నిమ్మగడ్డ ఓకే..మరి కనగరాజ్ సంగతేంటి..ఆ లెటర్ విషయం ఏంటి


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్దు వద్దన్న ఏబీ వేంకటేశ్వర్రావ్ వచ్చేశారు..పో పొమ్మన్న నిమ్మగడ్డ రమేష్
కుమార్ తిరిగి ఎన్నికల కమిషనర్‌గా డ్యూటీ ఎక్కేశారు..ఐతే మరి కనగరాజ్ పరిస్థితేంటి..
ఆయన  ఓ వైపు..మరోవైపు ఈయన కుర్చీలేసుకుని కూర్చుంటారా..ఈ సీన్ ముఖాముఖీ కనబడకపోయినా
ఎప్పుడో మా చిన్నతనంలో ఎన్టీఆర్ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ ఎకాఎకిన తగ్గించేయడంతో..కొంతమంది రిజిస్టార్లుగా సబ్ రిజిస్టార్లుగా మండలరెవెన్యూ ఆధికారులుగా ప్రమోట్ అయ్యారు..ఐతే ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గడంతో..పాతవాళ్లు వచ్చి వాళ్ల సీట్లలో కూర్చుకున్నారు..అప్పుడే ప్రతి ఆఫీస్‌లో ఇలా రెండు ఉన్నతాధికారుల కుర్చీలు ఉండటం..ఆఫీసుల్లో పనుల కోసం వెళ్లినవారికి ఏ ఆఫీసర్ దగ్గరకు వెళ్తే పనవుతుందో తెలీకపోవడం,..ఆ ఎపిసోడ్లపై డైలీ న్యూస్ పేపర్లలో కార్టూన్లు వేయడం కూడా జరిగింది ఇప్పుడు అలా జరుగుతుందా..లేక కోర్టు తీర్పిచ్చేసింది కాబట్టి..కనగరాజ్ గారు తిరిగి తమన పాత జీవితానికి వెళ్లిపోతారా..రెండోదే జరుగుతుందనుకుంటా

ఇక ఇప్పుడు జగన్ ఏం ఫీలవుతారనేది ఇప్పుడు చర్చకు రావాల్సిన అంశమే...ఎందుకంటే జనం చాలామంది చెప్పుకునేది జగన్ ఓ పట్టు పట్టాడంటే వదలడని కుందేలు లేకపోయినా..దానికి కాళ్లపై పంతానికి పోతాడంటారు..మరి ఇప్పుడు రమేష్ కుమార్‌ని అంత తేలిగ్గా వదులుతాడా..పైగా రమేష్ కుమార్ ఆయనకి ఏపీలో భద్రత లేదని హైదరాబాద్ లో ఉండి పని చేసుకునేలా వెసులుబాటు కల్పించాలంటూ హోంశాఖకి ఓ లెటర్ రాశాడు చూసారా..అదెక్కడ్నుంచి రాసాడు..ఎవరు కూర్చారు అనే విషయాలపై కేసు ఒకటి నడుస్తుంది గుర్తుంది కదా..ఇప్పుడు దాన్ని కానీ గెలుకుతారా..వైఎస్సార్సీపీ లీడర్లు..

ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు  వచ్చీ రాగానే ఆయన  స్థానిక ఎన్నికలపై అప్పుడే మున్సిపల్ కమిషనర్లకు..కలెక్టర్లకు ఫోన్లు చేసేస్తున్నారట..పార్టీలతో కలిసి ఇదివరకటిలాగే ఎలాంటి పక్షపాతం లేకుండా
డ్యూటీ చేస్తానంటున్నాడట..ఇదివరకటిలాగే అంటే..ఇదివరకటిలాగే రాత్రికి రాత్రి ఎవరికీ చెప్పకుండా..తన నిర్ణయాలు తానే తీసుకుని..ప్రెస్‌కి మాత్రం బ్రీఫ్ చేస్తారా చూద్దాం..చూడబోతే రాబోయే రోజుల్లో బోలెడంత రంజుగా రాజకీయం మారేట్టు ఉంది ఏపీలో..

