మా గోల ఇప్పటిది కాదు

మా గోల ఐదారేళ్లుగా సాగుతున్నదే...కాకపోతే..ఈసారి వేదికపై చిరంజీవి ఉండటమే కాస్త జనాల్లో ఆసక్తి పెంచింది
పైగా చిరంజీవి రాజశేఖర్...చిరంజీవి మోహన్ బాబు...విడివిడిగా గొడవలు పడ్డవాళ్లే...అటు రాజశేఖర్ కి సపోర్ట్ గా మోహన్ బాబు నిలబడిన రోజులు ఉన్నాయ్..ఇటు సుబ్బిరామిరెడ్డి...కృష్ణంరాజు..రాజశేఖర్‌తో కలివిడిగా ఉండేవాడు..ఇలా కలగాపులగం అయిపోయిన మా ఇంట్లో...ఒక్క రాజశేఖర్ మాత్రమే వాళ్ల టోన్‌లో లేకపోవడమే..ఇంత రచ్చకి కారణం...

అతను కూడా..వీళ్లలానే య్యస్..మేమంతా వక్కటే...ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయ్...ఐనా వుయార్ వన్..అఁటూ లెక్చరిస్తే..అంతా చప్పట్లు కొట్టేవాళ్లేమో...ఎలక్షన్ కి ముందు కలిసి ఉన్నా...నరేష్ రాజశేఖర్ రిజల్ట్స్ వచ్చిన రోజే విబేధించుకోవడం ప్రారంభమైంది...మొత్తం నేను చేస్తా..నేను చేస్తా అంటూ నరేష్ మాట్లాడటం..అలా కాదు..అందరం గలసి జేస్తం అని జెప్పితే బావుండేదని నేను అనుగుంటా..అంటూ వచ్చీ రాని తెలుగులో రాజశేఖర్ కౌంటరివ్వడంతోనే ఈ తేడాలకు బీజం పడింది..అప్పుడే ఓ వైపు హేమ మాట్లాడుతుండగానే..నరేష్ మైక్ లాక్కోవడం..కోటశ్రీనివాసరావ్ మాట్లాడుతున్నా...మైక్ లాక్కోవడం చేసాడు...అదిగో...అదే ఇప్పుడు రాజశేఖర్ చేసేసిరికి పాపం పెద్దతలకాయలకు మింగుడుపడటం లేదు..
పైగా రాజశేఖర్ మాట్లాడినంత సేపూ భిల్లా రంగాలతో పాటు...డైలాగ్ రైటర్ కూడా హావభావాలతో..ఏదో జరిగిపోతుందన్నంత సీన్ బాగా పండించారు..ఇప్పుడేమైంది..రాజశేఖర్ ఈ తొక్కలో పదవి మాకొద్దుపో అన్నాడు..నిజమే..ఏమంత పెద్ద పదవులు అవి..దానికోసం ఓ తెగ క్యాంపైన్లు..హడావుడి గెలచిన తర్వాత డ్యాన్సులు..కొంతమంది మొహం మాడ్చుకోవడం ..ఏందబ్బా ఈ గోల అన్పించింది..ఇప్పుడు వచ్చే ఎలక్షన్లు దీనికంటే హడావుడిగా అవుతాయని ఈ మాగోల ప్రూవ్ చేసింది

Comments