సూపర్ స్టార్ కృష్ణ గురించి చిరంజీవి తపన


దాదా సాహెబ్ ఫాల్కే తెలుగులో ఇక వస్తే..కృష్ణకే ఇవ్వాలంటూ మెగాస్టార్ చిరంజీవి చెప్పడం..ఫంక్షన్ కి వచ్చిన ప్రతి ఒక్కరిని టచ్ చేసింది..కొడుకుని చూసి గర్వించే కృష్ణగారు తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో ప్రయోగాలు చేసారు..ధైర్యసాహసాలకు పెట్టింది పేరు అంటూ ఇన్నాళ్లూ పేపర్లో చదివే మాటలను మెగాస్టార్ లాంటి వ్యక్తులు చెప్పడం నిజంగా అబ్బురపరిచే విషయం..
వయసు మీద పడి నడవడమే కష్టమైన కృష్ణగారికి..నిజంగా సరిలేరు నీకెవ్వరూ మూవీ ప్రి రిలీజ్ ఫంక్షన్ ఓ అంకితసభలా మారింది..బహుశా ఇంట్లో నుంచే టివిలో చూసి ఉంటే ఖచ్చితంగా చలించిపోయే ఉంటారు..పుత్రుడు కలిగినంత మాత్రాన పుత్రోత్సాహము కలుగదు..నలుగురు ఆ పుత్రుని గని..పొగిడినంత..అనే శతకం మహేష్ బాబు విషయంలో ఎప్పటికప్పుడు రుజువు అవుతుంటుంది..


Comments