Comments

  1. శ్రీమాన్ కనగరాజు గారి నియామకం రద్దయింది కాబట్టి వారు గృహోన్ముఖులు కావలసిందే -తప్పదనే అనుకుంటాను. సుప్రీంకోర్టు వారు హైకోర్టు ఆదేశాలను నిలుపుదల చేయకపోతే రాజుగారి కథ కంచికే
    అవుతుంది. ఇకపోతే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అంటూ నిమ్మగడ్డ గారిపై కక్ష సాధించాలని ప్రభుత్వం భావిస్తే అది మరొక పోరాటపర్వం అవుతుంది.మళ్ళా జీవోలూ మళ్ళా కోర్టుతీర్పులూ మళ్ళా అప్పీళ్ళూ‌ వెక్కిళ్ళూను. శుభం భూయాత్.

    ReplyDelete
  2. తానా తందానా పచ్చగడ్డ చెంచాలు ఇప్పుడే తొందరపడి సంబర ఆశ్చర్యాలు పడిపోకండి.
    ఇది హైకోర్టు, పైకోర్టు ఇంకోటుంది: తుదితీర్పు కోసం పడిగాపులు కాయండి.

    నోటీసులు, మధ్యంతర ఉత్తర్వులు, అబీటర్ అన్నీ కలగాపులగం చేసి ఎదో 64 ఫార్వర్డ్ కహానీలు రాసుకున్నంత మాత్రాన ఎదో ఒరుగుతుందనుకోవడంతోటే వీళ్ళ "నైపుణ్యత" తెల్లారినట్టే. పైగా సివిల్ లిటిగేషనులో శిక్షలు ఉంటాయని ఎవరో తలమాసినోడు చెప్పాట్ట!

    ReplyDelete
    Replies
    1. @Jai Gottimukkala29 May 2020 at 10:58
      తానా తందానా పచ్చగడ్డ చెంచాలు ఇప్పుడే తొందరపడి సంబర ఆశ్చర్యాలు పడిపోకండి........పైగా సివిల్ లిటిగేషనులో శిక్షలు ఉంటాయని ఎవరో తలమాసినోడు చెప్పాట్ట!
      hari.S.babu
      పిచ్చోడా!
      హైకోర్టు స్వయాన "పంచాయితీ చట్టం ప్రకారం ఆయన పదవిని కుదించారంటే మున్సిపల్ కమిషనర్ హోదాలో కొనసాగుతున్నట్టు భావించవచ్చా!" అని అడిగినది చెప్పుచ్చుకు కొట్టడం అని కూడా అర్ధం కాలేదా నీకు?

      కూనిశెట్టి శ్రీనివాస్ అనే ఒక లాయరు దగ్గిర్నుంచీ దాదాపు కాన్స్టిట్యూషన్ బేసిక్సు తెలిసిన ప్రతివాడికీ నిమ్మగడ్డ రమేష్ కేంద్రం ఎన్నికల్ నిర్వహణ కోసం రాష్ట్రానికి పంపించిన ఉద్యోగి అని తెలుస్తుంది.నిన్న గాక మొన్న డెప్యుటేషను మీద రాష్టర్మ్ వచ్చిన ఒక కేంద్రప్రభుత్వ ఉద్యోగిని పీకబోయి భంగపడిన సంగతి గుర్తు లేదా నీకూ వైపాపా పేటీయం బ్యాచ్చికీ!

      రాజ్యాంగం మొత్తం పూరీల పిండిలా ఒకే ముద్ద కాదు,ప్రజాప్రాతినిధ్య చట్టం అనేది పంచాఇతీ రాజ్ చట్టానికి సమాంతార్మైన చట్టమే కానీ అనుబంధ చట్టం లాదు.మన దేశంలో రాష్తర్పతి అంటే రబ్బర్ స్టాంప్ అనుకోవడం కొందరి అజ్ఞానం మాత్రమే.కొన్ని చట్టాలకి రాష్తర్పతి పర్యవేక్షణ ఉంటుంది.ప్రజా ప్రాతినిధ్య చహ్ట్టం ప్రకారం కేంద్ర, రాష్త్ర ఎన్నికల లమిషనర్ల మీద పర్ధానికీ పారల్మెంటుకీ కూడా పత్యక్ష అధికారాలు లేవు. అలా ఉంటే వాటికి ఇచ్చిన సెమీ అటాన్మస్ స్టేటస్ అనేది అర్ధం లేని మాట అవుతుంది.


