక్ చేసి..బాధ్యత లేదా అనడం థియేటర్లలో అద్దిరిపోవడం ఖాయం..ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ప్రి రిలీజ్ ఫంక్షన్‌లోనే రివీల్ చేసారు..బొమ్మ అద్దిరిపోతుంది ఇప్పుడు చిన్న బ్రేక్ ఇచ్చానంటూ ప్రిన్స్ డైలాగ్ ఇప్పటికే రింగ్ టోన్స్ లోకి వెళ్లిపోయింది.


.విలన్ గ్యాంగ్ కి సెకండ్ హాఫ్‌లో మేజర్ అజయ్ ఎలా ఎండ్ కార్డ్ వేసాడు..విజయశాంతి ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడనేదే సెకండ్ హాఫ్ కాగా..ఇక విజయశాంతి..మహేష్ మధ్య సూపర్ స్టార్ కృష్ణ క్యారెక్టర్ కూడా ఉందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది..బహుశా కొడుకు దిద్దిన కాపురంలోని ఫైల్ విజువల్స్‌ని ఇక్కడ వాడే ఛాన్సుందని ఫ్యాన్స్ అంచనా..స్తూలంగా ఇదే సరిలేరు  నీకెవ్వరూ స్టోరీ అంటున్నారు..

ఫస్ట్ సాంగ్‌గానే సరిలేరు నీకెవ్వరు టైటిల్ సాంగ్ .తర్వాత.. డ్యాంగ్ డ్యాంగ్ సాంగ్..వస్తాయని కూడా ఈజీగా అర్దమైపోతుంది..మొత్తానికి సంక్రాంతికి మహేష్ హిట్ ఖాయమనే టాక్ ఇప్పటికే స్ప్రెడ్ అయిపోయిది..

Comments