      అలాంటి కీలకమైన చట్టాలతో రాష్త్రపతి చేత నియమించబడిన సర్వ స్వతంత్రుడైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి స్థాయి గల ఎన్నికల కమిషనరును ఒక రాష్ట్ర ముఖ్యమత్రి ఒక జీవోతో తొలగించగలడని అనత్ ధీమా ఎట్లా వచ్చింది నీకు?రాష్తర్ ప్రభుత్వం జీవో తెచ్చ్గిన పంచాయితీ రాక్జ్ చహ్ట్టం పంచాయితీ స్థాయి ఉద్యోగుల నియామకాలకి సంబ్నధించినది అయితే దాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి ఎట్లా వర్తింపజేస్తావు అని కోర్టు భళ్ళున నవ్వింది ముఖం మీద కొట్టినట్టు - హైకోర్టు మిమ్మల్ని ఎర్రిపప్పల కింద లెక్కగట్టి జోకేసిందని మీ అభిమాన హీరోకీ మీలంటి జఫ్ఫాలకీ ఇప్పటికీ అర్ధం కాక్పోవడం మా ఖర్మ!

      ఇవ్వాళ అహికోర్టు మెన్షన్ చేసిన ఆఋతికిల్ ఆధారంగానే కొనిశెట్టి లాయరు గారు బల్లగుద్ది చెప్పాడు ఈ జీవో చెల్లదని.ఒక మామొల్లు లాయరుకీ హైకోర్టు జడ్జికీ తెలిసిన అతి మామూలు పాయింటు సుప్రీం కోర్టు జడ్జీలకి తెలియకపోతేనే తీర్పు మరోలా వస్తుంది - సంఝే!

      Delete
  3. మిత్రులు జై గారు, నేను ఎవరికీ అనుచరుణ్ణి కానండీ, మీకూ తెలుసును. ప్రస్తుతం కనగరాజు గారికి దన్నుగా స్టే ఏమీ లేదు కాబట్టి అదేదో తెచ్చుకొనే దాకా నిమ్మగడ్డ గారిని బయటనే వేచి ఉండమనీ చెప్పలేరు కదా? పైగా ఆయన అధికారం చేపట్టి వ్యవహరిస్తున్నారు. పరిస్థితిపై మీ అవగాహన చెప్పండి.

    ReplyDelete
    Replies
    1. గురువు గారూ, లేబర్ కోర్టు తీర్పు తన పక్షంలో వచ్చిన మరుక్షణం లేతు మశీను ఆపరేటు చేస్తానని కార్మికుడు అనలేడు కదా. ఇదీ అంతే, నిమ్మగడ్డ రమేశ్ తనకు తాను ఇచ్చుకున్న "రీ-ఆపాయిన్మెంటు ఆర్డర్" చెల్లదు. అత్రంలో ఉబలాటబడి విడుదల చేసిన సదరు సర్కులర్ నాలుక కరుచుకొని ఉపసంహరించక తప్పదు. డిక్రీ ఎంఫోర్సుమెంట్ గడువు ముగిసే వరకు సమయం ఉందనే సోయి అతనకి లేకపోయినా లాయర్లు ఏమయ్యారో తెలువదు.

      సుప్రీం కోర్టు స్టే ఇస్తుందో లేదో వేచి చూడాలి. ప్రభుత్వం హైకోర్టు దగ్గర ఇప్పటికే "లీవ్ టు అపీల్" వేసింది. జస్టిస్ కనగరాజ్ గారు కూడా అపీల్ చేయవచ్చు లేదా ఇంప్లీడ్ అవొచ్చు.

      Delete
    2. Article 243K Elections to the Panchayats: The superintendence, direction and control of the preparation of electoral rolls for, and the conduct of, all elections to the Panchayats shall be vested in a State Election Commission consisting of a State Election Commissioner to be appointed by the *Governor*

      కేంద్రం ఎన్నికల్ నిర్వహణ కోసం రాష్ట్రానికి పంపించిన ఉద్యోగి , ROFL.

      నాయనా కూనిశెట్టి శ్రీనివాస్, SEC-CEC తేడాను కాస్త నీ ట్యూషన్ కుర్రాడికి చెప్పవయ్యా బాబు. లేదంటే తానా తందానా కౌబాయ్ liability expert తరహాలో సివిల్ కేసులకు 64 శిక్షలు అంటూ బల్ల గుద్ది మరీ మొదలెట్టగలడు!

      Delete
    3. @Jai Gottimukkala30 May 2020 at 10:10
      Article 243K Elections to the Panchayats: The superintendence, direction..........be vested in a State Election Commission consisting of a State Election Commissioner to be appointed by the *Governor*

      కేంద్రం ఎన్నికల్ నిర్వహణ కోసం రాష్ట్రానికి పంపించిన ఉద్యోగి........ లేదంటే తానా తందానా కౌబాయ్ liability expert తరహాలో సివిల్ కేసులకు 64 శిక్షలు అంటూ బల్ల గుద్ది మరీ మొదలెట్టగలడు!
      hari.S.babu
      నువ్వెల్లి ఆ కేసు వాదించరాదూ, వాదించేసి జగనన్నని గెలిపించేసి సూపర్ మేను మాదిరి చొక్కా చింపుకోరాదూ!రంగూల కేసు విషయంలో సుప్రీం ఏం తీర్పు ఇచ్చిందో చూశాక కూడా వంకర టింకర తోక తిన్నగా అవ్వలేదన్నమాట.

      ఎన్ని డిగ్రీలున్నయ్యేంటి తవరికి లాలో?లా చదివి డిగ్రీ తెచ్చుకుని ప్రాక్తీస్ చేస్తున్న లాయరు యొక్క లా పరిజ్ఞానం మీద ఎక్కడ బడితే అక్కడ ఆ కేసూ ఈ కేసూ కాపీ పేష్టు చేసి కాలరెగరేసే కునిష్టి వెధవలు కామెంటు చేస్తుంటే చూడాల్సొస్తంది - ఖర్మరా బాబూ!

      Delete
    4. @Jai Gottimukkala30 May 2020 at 09:57
      గురువు గారూ, లేబర్ కోర్టు తీర్పు......ఇదీ అంతే, నిమ్మగడ్డ రమేశ్ తనకు తాను ఇచ్చుకున్న "రీ-ఆపాయిన్మెంటు ఆర్డర్" చెల్లదు. {అత్రంలో ఉబలాటబడి విడుదల చేసిన సదరు సర్కులర్ నాలుక కరుచుకొని ఉపసంహరించక తప్పదు.} డిక్రీ ఎంఫోర్సుమెంట్ గడువు.....లాయర్లు ఏమయ్యారో తెలువదు.సుప్రీం కోర్టు స్టే ఇస్తుందో లేదో......లేదా ఇంప్లీడ్ అవొచ్చు.
      hari.S.babu
      హైకోర్టులో స్టే కోసం వేసిన పిటిషన్ గంటలోనే వెనక్కి తీసుకున్నది ఎవరు నాయనా?ఎవరు ఎవరు చేత ట్యూషన్ చెప్పించుకుంటున్నారో ఇంకా తెలియడం లేదా తవుఁరికి?

      Delete
    5. @Jai Gottimukkala30 May 2020 at 10:10
      "Article 243K Elections to the Panchayats........all elections to the Panchayats shall be vested in a State Election Commission consisting of a State Election Commissioner to be appointed by the *Governor*" అని నొక్కి చెప్పడంలో తవురి ఉద్దేశం గవనేరు బాబు రాష్ట్ర ప్రభుత్వానికి చాకిరీ చేసే బంట్రోతు అని అనుకోవాలనా!

      ప్రస్తుత బీజేపీ వైకాపాకు మిత్ర పార్టీ కాబట్టి చెలామణీ అయిందే తప్ప రాష్ట్ర ఎలెక్షన్ కమిషన్ నియామకాల మీద రాష్ట్ర ప్రభుత్వానికీ గవర్నరుకీ ఉన్న అధికారాలు ఏమిటో గతంలో ఎకెక్షన్ కమిషనర్ని నియమించే సందర్భంలో అప్పటి గవర్నర్ నరసింహం గారు చూపించారు కదా!

      కాపీ పేష్టులు చెయ్యడం తగ్గించి ఆ పేష్టు చేస్తున్న విషయానికి సంబంధించి కొంత సొంత శ్రమను కూడా జోడించి సబ్జెక్టు అర్ధం చేసుకుని వాదిస్తే బాగుంటుంది.

      Delete

Post a Comment